Showing posts with label Siluvalo Sagindi Yatra. Show all posts
Showing posts with label Siluvalo Sagindi Yatra. Show all posts

07 March 2021

Siluvalo sagindi yathra సిలువలో సాగింది యాత్ర

సిలువలో సాగింది యాత్ర - కరుణామయుని దయగల పాత్ర 
ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే 

1. పాలుగారు దేహముపైన - పాపాత్ముల కొరడాలెన్నో-
నాట్యమాడినాయి - నడివీధిలో నడిపాయి -
నోరు తెరువలేదాయె ప్రేమ - బదులు పలుకలేదాయె ప్రేమ 
ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే

2. చెళ్ళుమని కొట్టింది ఒకరు -ఆ మోముపై ఊసింది మరియొకరు
బంతులాడినారు - బాధలలో వేసినారు -
నోరు తెరువలేదాయె ప్రేమ - బదులు పలుకలేదాయె ప్రేమ 
ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే

3. వెనుకనుంచి తన్నింది ఒకరు - తనముందు నిలచి నవ్వింది మరియొకరు -
గేలిచేసినారు పరిహాసమాడినారు -
నోరు తెరువలేదాయె ప్రేమ - బదులు పలుకలేదాయె ప్రేమ -
ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే 

4. దాహమని అడిగింది ప్రేమ - చేదు దాహాన్ని ఇచ్చింది లోకం -
చిరక నిచ్చినారు - మరి బరిసెతో గుచ్చారు -
నోరు తెరువలేదాయె ప్రేమ - బదులు పలుకలేదాయె ప్రేమ 
ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...