Showing posts with label కావలెనా యేసయ్య బహుమానము. Show all posts
Showing posts with label కావలెనా యేసయ్య బహుమానము. Show all posts

02 January 2022

Kaavalena Yesayya | కావలెనా యేసయ్య బహుమానము

కావలెనా యేసయ్య బహుమానము 
(మరి) చేయాలి విలువైన ఉపవాసము (2) 
సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియా సంఘమా 
చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా (2)  || కావలెనా || 

నీనెవె పట్టణము యెహోవా దృష్టికి 
ఘోరమాయెను - పాపముతో నిండిపోయెను
సృష్టికర్త యెహోవా యోనాను దర్శించి 
నీనెవెకు పంపెను - కనికరము చూపించెను
ఘనులేమి అల్పులేమి - నీనెవె పట్టణపు రాజేమి
పిల్లలేమి పెద్దలేమి - ఉపవాసము చేయగా 
ఆగింది యెహోవా శాపము 
కురిసింది కరుణ వర్షము (2) || కావలెనా || 

దేవుని ప్రజలను నశియింప చేయుటకు 
దుష్టుడు తలచెను - కలవరము పుట్టించెను 
మొర్దికై వేదనతో రాజునొద్దకు పంపుట 
దైవ చిత్తమని - ఎస్తేరును సిద్ధపరచెను 
ఘనులేమి అల్పులేమి - షూషను కోటలో రాణి ఏమి పిల్లలేమి పెద్దలేమి - ఉపవాసము చేయగా 
అణిగింది హామాను గర్వము 
జరిగింది దేవుని చిత్తము ( 2 ) || కావలెనా ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...