Showing posts with label 227 కోలాహలముగఁ గూరిమితోఁ. Show all posts
Showing posts with label 227 కోలాహలముగఁ గూరిమితోఁ. Show all posts

16 February 2023

Kolahalamuga gurimitho కోలాహలముగఁ గూరిమితోఁ

227
క్రీస్తు రెండవ రాకడ 
రా - కమలమనోహరి, తా - ఆది 
 
కోలాహలముగఁ - గూరిమితోఁ గూడి - కోలాటమాడను రా రా - మా - పాలిటి యేసుని పేరఁ - మాపాలిటి యేసుని పేర - మ - మ్మేలెడి దేవుని పేరఁ ||గోలాహలముగ||
 
1.మా సామి యా మోక్ష - వాసుండు నైనట్టి - యేసయ్య పోకను జూడు - మా యేసయ్యరాకను బాడు - యేసయ్య రాకను బాడు - నీ హోసన్న - యని మదివేడు ||కోలాహలముగ||
 
2.పాపంబులన్ మోసి - ప్రాణంబు బలి యిచ్చి - తాఁ బరమున కేగలేదా - నీ - జ్ఞాపకములోనికి రాదా - జ్ఞాపకములోనికి రాదా - నీ ప్రాపకుఁడై యుండలేదా ||కోలాహలముగ||
 
3.ఏలినవాడైన - యేసుని రాకను - నాలించి చూడవదేర - నిను పాలించు వాడనుకోర - పాలించువాడనుకోర - పరి - శీలించువాడనుకోర ||కోలాహలముగ||
 
4.అంతములో భువి - కా యేసునాధుండు - చెంతను దూతలతోడ - బల్ - వింతగ వచ్చును జూడ - వింతగ వచ్చును జూడ - న - త్యంత బలముతోడ రాఁడ ||కోలాహలముగ||
 
5.ఆకాశ భూమ్యాదు - లార్భటిలు దూతల - మూకలతోఁ గూడినాఁడు - ఈ లోకాని కేతెంచుఁవాడు - లోకాని కేతెంచువాఁడు ఇఁక వీకతోఁ బ్రభుని బాడు ||కోలాహలముగ||
 
6.భీకర సింహపు - టాకారముతోను - ఢీకొని మేఘములతోడ - బల్ - బాకారవంబులు బాడ - బాకారంబులు బాడ - నిటు ఢీకొని వచ్చెను జూడ ||కోలాహలముగ||
 
7.భాసురమైనట్టి - యేసయ్య రాకను - ఈ సూర్యుఁడు జూడలేఁడు తన వి - కాసము జీఁకటౌను వి - కాసము జీఁకటౌను - నీ కా సుగతిఁ జూపువాఁడు ||కోలాహలముగ|| 
- మిక్కిలి సమూయేలు 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...