Showing posts with label Ichhunatti vidhamu teliyandi. Show all posts
Showing posts with label Ichhunatti vidhamu teliyandi. Show all posts

28 July 2024

Ichhunatti vidhamu teliyandi ఇచ్చునట్టి విధము తెలియండి

574
క్రైస్తవ దాతృత్వము
రా - నాథనామక్రియ, తా - అట 
(చాయ: భజన చేయు విధము)

ఇచ్చునట్టి విధము తెలియండి - ప్రియులారా మీరు - హెచ్చు పొందు విధము ఇది నుండి = పుచ్చుకొనుట కన్న నెప్పు - డిచ్చుటయే కడు ధన్యత యని - హెచ్చరించి చెప్పలేదా - యేసు ప్రభు వపొస్తలులకు ||నిచ్చు||

1.శక్తికొలఁది దాన మీయుండి - సోదరులార - భక్తికొలఁది పరుల కీయుఁ డి = శక్తి లేదని సాకు చెప్పక - సణగ కేమియు సరగ శ్రద్ధా - సక్తితో పేదలకు నిచ్చుట - యుక్త మని భావించి మదిలో ||నిచ్చు||

2.నీతిబోధలు చేయువారికి - బోధకులైన నిఖల పాలకులైన - వారికి = ఆతురముతో నీయవలెనని - యనుభవముగల మీరలెల్లరు - చేతులార నీయు డయ్య - ప్రీతి తోడును వారవార ||నిచ్చు||

3.ఆలయ కృత్యములు జరిగించు - యాజకుఁ డెపుడు - నాలయంబువలన జీవించు - ప్రాలుమాలక పనిని జేయఁ బరఃగ మీ యర్పణలఁ గాన్కల - బలవంతము లేక మీరు పలువిధంబు నియ్య వెదకుడి ||నిచ్చు||
– బన్యన్ జోసఫ్ 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...