Showing posts with label A R Stevenson songs. Show all posts
Showing posts with label A R Stevenson songs. Show all posts

11 December 2022

Chinnadaina urilona | చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు


చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన రేడు పుట్టినాడు (2)
దివ్యమైన లోకమందు వాసముండువాడు
దీనులైన వారి మధ్య ఉండగోరినాడు 
రాజ్యాలన్నింటిలో సంబరాలు నేడు
పూజ్యనీయునికి కీర్తనాలుపాడు (2)

నీడలేక గూడులేక సాయమొవచ్చు జడలేక
కృంగియున్నవారికింక తోడు (2)
నమ్ముకున్నవారికి ఆయనే న్యాయం చెయ్యగలిగినోడు (2)
సత్యమును జీవమును తానైయున్నాడు. ||రాజ్యాలన్నిటిలో||

బుద్దిలేక శుద్దిలేక దిద్దుబాటు చేతకాక
కూలబడ్డవారికింక తోడు (2)
కోరుకున్నవారికి ఆయనే రక్షణ ఇవ్వగలిగినోడు (2)
కొండయును కోటయును తానైయున్నాడు ||రాజ్యాలన్నిటిలో||

శాంతిలేక కాంతిలేక ఆశపడ్డదేదిరాక
బెంగపడ్డవారికింక తోడు. (2)
వేడుకున్నవారికి ఆయనే భారందించగలిగినోడు. (2)
మార్గమును ద్వారామును తానైయున్నాడు ||రాజ్యాలన్నిటిలో||

06 December 2022

Devaloka mahimanantha | దేవలోక మహిమనంత
















దేవలోక మహిమనంత భూమిపైకి తెచ్చాడు -
దీనురాలు కడుపు నుండి యేసు ఉదయించాడు (2)
మనుజాళిపై ప్రేమతో దేవదేవుడు - నరరూపమెత్తి బాలుడై నేల కాలు మోపినాడు (2) 

కలిగెను విడుదల సంతోష క్రిస్మస్
వెలిగిన మనసుల సంబర క్రిస్మస్.. ||దేవలోక||

1.చీకటిని దూరంచేసి - దివ్యమైన కాంతినిచూపి -
ఎప్పుడూ మనతోడై నడిపిస్తాడు (2) 
కీడు ఏది రాకుండా దీవెనలు పోకుండా (2)
కంటిపాపలా కాచి భద్రంచేసే ప్రాణ ప్రియుడు 
కలిగెను విడుదల సంతస క్రిస్మస్
వెలిగిన మనసుల సంబర క్రిస్మస్.. ||దేవలోక||

2.పాపితోటి స్నేహం చేసి - పాపముల శిక్షను బాపి -
ఎప్పుడూ మన మధ్యే నివసిస్తాడు (2) 
లోటు చూడనీకుండా - ఆటంకాలు లేకుండా (2)
అన్నింటినీ సమకూర్చి సాయంచేసే ప్రాణ ప్రియుడు 
కలిగెను విడుదల సంతస క్రిస్మస్
వెలిగిన మనసుల సంబర క్రిస్మస్.. ||దేవలోక||

3.వేదనను మాయం చేసి- గుండెలోని బాధను మాన్పి -
ఎప్పుడూ మనతోనే పయనిస్తాడు (2)
శత్రుబారి పడకుండా - ఆశయాలు చెడకుండా (2)
చుట్టూ కేడెమైయుండి - కార్యంచేసే ప్రాణ ప్రియుడు 
కలిగెను విడుదల సంతస క్రిస్మస్
వెలిగిన మనసుల సంబర క్రిస్మస్.. ||దేవలోక||

04 April 2022

Balipashuvuga naa korakai | బలిపశువుగా నా కొరకై ఏతెంచావు

బలిపశువుగా నా కొరకై ఏతెంచావు
క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు
చేతకాని మరణం కాదది చేయబూనినా ప్రేమైక త్యాగమది విమోచనకార్యం జరిగినది క్షమాపణ ద్వారం తీయబడినది

1.శ్రమపొందుచున్నను బెదిరించకుంటివి వధకు తేబడు గొర్రెలా మౌనివైతివి 
హేళన చేయువారిపై కోపించక ప్రార్ధన చేసియుంటివి
కారణమేమి లేకనే దూషించినా బాధను ఓర్చుకుంటివి భారము దించియుంటివి 

2.అధికారమున్నను తలదించుకుంటివి - అవమానములో సహనము వీడవైతివి 
నేరము మోపుచున్నను చలించక ఉత్తరమియ్యకుంటివి
వ్యాధిని అనుభవించుచు ఏమాత్రము రూపము లేకయుంటివి 
స్వస్థత నిచ్చియుంటివి 

3.కొట్టుచుండ వీపును అప్పగించుకుంటివి ఉమ్మువారికి నీ ముఖమును దాచవైతివి 
ఎన్నిక చేయకున్నను గణించక దోషిగ నిలిచియుంటివి
రక్షణ అనుగ్రహించను నీమీదను శిక్షను వేసుకుంటివి
మార్గము చూపియుంటివి

17 January 2022

Nammakamaina Devudavaina | నమ్మకమైన దేవుడవైన


నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)
ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన||

ఆప్తులైన వారే హాని చేయచూసినా - మిత్రులే నిలువకుండినా (2)
న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||

జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా - నష్టమే మిగులుచుండినా (2)
శాపము బాపే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||

కష్ట కాలమందు గుండె జారిపోయినా - గమ్యమే తెలియకుండినా (2)
సాయము చేసే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||

DOWNLOAD MP3 SONG HERE 👇

22 December 2021

Unnathamaina rajyapu vasi | ఉన్నతమైన రాజ్యపువాసీ

ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యా - ఆ మహిమను విడిచావా - 
ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా - ఈ ధరణికి వచ్చావా
నీ జన్మ మనుజాలిపంట - సాతనుకే చితిమంట (2)
నా జీవితమంతా నీ ప్రేమగీతి పాడుకుంటా 

1.మంచివారినే ప్రేమించుట - మాకిలలో సాధ్యము కాదే -
మంచికార్యములు చేయు స్వభావము - మాలోపల కానరాదే (2)
మంచితనమన్నదే లేని (2) వంచకుని కరుణించావా
మహిమను విడిచావా - ధరణికి వచ్చావా (2) ||ఉన్నత||

2.ప్రాణప్రదముగా ప్రేమించిన - తన మిత్రుని కొరకైనా - 
ప్రాణము నిచ్చెడు వారిని ఇలలో - ఎచటా కనుగొనలేమే (2)
గుణహీనుడైన మానవుని (2) ఋణము చెల్లింపదలిచావా
మహిమను విడిచావా - ధరణికి వచ్చావా (2)  ||ఉన్నత||

3. పొరుగువాడు కలిగున్నదానినే ఆశించుటయే తప్ప - 
ఇరుగు పొరుగులకు అక్కరలో సహాయము చేయగలేమే (2)
పురుగువంటి నరమాత్రునికి (2) కరుణతో సర్వమిచ్చావా
మహిమను విడిచావా - ధరణికి వచ్చావా (2) ||ఉన్నత||
DOWNLOAD MP3 SONG HERE 👇

18 December 2021

Gola chesi paadudamura | గోలచేసి పాడుదామురా

గోలచేసి పాడుదామురా - బాలయేసు జన్మవార్తను
గంతులేసి చాటుదామురా - లోకమంతా దివ్యవార్తను (2)

1.లోకాలనేలే రారాజుగా - పశులపాకలో పవళించెను - లోకమంతటిని వెలిగించను - దివ్యజ్యోతిగా అరుదెంచెను (2)
పాట పాడి నాట్యమాడి (2) 
యేసు వార్త చాటలిరా - క్రీస్తు జన్మ చాటలిరా ||గోలచేసి||

2.ఉన్నతమైన మహిమను వీడి - దీన స్థితిలో ఉదయించెను - గొప్పతనమును కోరకుండా - దాసుని రూపము ధరించెను (2)
పాట పాడి నాట్యమాడి (2) 
యేసు వార్త చాటలిరా - క్రీస్తు వార్త చాటలిరా ||గోలచేసి||
DOWNLOAD MP3 SONG HERE 👇

12 December 2021

Ekkadekkado Putti | ఎక్కడెక్కడో పుట్టి

ఎక్కడెక్కడో పుట్టి - ఎక్కడెక్కడో పెరిగి (2)
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
దేవుని సంకల్పం - ఇది సృష్టిలోని చిత్రం (2)

1.ఒంటరి బ్రతుకును విడిచెదరు - 
ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు (2)
పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలి - 
భార్య భర్తలు హత్తుకొనుటేమిటో ||దేవుని||

2.గత కాల కీడంతా మరచెదరు -
వీనులతో సంతసించెదరు (2)
పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు -
ఇష్టముతో పంచుకొనుటేమిటో ||దేవుని||

3.ఫలియించి భూమిని నింపెదరు - 
విస్తరించి వృద్ధి పొందెదరు (2)
పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ -
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో ||దేవుని||
DOWNLOAD MP3 SONG HERE 👇

07 November 2021

Aadarinchi Aashirvadinche | ఆదరించి ఆశీర్వదించే

ఆదరించి ఆశీర్వదించే - మంచిదేవుడు ఇడుగోనండి 
రండి రండి రండి రండి రండి రారండి 
అనుమానాలు వదిలేయండి - అనుకూల సమయమిదే చేరుకొనండి

1. లోకమందు ఎవరైనా మంచివారికై చూస్తారు 
అర్హతలను గమనించి అవకాశాలు ఇస్తారు 
ఏమీలేని దీనులైనా యేసు ఆశ్రయమిస్తాడు 
యోగ్యతలను లెక్కించడండి - యోగ్యులుగా మార్చేస్తాడండి ||రండి||

2. దేవుళ్ళనువారెవరైనా దుష్టులను శిక్షిస్తారు 
నీతిమంతుల రక్షించ దిగివచ్చామని చెబుతారు 
పాపులైన వారికొరకే యేసు భువికి వచ్చాడు
దోషములను లెక్కించడండి - పావనులుగా చేస్తాడండి ||రండి||

3. కన్నవారు ఎవరైనా మాటవింటే ప్రేమిస్తారు 
లోబడని తమ పిల్లలను భారంగా భావిస్తారు 
దారితప్పిన వారికైనా యేసు స్వాస్థ్యం ఇస్తాడు చేసినతప్పులు లెక్కించడండి - ఇంటిలో చేర్చుకుంటాడండి ||రండి||
DOWNLOAD MP3 SONG HERE 👇

26 September 2021

Paramanduna ihamanduna | పరమందున ఇహమందున

పరమందున ఇహమందున సర్వధికారివి (2)
అను నిత్యము దూతాలితో స్తుతియించబడు చుంటివి (2)
రాజ్యం మహిమ యేసయ్య నీదే (2) 
 
1. నీవే సర్వోపకారివి మమ్మును పోషించు చుంటివి (2)
నీవే మా ప్రార్థనలన్ని అంగీకరించు చుంటివి (2) ||రాజ్యం||
 
2. నీవే సర్వాంతర్యామివి మమ్మును పాలించు చుంటివి (2)
నీవే మా వేదనలన్ని మరచిపో చేయుచుంటివి (2) ||రాజ్యం||
 
3. నీవే సత్య స్వరుపివి మమ్మును దీవించుచుంటివి (2)
నీవే మా దోషములన్ని క్షమియించి వేయు చుంటివి (2) ||రాజ్యం||
DOWNLOAD MP3 SONG HERE 👇

Manasunna manchi deva lyrics | మనసున్న మంచిదేవా

మనసున్న మంచిదేవా - నీ మనసును నాకిచ్చావా -
మనసు మలినమైన నాకై - మనిషిగా దిగి వచ్చావా (2)
నా మది నీ కోవెలగా మలచుకోవయా -
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా 
 
1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము -
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము (2)
మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగిన నిజదేవుడా ||నా మది||
 
2. చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను -
వంచన చేసి నడుపును తప్పు బాటను (2)
అంతరంగమును పరిశీలించు యేసయ్యా -
స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా ||నా మది||
 
3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి -
దీన మనస్సుతో నీకడ శిరము వంచితి (2)
పూర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా -
తరతరములకు క్షేమము చేకూర్చుమా ||నా మది||
DOWNLOAD MP3 SONG HERE 👇

04 September 2021

O Nesthama Ee Shubhavartha | ఓ నేస్తమా ఈ శుభవార్త

ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా (2)
నిను ప్రేమించే వారొకరున్నారని - వాస్తవం తెలియునా (2)
నిను రక్షించువాడు యేసయ్యేనని - సత్యం తెలియునా (2)

1.నీవు నమ్మిన వారే.. మోసంతో నీ గుండెనే చీల్చినా
నీ సొంతం జనులే.. నీ ఆశల మేడలు అన్నియు కూల్చిన (2)
ఊహించనివి జరిగినా - అవమానం మిగిలినా (2) ||నిను||

2.నీ కష్టార్జితము.. అన్యాయము చేయు వారికే చిక్కినా
నీకున్న స్వాస్ధ్యము.. దోపిడిదారుల చేతికే చిక్కినా (2)
ఉద్యోగమే ఊడినా - వ్యాపారంలో ఓడినా (2) ||నిను||
DOWNLOAD MP3 SONG HERE 👇

26 August 2021

Korukunna Revuku Nadipinchava | కోరుకున్న రేవుకు నడిపించావా

కోరుకున్న రేవుకు నడిపించావా - కోరికలు తీర్చి కరుణింవా (2)
కొట్టుకొని పోకుండా - ముక్కలే కాకుండా -
చిట్టచివరి వరకు కాచిన దేవా (2)
కోరుకున్న రేవుకు నడిపించావా.. ఆ..ఆ
హైలెస్సో..హైలెస్సో..హైలెస్సో..హైలెస్సో..

1.ఆకాశము తెరచి - మన్న కురిపించి - బండలను చీల్చి - నీటిని రప్పించి (2)
ఆహరమిచ్చావు - దాహాన్ని తీర్చావు (2)
కష్టకాలమునందు - మూళ్ళత్రోవలయందు - విడువక తోడున్నావు (2)
మోఱ్ఱ విన్నావు - దారి చూపావు - నివాసపురము చేర్చావు
కోరుకున్న రేవుకు నడిపించావా..ఆ...ఆ
హైలెస్సో..హైలెస్సో..హైలెస్సో..హైలెస్సో..

2.చీకటి చెరనుండి - విడుదల కలిగించి - మరణములో నుండి - బయటకు రప్పించి (2)
గడియలు విరిచావు - కట్లను తెంచావు (2)
గొప్ప ఆపదరాగా .. దిక్కు తోచకపోగా..  వాక్కును పంపించావు (2)
చేయి చాపావు - పైకి లేపావు - ఆశ్చర్యక్రియలు చేశావు ||కోరుకున్న||
DOWNLOAD MP3 SONG HERE 👇

14 July 2021

Nee Sallani Supe O Yesayya | నీ సల్లని సూపే ఓ యేసయ్యా నా బతుకును

నీ సల్లని సూపే ఓ యేసయ్యా - నా బతుకును మార్చించి మెస్సీయా 
నీ మెల్లని మాటే ఓ యేసయ్యా - నను సేదదీర్చింది మెస్సీయా 

1. పశుశాలలో నీ జన్మ యేసయ్యా - తగ్గింపు నేర్పింది మెస్సీయా 
పరిశుద్ధ నీ నడత యేసయ్యా - మాదిరి నాకుంచింది మెస్సీయా 

2. నీవు కార్చిన రక్తం యేసయ్యా - నా పాపం కడిగింది మెస్సీయా 
నీవు పొందిన మరణం యేసయ్యా - నాకు జీవం పోసింది మెస్సీయా 

3. నీ దేహపు గాయం యేసయ్యా - స్వస్థత కలిగించింది మెస్సీయా 
నీ కలువరియాగం యేసయ్యా - కొత్తజన్మనిచ్చింది మెస్సీయా

Nuvve Kavali Yesuku Nuvve Kavali | నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి

నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి 
నిను దీవించగోరిన తండ్రికి నువ్వే కావాలి 
నిను హెచ్చించగోరిన రాజుకు నీ హృదయము నివ్వాలి 
నీవున్న రీతిగానే - వట్టి పాత్రగానే 

1. నీకున్న ధనధాన్యము అక్కరలేదు - నీదు అధికారము అక్కరరాదు 
నీదు పైరూపము లెక్కలోనికి రాదు - నీదు వాక్చాతుర్యము పనికిరాదు 

అ.ప: నిన్ను నీవు తగ్గించుకొని - రిక్తునిగా చేసుకొని
విరిగి నలిగిన హృదయంతో దైవసన్నిధి చేరాలి 

2. నీకున్న జ్ఞానమంతా వెర్రితనము - నీకున్న ఘనతవల్ల లేదే ఫలితము 
నీ గొప్ప పనులతో ఒరిగేది శూన్యము - నీ మంచితనము ముండ్లతో సమానము

Ningilo Chanduruda Mandagaache | నింగిలోని చందురుడా మందగాచే

నింగిలోని చందురుడా - మందగాచే ఇందురుడా
నిందలేని సుందరుడా - గంధమొలికే చందనుడా 
ఓ .. వెన్నెలంటి చల్లని రాజా - వెన్నలాంటి మనసు నీదయ్యా 

1. ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా - గాయాలు నిన్ను బాధిస్తున్నా 
దాహంతో నోరు ఎండిపోతున్నా - నాలుక అంగిట అంటిపోతున్నా 
ప్రేమతో పెంచి మమతలు పంచిన - నీ శ్రమ చూడలేక గుండె పగిలిన 
తల్లిని శిష్యునికప్పగించి నీ బాధ్యతను నెరవేర్చినావా 
ఓ ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత ప్రేమమూర్తి నీవయ్యా 

2. అందాలమోము పై ఉమ్మివేయగా - నీదు గడ్డము పట్టిపీకగా 
యూదుల రాజని అపహసించగా - సిలువ దిగిరమ్మని పరిహసించగా 
అంతా సహించి మౌనం వహించి - బాధించు వారిపై ప్రేమ చూపించి 
ఏమి చేస్తున్నారో ఎరుగరు క్షమించుమని ప్రార్థించినావా 
ఓ .... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత సహనం చూపినావయ్యా 

3. లేత మొక్కలాంటి నీ దేహము పై కొరడాలెన్నో నాట్యము చేయగా 
మేలే చేసిన కరుణను పంచిన కాళ్ళు చేతులలో సీలలు కొట్టగా 
అంతటి శ్రమలో చెంతను నిలిచి - చింతతో ఉన్న అతివల జూచి 
నాకోసం ఏడ్వవలదని పలికి వారిని ఓదార్చినావా 
ఓ .... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత కరుణామయుడ నీవయ్యా

Yentha Sundaramo Aa Paralokamu | ఎంత సుందరమో ఆ పరలోకము అంతా

ఎంత సుందరమో ఆ పరలోకము - 
అంతా సువర్ణమే ఏమి చిత్రము 
చేరాలనుకుంటే ఆ పట్టణము - 
యేసయ్యకివ్వాలి నీ హృదయము 

1. కాంతి నిచ్చుటకు సూర్యుడు అవసరమే లేదు
వెన్నెలిచ్చుటకు చంద్రుడు అవసరమే లేదు 
దేవుని మహిమయె అచట ప్రకాశించుచుండును
జనములు ఆ వెలుగునందు సంచరించుచుందురు

2. ఆకలి దాహము ఉండనే ఉండవు 
చీకటి రోగము ఉండనే ఉండవు 
ప్రభువైన దేవుడే వారితో నివసించును 
కన్నీటి బిందువులను తానే తుడిచి వేయును 

3. శాపగ్రస్తమైనదేది అందులో ఉండదు
అసహ్యమైనది ఏది అందులో ఉండదు
జీవగ్రంథమందు రాయబడినవారే ఉందురు
ఆయనను సేవించుచు రాజ్యమే చేతురు
DOWNLOAD MP3 SONG HERE 👇

Evadandi Baabu Veedu | ఎవడండీ బాబూ వీడు

ఎవడండీ బాబూ వీడు - ఎంత చెప్పినా వినడు 
గుప్పుగుప్పున వదిలేస్తాడు - తప్పంటే అసలొప్పుకోడు 

1. తాగొద్దురా అంటే నీకు ఎవరు చెప్పారు అంటాడు
పీల్చొద్దురా అంటే ఎక్కడ రాసుందో చూపమంటాడు
దాన్ని చేసినోడే రాసిన హెచ్చరిక మరిచేడు 
గుండె తూట్లు పడ్డాగాని దాన్ని మాత్రం విడువడు 

2. సరదా అంటూ మొదలు పెడతాడు మల్లా దానికే బానిసౌతాడు 
డబ్బులన్ని తగలబెడతాడు కోరి జబ్బులెన్నో తెచ్చుకుంటాడు 
ఆరోగ్యమే క్షీణిస్తున్నా కళ్ళు మాత్రం తెరవడు 
శక్తి అంతా కోల్పోతున్నా ఎంతమాత్రం వెరవడు 

3. దేహమే దేవదేవుని నివాసమని మర్చిపోతాడు
పరిశుద్దంగ ఉంచుమనే క్రీస్తు ఆజ్ఞనే లెక్కచేయడు
పాడు వ్యసనములతోనే నరకమునకు పోతాడు
యేసుక్రీస్తుని నమ్మినచో పరిశుద్ధుడు తానౌతాడు
DOWNLOAD MP3 SONG HERE 👇

06 July 2021

Naa prana priyudu yessayya | నా ప్రాణ ప్రియుడు యేసయ్య

నా ప్రాణ ప్రియుడు యేసయ్య - కరుణా హృదయుడు యేసయ్య 
పరలోకసుతుడు - నాకెంతో హితుడు - నమ్మదగిన నా స్నేహితుడు 

1.అతిసుందరుడు - ధవళవర్ణుడు 
స్తుతియింపదగిన - ఘననామధేయుడు 
నను ప్రేమించిన నజరేతువాడు 
నాకు చాలినదేవుడు - నా హృదయపు నాధుడు
యేసయ్య నా యేసయ్య ( 4 ) 

2.ఐశ్వర్యవంతుడు - దీర్ఘశాంతుడు 
ఆశ్చర్యకరుడు - బహుబలవంతుడు 
రుధిరము కార్చిన నిజమైన జేడు 
ప్రాణమిచ్చిన దేవుడు - నా హృదయపు నాధుడు
యేసయ్య నా యేసయ్య ( 4 )
DOWNLOAD MP3 SONG HERE 👇

Erigiyunnanaya Neekedi Asadhyamu | ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము

ఎరిగియున్నానయా - నీకేదీ అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా - నీవెపుడూ మేలు చేస్తావని
మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని 
మారని వాగ్దానములు - మాకొరకు దాచి ఉంచినావని 

1. నను చుట్టుముట్టిన బాధలతో - నాహృదయం కలవరపడగా - 
నా స్వంత జనుల నిందలతో - నా గుండె నాలో నీరైపోగా (2)
అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే - నను ఓదార్చితివే ||ఎరిగి||

2. మించిన బలవంతుల చేతినుండి - తప్పించిన యేసు దేవుడా - 
వంచనకారుల వలలనుండి - రక్షించిన హృదయ నాధుడా (2)
నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే ||ఎరిగి||

DOWNLOAD MP3 SONG HERE 👇

Naadhi Naadhi Antu Vaadulaata | నాది నాది అంటూ వాదులాట నీకెందుకు

నాది నాది అంటూ వాదులాట నీకెందుకు 
ఏది నీది కాదు సత్యమిది ఎరుగవెందుకు 
ఇహలోక ఆశలెందుకు - పైనున్న వాటినే వెదకు 

1. నిన్న నీది అనుకున్నది నేడు నీది కాకపోయెనే
నేడు నీకు ముందున్నది రేపు కానరాకపోవునే
క్షణికమైనవాటి కొరకు ప్రాకులాట నీకెందుకు 
అక్షయ దైవరాజ్యమే నిలుచును తుదవరకు 

2. నీ దగ్గర ధనముంటే నీ చుట్టు మనుష్యులుంటారు
నీ లోపల బలముంటే నిను మావాడని అంటారు
నీ ధనము నీ బలగం నీ చావునాపలేవు 
తప్పకుండ ఒకనాడు మట్టిలోన కలుస్తావు 

3. నీకున్న గొప్ప ఖ్యాతి నిన్ను రక్షించలేదు 
నీ యొక్క స్వంతనీతి శిక్షను తప్పించలేదు
గడ్డిపువ్వులాంటిదేగదా ఇలలోన నీదు జీవితం
యేసయ్యకు అర్పిస్తే అవుతుందిలే సార్ధకం
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...