Showing posts with label G. Show all posts
Showing posts with label G. Show all posts

01 June 2026

గ్రీన్లాండ్ దేశస్థులును ఇండియా Greenland deshasthulunu india

286
From Greenland's Icy Mountains

1.గ్రీన్లాండ్ దేశస్థులును - ఇండియా జనులున్ 
ఆఫ్రికా ఖండమందు - నివాసులెల్లరు 
సముద్ర ద్వీపస్థులు - సువార్త వెలుగు 
మాకు నిప్పించుడని - మమ్మును పిల్తురు.

2.మా దేవుడిచ్చు సుఖ - సుక్షేమ యీవులు 
ఒక్కొక్క దేశమందు - విస్తారమైనను 
అజ్ఞానులైనవార - లా సత్య దేవుని 
గొల్వక వేరువాటిన్ - పూజించుచుందును.

3.సువార్తకాంతి మాకు - ప్రకాశమైనదా 
అజ్ఞానులందరికి - దాని మేమియ్యమా 
రక్షణ దివ్యవార్త - లోకస్తులెల్లరు 
విని మా యేసుమీద - విశ్వాసులౌదురు.

4.సుక్షేమకరమైన - సువార్త సంగతి
గాలి తరంగములు - వ్యాపింపజేయుడీ 
మా సృష్టికర్త రాజు - నిర్దోషి యాయనే 
మా యేసు దిగి వచ్చి - యీ లోకమేలును.
- రెజినాల్డ్ హేబర్

31 May 2026

ఘన యెహోవా నీ గుడారం Ghana yehova nee gudaaram

266
నిజసేవకుని లక్షణాములు
దావీదు కీర్తన 15
(చాయ: భజన చేయుచు)
రా - ధీర శంకరాభరణం, తా - ఆది 

ఘన యెహోవా నీ గుడారం - బున నతిథియౌ వాడెవండు = తనర నీ పరిశుద్ధ పర్వత - మున వసించెడు వాఁడెవండు ||ఘన||

1.వెలఁయగను యథార్థ వర్తన - గలిగి నీతి ననుసరించుచు = నెలమితో మనసార నిజము - పలుకు చుండువాఁడై సుమ్మ ||ఘన||

2.తనదు నాల్కతోఁగొండె మాడఁడు - తన సఖునకును గీడు చేయఁడు = తనదు పొరుగు వానిపై నిం-దలను మోపఁడించు కేనియు ||ఘన||

3.వానికిని నీచుం డసహ్యుడు - వాఁడు భక్తుల గౌరవించును = హాని కలిగిన నాతఁడును బ్ర - మాణ మాడియు మాట తప్పఁడు ||ఘన||

4.మరియు ద్రవ్యము - వడ్డి కీయఁడు - నిరపరాధినిఁ జెఱప లంచము = అరయఁ డిట్టులఁ జేయువాఁడే - ధర నెపుడు గదల్పఁబడఁడు ||ఘన||

5.జనక తనయ పావనాత్మకు - ఘన మహిమయు కల్గుఁగాక = మును పిపుడు నెల్లప్పుడున్ యుగ - ములకుఁ గల్గునుగాక యామేన్ ||జనక||
- మల్లెల దావీదు 

22 May 2026

గాఢాంధ కారములో నే నడిచిన వేళలలో gaadamdhakaara ne nadachina


గాఢాంధ కారములో -నే నడిచిన వేళలలో (2)
కంటి పాపవలె నన్ను -కునుకాక కాపడును (2)
ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన్ (2)
జడియను బెదరను నా యేసు నాతో నుండగా (2)

1.మరణపు లోయలలో- నే నడచిన వేళలలో 
నే దుడ్డు కర్రయు నీ దండము ఆదరించును 
శుధాత్మతో నింపును -నా గిన్నె పొర్లు చున్నది 
జడియను.. బెదరను.. నా యేసు నాతో నుండగా  ||గాఢాంధ||

2.అలలతో కొట్టబడినా -నా నావలో నేనుండగా (2)
ప్రభు యేసు కృప నన్ను- విడువక కాపాడును (2)
అభయమిచ్చి నన్ను -అద్దరికి చేర్చును (2)
జడియను.. బెదరను.. నా యేసు నాతో నుండగా ||గాఢాంధ||

3.పర్వతములు తొలగినను -మెట్టలు తత్తరిల్లినను (2)
నీ కృప నను విడువదు- నీ కనికరం తొలగదు (2)
నీ నిత్య సమాధానంతో- నన్ను నడిపించును (2)
జడియను బెదరను నా యేసు నాతో నుండగా(2)||గాఢాంధ||

24 September 2023

Gathakaalamantha nee needalona గతకాలమంత నీ నీడలోన


గతకాలమంత నీ నీడలోన - దాచావు దేవా వందనం
కృప చూపినావు - కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన - పొగడన వేనోళ్ళన (2)
వందనం యేసయ్య - ఘనుడవు నీవయ్యా (2) ||గత||

1.ఎన్నెనో అవమానాలెదురైనను
నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగినను
నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)
వందనం యేసయ్య - ఘనుడవు నీవయ్యా (2) ||గత||

2.మాటలే ముల్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించేనాయ
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2)
వందనం యేసయ్య - ఘనుడవు నీవయ్యా (2) ||గత||
వందనం యేసయ్య - విభుడవు నీవయ్యా (2)

10 September 2023

Gadachina kaalam krupalo గడచిన కాలము కృపలో మమ్ము

గడచిన కాలము కృపలో మమ్ము

గడచిన కాలము కృపలో మమ్ము - కాచిన దేవా నీకే స్తోత్రము
పగలు రేయి కనుపాపవలె - కాచిన దేవా నీకే స్తోత్రము (2)
మము కాచిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||

కలచెందినా కష్ట కాలమున - కన్న తండ్రివై నను ఆదరించినా
కలుషము నాలొ కానవచ్చిన -  కాదనక నను కరుణించినా (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రము -  కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము ||గడచిన||

లోపములెన్నో దాగివున్నను - కాదనకా నను నడిపించినా
అవిదేయతలే ఆవరించినా - దీవెనలెన్నో దయచేసినా (2)
దీవించిన దేవా నీకే స్తొత్రముల్‌ - కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము (2) ||గడచిన||

20 August 2023

Gundeninda yesu unte గుండెనిండా యేసు ఉంటే


గుండెనిండా యేసు ఉంటే - కన్నీలైన ముత్యాలు
గుండెగుడిలో యేసుఉంటే - దు:ఖమైన సంతోషం (2)
గుండెనిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే (2)

1.లోక స్నేహం వెలివేసిన - శోకంలో ముంచి వేసిన 
నువ్వే నా నేస్తం
 నా హృదయం చెప్పేదొక్కటే - గుండె నిండా నువ్వే (2) ॥గుండె॥ 

2. ఊపిరంతా శాపమైన గాలికూడా గేలి చేసిన నువ్వే నా చెలిమి
జాలిలేని ఇలలోన నువ్వే నా కలిమి (2) ||గుండె ||

 3.చిరకాలం నీ ఒడిలో ఉండాలనే ఆశ చెమ్మగిల్లే కళ్ళతోనే పాడుతున్నా గీతం భాషకంరని ఊసులతో చేస్తున్న స్తోత్రం (2) ॥గుండె||

02 March 2023

Dayaa Samkalpam lyrics| దయాసంకల్పం|Gaganamu chilchukoni | గగనము చీల్చుకొని

Dayaa Samkalpam - దయాసంకల్పం Hosanna Ministries 2023 new Album Song-6 Pas.Freddy Paul

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానై యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా (2)
నిన్ను చూడాలని నా హృదయమెంతో  ఉల్లసించుచున్నది (2) ఉల్లసించుచున్నది ||గగనము||
 
1.నీదయ సంకల్పమే నీప్రేమను పంచినది 
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2)
పవిత్రురాలైన కన్యకగా నీఎదుట నేను నిలిచెదను (2)
నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2) ||గగనము||
 
2.నీమహిమైశ్వర్యమే జ్ఞానసపదనిచ్చినది (2)
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది
కళంకం లేని వధువునై నిరీక్షణతో నిను చేరెదను (2)
యుగయుగాలు నీతో యేలెదను (2) ||గగనము||

3.నీ కృప బహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది (2)
తేజువాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది (2)
అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో (2)
సీయోనులో నీతో నేనుందును (2) ||గగనము||

04 June 2022

Gathakaalamantha nee needalo| గతకాలమంత నీ నీడలోన

గతకాలమంత నీ నీడలోన - దాచావు దేవా వందనం
కృప చుపినావు కాపాడినావు - ఎలా తీర్చగలను నీ ఋణం 
పాడనా నీ కీర్తన - పొగడన వేనోళ్ళన (2)
వందనం యేసయ్యా - ఘనుడవు నీవాయ్యా (2)
                                            ||గతకాలమంత||
ఎన్నెన్నో అవమానాలేదురైనను 
నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్య 
ఇక్కట్లతో నేను కృంగినను 
నీ చేయి నను తాకి లేపేనాయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము 
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)
వందనం యేసయ్యా - ఘనుడవు నివయ్యా (2)
                                          ||గతకాలమంత||
మాటలే ముల్లుగా మారిన వేల 
నీ మాట నన్ను పలకరించేనాయ 
నిందలతో నేను నిండిన వేళ 
నీ దక్షిణ హస్తం నన్ను తాకేనాయ 
నీ మాట చక్కని జీవపు ఊట 
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2)
వందనం యేసయ్యా - ఘనుడవు నీవయ్యా (2)
                                           ||గతకాలమంతా||

27 March 2022

Gamyam cheralani | గమ్యం చేరాలని నీతో ఉండాలని

గమ్యం చేరాలని నీతో ఉండాలని
పగలూ రేయి పరవశించాలని
ఈ నింగి నేలా కనుమరుగైనా
శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం||

భువి అంతా తిరిగి జగమంతా నడచి
నీ జ్ఞానముకు స్పందించాలని
నాకున్నవన్ని సమస్తం వెచ్చించి
నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో - అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో - అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను||

అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా
శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండినా
నీదు సిలువనే మోయాలని
నా గుండె కోవెలలోనా - నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో - నా తుది శ్వాసను విడవాలని ||సాగిపోతున్నాను||

18 March 2022

Gaayambutho nindaru o shudha | గాయంబుతో నిండారు ఓ శుద్ధ

210  
O Sacred Head once wounded

1.గాయంబుతో నిండారు ఓ శుద్ధ శిరస్సా! 
హా! ముండ్ల కిరీటంబు భరించు శిరస్సా! 
నీకిప్పుడు డపకీర్తి హాస్యంబు గల్గెఁగా 
కర్తా! ఘనంబు కీర్తి ఎన్నడు గల్గుఁగా

2.లోకంబు భీతి నొందు ప్రకాశపూర్ణుడా! 
ఆ యూదులైన వారు నీ మొము మీఁదను! 
నాఁడుమ్మి వేసినారా? నీ ముఖకాంతికి 
సమాన కాంతి లేదు కురూపి వైతివా.

3.నీవోర్చినట్టి బాధ నా క్రూర పాపమే! 
నాకోస మింత బాధ వహించినావుగా! 
దైవోగ్ర బాధ కేను పాత్రుండ నైతిని 
దృష్టించి నన్నుఁ జూఁచి కటాక్ష ముంచుమీ.

4.నేఁ బాపి నైతి గాని నన్ నీవు చేర్చుము! 
నీ నిత్యయూటనుండి మేళ్లన్ని పారును! 
నీ నోరు మాధుర్యంపు సుబోధఁ జెప్పెను 
నీ పావనాత్మ మోక్ష సుఖంబు లిచ్చును.

5.నా కోస మింత బాధ వహించి నందుకు
యధార్థమైన స్తుతి నిత్యంబు నీదగున్ 
నీ నామమందు నేను విశ్వాస ముంతును 
నా యంత్యకాలమందు నా యొద్దనుండుము.
                        - బెర్నార్డ్ క్లైర్ వాక్స్ 
            అను: విలియం గియోనింగ్

02 January 2022

Ghana Daivama Nee Gunathi | ఘన దైవమా నీ గుణాతి

ఘన దైవమా నీ గుణాతిశయములను 
ప్రచురించుటే మా భాగ్యము ఇలలో 
సత్య దేవుడవని పరిశుద్ధుడవని 
మాకై మరణించి తిరిగి లేచినావని ||ఘన||

ప్రతి స్థలమందు ప్రతి పరిస్థితిలో 
పరిపూర్ణమైన పరిశుద్ధతతో 
ప్రకటింతునయ్యా ప్రతి మనుష్యునికి 
ప్రతి విధమైన జ్ఞానము తోడను 
పరలోకమునకు మార్గము నీవని 

నిన్ను నమ్మిన వారిని నరకము తప్పించి 
నాక లోకమునకు నడిపించెదవని 
నిత్యము నీ తోనే నేనుండునట్లు 
నిత్యత్వ మంతా కొనియాడు నట్లు 
మము గొనిపోవగా మహి కేగెదవని
LYRICS : Pastor JAFANYA SASTRY garu,
 BERACHA APOSTOLIC CHURCHH VIZAG

01 January 2022

Gathakalam antha kachavu | గతకాలం అంతా కాచావు

గతకాలం అంతా కాచావు నీ కృపలో 
వ్యధలన్ని తీరే జతలో ..... 
ఇన్ని నాళ్ళ ఆనందం దేవా నీవయ్యా ... 
అన్ని నీవై యుండంగ మదేపొంగి విరబూయ 
నూతన వత్సర కాలములో 
మెండుగ నొసగుము దీవెనలు 
సనాతన భావము తొలగించి నను నడిపించు 

హ్యాపీ ... న్యూ ఇయర్ ... బ్లెస్స్ మీ మై డియర్ ... హ్యాపీ ... న్యూ ఇయర్ ... క్లియర్ మై ఫియర్ ... 

ఏ ఘడియలో ఏం జరుగునో తెలిసేదెలా? 
హృదయానికే 
నీ చిత్తమే లేకుండగ బ్రతికేదెలా?
కృతాజ్ఞతే కోరెను లో లో కోరిక 
సమాస్తము చేరగ నీ పాద పీఠిక 
అందించు నీ హస్తమే దయ నే కోరగ
సంధించు నీ వాక్యమే బ్రతుకే మారగ 
హ్యాపీ ... న్యూ ఇయర్ ... బ్లెస్స్ మీ మై డియర్ ... హ్యాపీ ... న్యూ ఇయర్ ... క్లియర్ మై ఫియర్ ...

నీ శక్తినే నే పొందగ దిన దినమున దీవించుము 
నీ భక్తిలో నేర్పించుము సన్మార్గము 
సహాయమై శ్రేయమై నన్నే చేరగ 
సునంద సంధ్య రాగ మాల గీతం పాడగ 
చలించదా? జ్వలించి నామనసే నిండుగ 
జనించనా? ఫలించి నీలో రోజూ కొత్తగ 
హ్యాపీ ... న్యూ ఇయర్ ... బ్లెస్స్ మీ మై డియర్ ... హ్యాపీ ... న్యూ ఇయర్ ... క్లియర్ మై ఫియర్ ...

31 December 2021

Gathakaalamantha kaachi | గతకాలమంతా కాచి

గతకాలమంతా కాచి నీ మేలులెన్నో చేసితివి (2)
నీ చుట్టె కంచెను మా చుట్టూ ఉంచి నీ వాత్యల్యము చూపితివి (2)
మా బలము నీవే - మా భాగ్యము నీవే - మా దాగుచోటు నీవే యేసయ్యా (2)

1.సీయోను కొండలపై హెర్మోను మంచువలే నీదీవేనలు మాపై కురుపించితివి (2)
నీసన్నిధిలో స్తుతించు చుండగా మా గిన్నె నిండి పొర్లుచున్నది (2)
నీ మహిమైశ్వర్యములో మా ప్రతి అవససము యెహోవా యీరే గా చూచుకొంటివి (2)
మా బలము నీవే - మా భాగ్యము నీవే - 
మా దాగుచోటు నీవే యేసయ్యా (2) || గత ||

2.మా సరిహద్దులలో సమాధానమునిచ్చి మంచి గోధుములతో మము తృప్తి పరచితివి (2) 
దినములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుచుంటివి (2) 
నీ నీతి మార్గమున మేము నడువగా యెహోవా షాలోమ్ మై మాతో నడచితివి - 2 
మా బలము నీవే - మా భాగ్యము నీవే - 
మా దాగుచోటు నీవే యేసయ్యా (2)

25 December 2021

Geethamulu paadudi yesuniki | గీతములు పాడుడీ యేసునికి

115
బాల యేసుకు గీతాంజలి
రా - భైరవి,. తా - త్రిపుట

గీతములు పాడుఁడీ - యేసునికి సం - గీతములు పాడుఁడీ = పాతకుల మగు మనల దారుణ - పాతకము తన విమలరక్త - స్నాతులనుగాఁ జేసి పాపను - భాతకులలో నవతరించెను ||గీతములు||

1.రాజులకు రాజుగా - నేలుచు మోక్ష - రాజ్యమున కర్తగా = బూజలందుచు దూత పరిగణ - పూజితుండౌ ఘనుఁడు తన దగు - తేజ మెల్లను విడిచి యీయిలఁ - దేజహీనులలోనఁ బుట్టెను ||గీతములు||

2.దాసులగు వారలన్ - దమ పటు దోష - త్రాస విముక్తులన్ = జేసి వారల నెల్ల మోక్ష ని - వాసులుగఁ జేయంగ రక్తముఁ - బోసి కృపచేఁగావ వచ్చెను - యేసు నాధుఁడు దీన వృత్తిని ||గీతములు||

3.మానవుల కెల్లను - దేవుని ప్రేమ - మానుగాఁ జూపను = మ్రానిపై దన రక్త మొసఁగఁగ - మానవుండై పుట్టె యూదుల - లోన యేసను పేరుచేఁదా - దీనుఁడై యిమ్మానుయేలు ||గీతములు||

4.ఆదిఁ దన వాక్యము - నందున యేసు - మోదమున్ నిట్లనెన = మేదినిందా మనుజుఁడై యిఁక - సాదరమ్మునఁ బ్రోవ మనుజుల - నా దయాళుఁడు తనదు దేహము - సాధుగా నర్పింతు ననుచును ||గీతములు||
 - మురారి దావీదు

18 December 2021

Gola chesi paadudamura | గోలచేసి పాడుదామురా

గోలచేసి పాడుదామురా - బాలయేసు జన్మవార్తను
గంతులేసి చాటుదామురా - లోకమంతా దివ్యవార్తను (2)

1.లోకాలనేలే రారాజుగా - పశులపాకలో పవళించెను - లోకమంతటిని వెలిగించను - దివ్యజ్యోతిగా అరుదెంచెను (2)
పాట పాడి నాట్యమాడి (2) 
యేసు వార్త చాటలిరా - క్రీస్తు జన్మ చాటలిరా ||గోలచేసి||

2.ఉన్నతమైన మహిమను వీడి - దీన స్థితిలో ఉదయించెను - గొప్పతనమును కోరకుండా - దాసుని రూపము ధరించెను (2)
పాట పాడి నాట్యమాడి (2) 
యేసు వార్త చాటలిరా - క్రీస్తు వార్త చాటలిరా ||గోలచేసి||
DOWNLOAD MP3 SONG HERE 👇

06 November 2021

Guduleni Guvvala | గూడు లేని గువ్వలా

గూడు లేని గువ్వలా దారి తప్పితి -
గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)
నీ గుండెలో దాచుమా - నీ గూటికే చేర్చుమా (2)
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు||

1.గువ్వలకు గూళ్ళిష్టం - కోయిలకు పాటిష్ఠం
నాకేమో నువ్విష్టం - నీ సన్నిధి ఇష్టం (2)
నువ్వంటే ఇష్టం యేసయ్యా
నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా||

2.చేపలకు నీళ్ళిష్టం - పిల్లలకు తల్లిష్టం
నీకేమో చెలిమిష్టం - నా స్నేహం ఎంతో ఇష్టం (2)
నేనంటే నీకెంతో ఇష్టమయ్యా
నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2) ||నా ప్రాణమా||
                            - గుంటూరు రాజా
DOWNLOAD MP3 SONG HERE 👇

20 August 2021

Gatha kaalamulayandu ghanasahayuda | గతకాలములయందు ఘనసహాయుడ

62
అనంత సహాయుడగు దేవుడు
రా - శహన,  తా - మిశ్రచాపు

1.గతకాలములయందు - ఘనసహాయుడ దేవా - హితనిరీక్షణ నీవే - యెన్నేండ్లకైన = అతిగా వీచినగాడ్పు - లందు దుర్గంబీవై - నిత్మాంత గృహమీవే - నిత్యఁడౌ ప్రభువా || గత ||

2.నీ సింహాసన ఛాయ - లో సురక్షితముగ - వాసము సేయుదుము - భవ్యగుణతేజా = నీ సుబాహువేచాలు – నిశ్చయ సురక్షా - వాసముగా నొప్పు – ప్రభువా ఘన దేవా || గత ||

3.నగముల్ వరుసనిలిచి - నగధరనిర్మాణ - మగుటకు మున్నేయ - నంత ప్రభు నీవు - అగణితవత్సరము - నీవే మా - భగవంతుడవు నిన్ను ప్రణుతింతు మేము || గత ||

4.వేయి యుగములు నీకు - దాసగతించిన యొక్క - సాయంత్ర సదృశము = సవిత్రుడురు శో - భాయుతముగ లే - వక ముందు రాత్రిలో - ప్రహరము సుమియవ్వి || గత ||

5.గతకాలములయందు - ఘన సహాయుడ దేవా - హితనిరీక్షణ నీవే - యెన్నేండ్లకైన = క్షితి జీవితాంతము - గతిగానుండుము దేవా - నితాంత గృహ మీవే - నిత్యుడౌ ప్రభువా || గత ||
                                   - జాన్ చౌదరి

Ghanudaina Yehova Gadde | ఘనుఁడైన యెహోవా గద్దె

61
సృష్టికర్త స్తుతి
రా – కాంభోజి, తా – ఝంపై
                      
    ఘనుఁడైన యెహోవా - గద్దె ముందట మీరు - ¹వినతు లిప్పుడు చేయుడి - యోజనులార - వినయంబుగా నిర్మ - లానంద ²రసలహచేయుడ మన మనం బొప్పుచుండ - నో జనులార || ఘనుఁడైన ||

1.ఒక్కఁడే మన కర్తయుండు దేవుడని యున్ – జక్కగాను సృజియించు - సంహరించు ననియున్ - నిక్కముగఁ దెలిసికొండీ మన సహాయమే - మక్కర లేకుండ మనల = మిక్కుటపు పరిపాలనపు బలముచేఁ జేసె – మృత్తుచే మానవులఁగ – దిక్కు = గానక తిరుగు గొ – గ్రెల వలె మనము చెదరఁ – దిరుగఁదన దొడ్డిఁబెట్టె – నో జనులారా ||ఘనుఁడైన ||

2.మే మందరము వందనపు పాటతో మూగి – మించు నీ గుమ్మములలో – మామా స్వరము లెత్తుదుము నభము పొడవుగా – మధురలయ సహితముగను – భూమియున్ దనదు పదివేల జిహ్వల వలఁ – బొందైన నీ నగరి కా – ధామంబులను గాన సన్నుతి వితతిపూరి – తమ్ములుగఁ జేయు దేవా యో జనులార || ఘనుఁడైన ||

3.ధరయంత విస్తారమైయున్నది నీ యాజ్ఞ – తగ విరహితాద్యంతమై – స్థిరమైన కాలంబువలెనే యున్న దయదయ - పొరలిపోవుచు నున్న వ = త్సరముల్ నిలిచిపోయి నప్పటికిని నీదు - సత్యంబు నిలిచియుండున్ – వర శిలా ఖండ పర్వతము తోడను సాటి – వన్నె కెక్కుచు నెంతయున్ ఓ జనులార || ఘనుఁడైన ||
                                       - విలియం డాసన్
________________________________
¹స్తోత్రములు . ²ఆల

19 August 2021

Ghana bhava dupakruthulanu | ఘన భవ దుపకృతులను మాటికి

68
ప్రభువైన యేసునకు స్తుతి
రా – ఆనందభైరవి,  తా – ఆది
(ఛాయ: యేసువంటి ప్రియబంధుఁడు)
               
¹ఘన ²భవ దుపకృతు - లను మాటికి నే - వినుతింతును దే - నిజసుత = యొనరఁగ నాపై - ³ననుక్రోశముఁ దగ - ⁴నునుపవే క్రైస్తవ - జన విహిత || ఘన ||

1.ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా = ⁵పారముఁ దప్పిన - పాతకు నగు నే నారడివడ నీ - కది బిరుదా॥ఘన||

2.జలబుద్బుదముతో - సమ మని నాస్థితి - తెలియద నీకది - దేహధరా ఖలమయ మగు నీ - కర్మినిఁ బ్రోవను - సిలువను బొందిన - శ్రేయఃకరా || ఘన||

3.మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ ⁶సు - నంద నా = యందముగా నా ⁷డెందము కడుఁ దెలి - వొందఁగ నీ దయ - నందు మా || ఘన ||
                           - మిక్కిలి నమూయేలు
____________________________
¹గొప్పయైన. ²నీ ఉపకారములను. ³ప్రేమ. ⁴ఉంచుము. ⁵గట్లు లేక మేర. ⁶సుపుత్రుఁడా. ⁷హృదయము .

Gunavathi aina bharya | గుణవతి అయిన భార్యదొరుకుట

గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా (2)
ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా
జీవితాంతము…
జీవితాంతము తోడురా - వెన్నెల బాటరా (2)
వెన్నెల బాటరా (4) ||గుణవతి||

1. అలసినపుడు తల్లిలా - కష్టాలలో చెల్లిలా (2)
సుఖ దుఃఖములలో భార్యగా (2)
భర్త కన్నుల మేడరా ||జీవితాంతము||

2. మరచిపోనిది మాసిపోనిది - పెండ్లనే బంధము (2)
మరచిపోకుమా జీవితమున (2)
పెండ్లి నాటి ప్రమాణము ||జీవితాంతము||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...