Showing posts with label K Wilson songs. Show all posts
Showing posts with label K Wilson songs. Show all posts

18 August 2020

Prardhana Vinedi Paavanuda | ప్రార్ధన వినెడి పావనుడా

383
ఆదర్శ ప్రార్థన

ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా ||ప్రార్ధన||

1.శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి = పరముడ నిన్ను - ప్రణుతించెదము - పరలోక ప్రార్ధన నేర్పుమయా ||ప్రార్ధన||

2.పరమ దేవుడవని తెలిసి - కరము లెత్తి జంటగ మోడ్చి = శిరమును వంచి సరిగను వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా ||ప్రార్ధన||

3.దినదినంబు చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ = దీనుడవయ్యు దిటముగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా ||ప్రార్ధన||

4.శత్రుమూక నిను చుట్టుకొని - సిలువపై నిను జంపగను = శాంతముతో నీ - శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా ||ప్రార్ధన||
  - కె . విల్సన్
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...