Showing posts with label Neti dina dhyanamu. Show all posts
Showing posts with label Neti dina dhyanamu. Show all posts

11 December 2021

సువార్తను ప్రకటించుడి


🙏ప్రభువు నామములో అందరికి శుభములు🙏 
⛪నేడు దిన ధ్యానము⛪

✝️సువార్తను ప్రకటించుడి✝️

మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. 
మార్కు 16 : 15

కొన్ని సంవత్సరాల క్రితం మనకు ఇప్పుడున్న వార్తా ప్రసార సాధనాలు (కమ్యూనికేషన్ సిస్టమ్) లేవు. చిన్న చిన్న పట్టణాల్లో, పల్లెల్లో టీవీ ఫోన్ ఇంటర్నెట్, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఉండేవి కావు. కనుక మనం పూర్తిగా ప్రింట్ మీడియా అంటే పత్రికల పైన ఎక్కువగా ఆధార పడే వాళ్లం. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కరపత్రాలు అంటే సువార్తకు సంబంధించిన పత్రికలు, పుస్తకాలు తీసుకుని రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడున్న ప్రయాణికులకు ఇచ్చే వాళ్ళము. విరామ బైబిల్ పాఠశాల (వి. బి. ఎస్.) పిల్లలుగా ఊరేగింపుగా వెళ్లి కరపత్రాలు పంచే వాళ్ళం. యేసయ్య సువార్తను ప్రకటించమన్నారని మేము ఇదంతా చేసేవాళ్లం. ఆయన “సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి” అన్నారు.

ఆ రోజుల్లో అందరిని చేరలేక పోయాము. కానీ ఈ రోజుల్లో టీవీ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, అందరినీ చేరుకోవచ్చు ప్రసార మాధ్యమం ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. చాలా తక్కువ ధరలకే ఇంటర్నెట్ (అంతర్జాలం) దొరుకుతుంది. ఇంకా ఉచితంగా కూడా కనెక్షన్లు ఇస్తున్నారు. కనుక మన సమయాన్ని వృధాగా పోనియక జ్ఞానంతో ఉపయోగించుకుందాం. మనకు దొరకినన్ని కమ్యూనికేషన్ సిస్టంలో, ప్రసారమాధ్యమాలు ఉపయోగించుకొని సువార్తను ప్రకటించుదాం.

యేసయ్య మనం అన్ని రకాల ఆశీర్వాదాలు అనుభవించాలని తన ప్రాణమే త్యాగం చేశారు. మనం సువార్తను ఇతరులకు ప్రకటించడం ద్వారా మన ప్రేమను వ్యక్తపరచాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన ఒకే ఒక కోరిక మన దగ్గర నుండి కోరుతున్నారు. కనుక సువార్తను ప్రకటించుదాం.

✝️ప్రార్థన:🛐
తండ్రీ, మాకు దొరికిన ఆధునిక ప్రసార సాధనాలన్నిటిని ఉపయోగించి, మాకు అయినంతవరకు మీ సువార్త ప్రకటించడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్.

07 December 2021

పరిశుద్ధాత్ముడు మీకు భోదించును

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము⛪

✝️(పరిశుద్ధాత్ముడు మీకు భోదించును)✝️

మీరేమి చెప్పవలసినదియు, పరిశుద్దాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను.
 లూకా 12:12.

ఒక్కొక్కసారి మనము కొన్ని సంఘటనలను ఎదుర్కొంటుంటాము. ఎలాగంటే, మామూలుగానే సంఘ ఆరాధనకు వెళ్లి కూర్చుంటాము. ఉన్నట్లుండి ఎవరైనా మనలను ముందుకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడమంటారు. అలాంటి సందర్భాలలో ఏమి చేయగలము? నేనైతే, “పరిశుద్దాత్మ దేవా, ఏమి మాట్లాడాలో బోధించండి” అని ప్రార్థిస్తాను. ఒక్కొక్కసారి మనం ముందుగానే, సిద్ధపరచుకొన్న వర్తమానాలు, అనేక రోజుల ముందే సిద్ధపరచుకున్న వర్తమానాల కంటే ఎక్కువగా ఈ వర్తమానాలు మంచి ఫలితాలనిస్తాయి. ఇది పరిశుద్దాత్మ పనియే తప్ప మరొకటి కాదు. యేసు ప్రభువు అనేక మంది కూడిన జనసమూహములతో మాట్లాడుతున్నారు. వాళ్లు తొక్కిసలాడసాగారు. మొదట తన శిష్యులతో అనేక విషయాలు మాట్లాడారు. ఆ సందర్భములో ఆయన దేహమును చంప శక్తి గల వారికి భయపడవద్దని చెప్పారు. కానీ నరకంలో పడద్రోయగల శక్తి గల వారికి భయపడుమని చెప్పారు. ఇంకా ఆయన “వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును మిమ్మును తీసికొనిపోవునప్పుడు మీరు – ఏలాగు ఏమి ఉత్తరమిచ్చెదమా, ఏమి మాట్లాడుదుమా అని చింతిపకుడి. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్దాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను.” కనుక మనలను చంపగలిగిన వారికి మనము భయపడకుందాము కానీ దేవునికి భయపడి, ఆయా సందర్భాలలో ఏమి మాట్లాడాలో దానికి సరిపోయినట్లుగా, సరియైన మాటలనిచ్చునట్లు, సంపూర్ణంగా పరిశుద్దాత్మ దేవుని పైన ఆధారపడుదాము.
ప్రార్థన:
ప్రియ పరిశుద్దాత్మ దేవా, మేము జీవితంలో ఎదుర్కొనే ప్రతీ పరిస్థితి లోనూ ఏమి మాట్లాడాలో, ఏమి చేయాలో అని మాకు బోధించండి. మీ అద్భుతమైన నడుపుదలకు మీకే వందనాలు యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

👉పరిశుదాత్మకు ప్రార్థించడమంటే, మనము ప్రార్థించేటపుడు ఆయన దైవికమైన సహాయము పైన ఆనుకోవడమే, ఇంకా ఆధారపడడమే. – విలియం త్రాషెర్

ధర్మశాస్త్రము క్రింద లేరు

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము⛪

✝️ధర్మశాస్త్రము క్రింద లేరు✝️

మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.
రోమా 6:14.

పాతనిభంధనలో, దేవుడు మోషేకు ధర్మశాస్త్రము నిచ్చినప్పుడు, మనుష్యులు దేవుని ఆజ్ఞలకు, విధులకు లోబడి ఉండవలసి ఉండినది. పాపముకు శిక్ష ఉండేది. కానీ, ఎప్పుడైతే యేసయ్య, సిలువలో, సర్వ మానవాళి కోసం, సమస్త మానవుల పాపపరిహారార్థం, తనను తానే బలిగా, అర్పించుకున్నారో, అప్పటి నుండి, మనకందరికీ ఉచితంగా పాప క్షమాపణ దొరికింది. ఇది కృప వలననే జరిగింది. కనుక మనము ఇపుడు కృప క్రిందనే ఉన్నాము. పరిశుద్ధ పౌలు గారు రోమా 6:3 లో, ఈ విధంగా వ్రాస్తున్నారు “క్రీస్తు యేసులోనికి బాప్తీస్మము పొందిన మనమందరమూ, ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?”. ఇంకా, 7వ వచనంలో, “చనిపోయిన వాడు పాపవిముక్తుడని తీర్పు పొందియున్నాడు ” అని వ్రాస్తున్నాడు. 8వ వచనంలో, “మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల, మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము” అని వ్రాశారు. కనుక మనమింక ఇపుడు ధర్మశాస్త్రము క్రింద లేము.

ఒక సారి ఒక పాస్టరు ఒక వ్యక్తికి బాప్తీస్మమిచ్చారు. ప్రార్థన, బాప్తిస్మము అయిన వెంటనే, అక్కడ బాప్తిస్మము తొట్టిలోని నీళ్ళలో ఒక సిగరెట్టు పెట్టె, అగ్గి పెట్టె తేలుతూ కన్పించాయి. బాప్తిస్మమిచ్చు తొట్టి చుట్ట్టూ నిలుచున్నా సంఘ సభ్యులు ఏమనుకుంటారో అని పాస్టర్ గారు భయపడుతూ ఆ వ్యక్తితో ” బాబూ, ఇవి నీవేయని అందరి ముందూ ఒప్పుకో, లేదంటే, సంఘసభ్యులు నేనే పొగ త్రాగుతున్నానని అనుకుంటారు” అన్నాడు. అందుకా వ్యక్తి,” అవి నావి కావండి “అన్నాడు. పాస్టర్ దుఃఖమైన ముఖంతో, మళ్ళీ,మళ్లీ “దయచేసి ఒప్పుకో, లేదంటే, అవి రెండూ, నావనుకుంటారు ” అని బ్రతిమాలాడసాగారు. చివరకా వ్యక్తి “బాప్తీస్మము పొందక ముందు అవి నావేనండి, కానీ, బాప్తీస్మము పొందిన తరువాత నేను యేసు క్రీస్తులో నూతన సృష్ఠి . కనుక ఇంక అవి నావి కావండి ” అన్నాడు. అందరి ముందు పాస్టర్ గారు హాయిగా గాలి పీల్చుకున్నారు. అవును ఒక్కసారి, మనము పాపముకు చనిపోతే, మనము యేసుక్రీస్తులో నూతన సృష్ఠి గనుక మనము కృపలో ఉన్నాము.

🛐ప్రార్థన:🛐

యేసు ప్రభువా, మేము సదాకాలము మీతో నివసించునట్లు మా కొరకు మీరు ఉచితముగా అందరికీ, అందుబాటులో ఉన్న కృపనిచ్చినందుకు మీకే హృదయ పూర్వక కృతజ్ఞతలు చెల్లింస్తూ యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి ఆమెన్!

👉విశ్వసించు ప్రతివానికి నీతి కలుగునట్లు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు. - పరిశుద్ధ పౌలు. (రోమా 10:4)

06 December 2021

అర్ధము చేసుకొనుడి


🙏ప్రభువు నామములో శుభోదయం🙏...
నేటి దిన ధ్యానము

✝️అర్ధము చేసుకొనుడి✝️

వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనియెహోవా ఆకాశమునుండి చూచి 
నరులను పరి శీలించెను 
కీర్తనలు 14 : 2

అర్థం చేసుకోవడం అనేది భార్యాభర్తల మధ్య, మిత్రుల మధ్య, బంధువుల మధ్య, కుటుంబంలో, స్నేహితుల మధ్య ఒక పెద్ద సంగతి అయింది, ప్రతి ఒక్కరూ వారిని వేరే వాళ్లు అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. సర్వ సాధారణంగా వినిపించే మాట ఏమిటంటే. “నన్ను ఎందుకు అర్థం చేసుకోరు?” . మనలో చాలా మంది మన సంభాషణలో ఈ మాట వాడుతూ ఉంటాము. మన దేవుడు ఆకాశము నుండి క్రిందకు చూస్తూ తనను అర్థం చేసుకునే వారు ఎవరైనా ఉన్నారా? అనుకుంటున్నారు. కీర్తనకారుడు కీర్తన 14 లో "తనను ఎవరైనా అర్థంచేసుకుంటున్నారా అని తెలుసుకోవాలనుకుంటున్నారు” అని రాస్తున్నాడు. ఎవరైనా మంచి చేసే వాళ్ళు ఉన్నారా? అని చూస్తున్నారు. కానీ ఆయనకు ఎవరూ దొరకలేదు. కీర్తనకారుడు మంచి చేసే వాళ్ళు ఎవరు లేరు ఒక్కరు కూడా లేరు అని రాస్తున్నాడు. ఆ సమయంలో అందరూ దుష్ట క్రియలు చేస్తూ, పేదవాళ్లను నిర్లక్ష్యం చేస్తూ, దేవుని దృష్టికి దుష్టులై వున్నారు.

చివరగా ఏడవ వచనంలో “సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును” అని రాశారు. ఆమెన్!

ఈ రోజుల్లో కూడా మంచి వారి కోసం, తనను అర్థం చేసుకునే వారి కోసం, దేవుడు పై నుండి చూస్తున్నారు. కనుక మంచి పనులు చేసి, ఆయనను అర్థం చేసుకుని, ఆయనను సంతోషపరచెదము. ఆయన నీతిమంతులను కనుగొనినప్పుడు మనము ఉల్లసించి, సంతోషించిదము.

🙏ప్రార్ధన:🙏

ప్రభువా మిమ్మును అర్థం చేసుకొనే మంచి హృదయం మాకు ఇవ్వండి, అప్పుడు మీరు పైనుండి చూసినప్పుడు మేము మీ దృష్టికి నిందారహితులిగా కనబడునట్లు గా చేయుమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి! ఆమెన్.

👉శాంతి అనేది బలవంతం మీద రాదు, అది అర్థం చేసుకోవడం వల్లనే సాధ్యపడుతుంది. - ఆల్బర్ట్ ఐన్స్టీన్

04 December 2021

అన్ని పరిస్థితులు వ్యతిరేకంగానే ఉన్నాయి


🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏

నేడు దిన ధ్యానము

✝️అన్ని పరిస్థితులు వ్యతిరేకంగానే ఉన్నాయి✝️

అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలంగానే ఉన్నావని వారితో చెప్పెను.
 ఆది 42 : 36.

యాకోబు కుమారులు ధాన్యం కొరకు ఐగుప్తుకు వెళ్లి, ధాన్యపు మూటలతో వచ్చి షిమ్యోనును ఐగుప్తులోనే విడిచిపెట్టినట్లు చెప్పినప్పుడు యాకోబు ” అన్ని నాకు వ్యతిరేఖంగానే ఉన్నాయి” అంటున్నాడు.

ఇశ్రాయేలు కుమారులు మొదటిసారి ధాన్యమును కొనడానికి ఐగుప్తుకు వెళ్లినప్పుడు యోసేపు వారి కన్నుల ముందర షిమ్యోనును కావాలనే బంధించాడు. వాళ్లు తిరిగి తమ తండ్రి వద్దకు వచ్చినప్పుడు యాకోబు చాలా నిరుత్సాహపడ్డాడు. “ఒకరి తరువాత ఒకరు నా కుమారులను నేను పోగొట్టుకున్నాను” అని అంటున్నాడు. “ఇంకా ఇవన్నీ నాకు వ్యతిరేఖంగా ఉన్నాయని” అంటున్నాడు. కానీ నిజానికి ఇవన్నీ ఇశ్రాయేలు యొక్క మంచికే జరుగుతున్నాయి.

ఆదికాండము 45 : 4,5,7,8 లో, యోసేపు “నా దగ్గరకు రండి” అని తన సహోదరులతో అన్నాడు. అప్పుడు అతని అన్నదమ్ములు అతని దగ్గరికి వెళ్లారు. అప్పుడు యోసేపు “నేను మీ సహోదరుడనైన యోసేపును, మీరు ఐగుప్తు నుండి అమ్మివేసిన యోసేపును. కానీ మీలో మీరు దుఃఖపడుకుడి, కోపపడకుడి. మీకు సంతాపము పుట్టనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి, దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును, ప్రాణములతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు” అని వాళ్ళతో ఇంకా మాట్లాడి తన తండ్రితో సహా అందరినీ, ఇంకా బంధువులందరినీ ఐగుప్తుకు తెచ్చుకున్నాడు. చివరికి యాకోబు చాలా సంతోషించాడు.

మీరు మీ జీవితంలో అన్ని వ్యతిరేఖంగా జరుగుతున్నాయని అనుకుంటున్నారా? మీ మంచికి ఏదీ కూడా సమకూడి జరగడం లేదని అనుకుంటున్నారా ? దిగులు పడకండి. మీకు వ్యతిరేఖంగా జరుగుతున్నాయని మీరు అనుకునే సంగతులన్నీ మీకు సమకూడే జరుగుతున్నాయి.

🛐ప్రార్థన:🛐

ప్రభువా, మీ ఆలోచనలను , ప్రణాళికలను , ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

👉ఎప్పుడైతే మీరు వ్యతిరేక ఆలోచనలను సానుకూల ఆలోచనలతో మార్చి వేస్తారో, అప్పుడే మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. – విల్లి నెల్సన్.

03 December 2021

నిత్య రాజ్యము


🙏ప్రభువు నామములో  శుభోదయం🙏

⛪ నేటి దిన ధ్యానము⛪

✝️ *నిత్య రాజ్యము*✝️

ఆయన రాజ్యము అంతములేనిదై యుండును. 
లూకా 1:33

    దావీదు వంశములో జన్మించిన, దావీదు కుమారుడు అని పిలువబడి, నేను దావీదు వేరు చిగురు సంతానమును అని చెప్పుకున్న,యేసును విశ్వసించిన విశ్వాసులను ఆయన ప్రస్తుతం పరిపాలిస్తూనే ఉన్నాడు. దానిని గూర్చి దానియేలు ప్రవక్త కూడా ప్రవచించాడు. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును, ఆయన సేవించునట్లు ప్రభుత్వమును, మహిమను, అధిపత్యమును ఆయన కియ్యబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది. అది ఎన్నిటికిని తొలిగిపోదు. అది ఎన్నటికీ లైన్ కాదు దాని లక్కీ ప్రవచనం వాక్యం భౌతిక సంబంధమైన రాజ్యమును గురించి చెప్పబడిన ప్రవచనం మాత్రం కాదు. యేసు క్రీస్తు రాజ్యం ఎప్పుడో మానవ హృదయాలలో స్థాపించబడింది. అయితే ఏసు పరలోకరాజ్యము భూమి మీద నాకు సర్వాధికారి ఇయ్యబడింది. అయితే ఆయన ప్రత్యక్షంగా వచ్చి పరిపాలించే రోజు ఒకటి ఉంది అది త్వరగా వస్తుంది. ఆనాడు సిలువలో దొంగ దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రానైయున్నాడు అని విశ్వసించినట్లు మనకు కనబడుతుంది. ఆయన రాజ్యం స్థాపించబడు తుంది మరియు పరలోకము తెరవబడి ఉండుట చూడగలము.

🛐 *ప్రార్ధన:-*🛐

ప్రియ ప్రభువా! నిత్య రాజ్యము వైపు మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి.ఆమెన్!

30 November 2021

వినబడిన ప్రార్థన


🙏ప్రభువు నామములో శుభోదయం🙏...
⛪ నేటి దిన ధ్యానము:- ⛪

 ✝️*వినబడిన ప్రార్థన* ✝️

ఈ భాగం హేరోదు రాజు కాలంలో జెకర్యా యూద యాజకుడు అబియా తరగతికి చెందిన యాజకుడు. యూద యాజకులు 24 తరగతులుగా విభజింపబడ్డారు. వాటిలో అబియా ఒకటి. జెకార్య భార్య ఎలిజబెతు కూడా ఒక యాజకుని కుమార్తె. అతడు అహరోను సంతతి వాడు.ఎలిజబెతు గొడ్రాలు కాబట్టి ఆమె సంతానము లేకున్నది.ఒక స్త్రీ కి సంతానము లేకపోతే దానికి ఆమె పాపమే కారణమని యూదులు తలంచే వారు; అయితే లూకా "వారు దేవుని దృష్టికి నీతిమంతులై యున్నార"ని చెబుతున్నాడు. వారు బిడ్డల కొరకు దేవుని ప్రార్థించారు. కాని దేవుడు వారి విన్నపాన్ని దయ చేయలేదు. ఈ 24 యాజక భాగాలకు చెందిన యాజకులు ప్రతి సంవత్సరము రెండు వారాల పాటు యెరుషలేములోని యూదుల దేవాలయములో సేవా విధిని నిర్వహించాలి. ఆలయములోని పరిశుద్ధ స్థలములో దినానికి రెండు సార్లు ధూపము వేయాలి. ప్రతి తరగతిలో అనేకమంది యాజకులు ఉండటం వలన ప్రతి దినము ఎవరు ధూపము వేయాలో చీట్లు వేసి నిర్ణయించేవారు. యాజకుడు పరిశుద్ధ స్థలంలో ధుపము వేస్తుండగా ఆరాధించడానికి వచ్చిన వారు వెలుపల కనిపెట్టే వారు. తన పని ముగించుకుని తర్వాత అతడు బయటకు వచ్చి ప్రజలను దీవించే వాడు. అతడు పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు ఒక దూత ప్రత్యక్షమై భయపడవద్దు! నీ ప్రార్థన నాకు వినబడింది. నీకు నీ భార్య ఎలిజబెతుకు కుమారుడు కలుగుతాడని చెప్పాడు. ఆ బాలునికి వారు "యోహాను" అను పేరు పెట్టాలని చెప్పెను అ పేరు కు అర్ధము "దేవుడు దయగలవాడు" అని అర్థము. దేవుడు జెకర్యా ఎలిజబెతుల ప్రార్ధన విన్న దేవుడుగా, ఆశీర్వదించిన దేవుడుగా మనం చూస్తూ ఉన్నాము మన జీవితాల్లో కూడా అలాంటి ప్రార్థన చేద్దాం దేవుడు మన ప్రార్ధన ఆలకించే దేవుడుగా మనల్ని నడిపించి అభివృద్ధి పరచును గాక ఆమెన్!

 🛐*ప్రార్థన:-* 🛐
ప్రియ ప్రభువా! మా ప్రార్థనలను వినే దేవుడుగా, జవాబు ఇచ్చే దేవుడుగా, దేవా నా ప్రార్థనలన్నియు ఆలకించిమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.ఆమెన్!

దేవుని పిల్లలు

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము⛪

✝️ *దేవుని పిల్లలు* ✝️

దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
యోహాను 1:12

దేవుని పిల్లలు ప్రకృతి సంబంధు కాదు. వారు ఆత్మ వలన జన్మించిన వారు. వారు దేవుని వలన పుట్టినవారు. క్రైస్తవుడిగా, దేవుని కుటుంబ సభ్యుడిగా ఉండాలంటే, ఒకడు తిరిగి జన్మించాలి. మన శక్తి వలన లేక మన కోరిక వలన మనము దేవుని పిల్లలము కాము గాని కేవలం దేవుని కృప వలననే ఆయన పిల్లలమవుతాము. ఆయనే మొదట మనలను ఏర్పరచుకున్నాడు. భార్య భర్తల ఇష్టము వలన ఈ లోక సంబంధమైన పిల్లలు పుడుతారు. ఆయన చిత్తప్రకారము పుట్టిన వారే దేవుని పిల్లలు. మనము క్రీస్తును మన ప్రభువుగాను, రక్షకునిగా ను ఒప్పుకున్నప్పుడు మనము దేవుని కుటుంబములో పుడతాను. మనము ఆ కుటుంబములో పుట్టినప్పుడు మనము ఆయన పిల్లలమవుతాము. మనము ఆయన పిల్లలమై నప్పుడు ఆయన వారసులమౌతాము. వారసత్వం పొందడానికి మనము మొదట పిల్లలుగా వుండాలి. పిల్లల గా ఉండాలంటే మొదట జన్మించాలి. మనము దేవుని కుటుంబం లో పుట్టడానికి మొదటిగా క్రీస్తును మన ప్రభువుగా మరియు రక్షకుడుగా ఒప్పుకోవాలి. మన ప్రయత్నం వలన గాని లేక మన మంచి పనుల వలన గాని ఆయన పిల్లలు కాలేము. ఒక దాసుడు ఒక ఇంట్లో నమ్మకంగా ఎన్నో ఏండ్లు పనిచేసినా,అతడు సేవకుడుగా ఉంటాడే గాని కుమారుడు కాలేడు. మనము దేవుని పిల్లలము కాలేము, అయితే జన్మ ద్వారానే ఆత్మీయ జన్మ ద్వారానే మనము ఆయన పిల్లలమౌతాము
.
🛐 *ప్రార్థన:-*🛐

మా ప్రభువా! దేవుని పిల్లలు అనే ఆధిక్యతను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్!

26 November 2021

నిజమైన వెలుగు


🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము:-⛪

✝️ *నిజమైన వెలుగు*✝️

నిజమైన *వెలుగు* ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. 
యోహాను 1:9 

సృష్ట్యాది దేవుడు కలుగజేసిన వాటిలో *వెలుగు* ఒక ప్రశస్తమైనది అనుగ్రహింపబడినది. అందుకే "మంచిదైనట్టు" దేవుడు చూచిన వానిలో 'వెలుగు' మొదటిది. *వెలుగు* ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది. వెలుగు దైవిక సంబంధమైనదిగా చీకటి లేక అంధకారం సాతాను సంబంధమైనదిగా ప్రాచీన కాలం నుండి నమ్మబడుతుంది. వాస్తవానికి చీకటిని దేవుడు సృజించలేదు. వెలుగు లేని చోటే చీకటి! అంధకారం!! వెలుగు ప్రకాశించును అయితే దేవుడు వెలుగును చీకటిని వేరుపరచాడు.అంటే వెలుగు ప్రచురించబడే చోటు, ప్రసరింపబడని చోటుల మధ్య ఒక గీత వుంది. మరో మాట చెప్పాలంటే వెలుగు ప్రసరింపబడటానికి ఒక పరిమితిని దేవుడు ఏర్పరచాడు. ఇశ్రాయేలు చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు సంభవించాయి. పలుమార్లు పడిపోయారు. అనేకసార్లు ధర్మశాస్త్రాన్ని మీరారు. ఇశ్రాయేలీయులే కాదు యావత్ ప్రజలు దైవిక వెలుగును కోల్పోయి చీకటి సంబంధులుగా జీవిస్తున్నారు. అందుకే యెషయా 9:2 లో "చీకటిలో నడుచు జనులు" అని ప్రస్తావించారు. ఈ చీకటి అనేక అంశాలతో కూడుకున్న చీకటి! అందుకే బైబిల్లో ఆయా సందర్భాల్లో అజ్ఞానాంధకారం, మరణానంతరం, పాపంధకారం విశేషములు ప్రయోగించ పడ్డాయి. ఒక దీపం చుట్టూ ఒక పురుగు తిరుగుతూ ఉంది. అది ఆ దీపంతో ఒక ప్రశ్న అడిగింది. 'వెలుగుతూ ఉండడమే నీ పనా? అని దానికి ఆ దీపం జవాబిస్తూ "కాదు! వెలుగుతూ ఉండడం నా పని కాదు, వెలుగుతూ ఉండడం నా స్వభావం!" అని అంది. ఆ పురుగు ఆశ్చర్యపడుతూ పనికి, స్వభావానికి కి తేడా ఏమిటి అని అడిగింది. జవాబుగా దీపం "పని బయట నుండి ఆరోపించబడేది"కానీ స్వభావం లోపలినుండి ఆవిష్కృతమయ్యేది"! కనుక పని తాత్కాలికం!! స్వభావం ఆమరణాంతం అని చెప్పింది. క్రైస్తవుడు క్రీస్తు వెలుగును స్వీకరించట కేవలం పనిగా కాదు అది ఆంతర్య స్వభావులై నిరంతర ఆధ్యాత్మిక ప్రకాష్ కొద్దిగా బాస్ ఎల్లాలి చీకటిలో నడుచును గొప్ప వెలుగును క్రీస్తులో చూసినట్లు చీకటి నుండి విడుదల పొందాలి.

🛐 *ప్రార్థన:-* 🛐
ప్రభువా! మేము నీ వెలుగులో నడచునట్లు మమ్మును బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.ఆమెన్!

మిక్కిలి ఎక్కువ ఇచ్చే దేవుడు


🙏ప్రభువు నామములో శుభోదయం🙏

⛪ నేటి దిన ధ్యానము ⛪

✝️ *మిక్కిలి ఎక్కువ ఇచ్చే దేవుడు*✝️

కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు 
దేవునికి తెలియజేయుడి.
ఫిలిప్పీ. 4:6

దేవుని పిల్లలుగా ఉన్న మనం దేనిని గురించి చింతపడకూడదు.కష్టంలోను,సంతోషంలో దేవుడు మనకు అండగా ఉన్నాడు అని నమ్మి,మన జీవితం విశ్వాసంతో కొనసాగించాలి.ప్రతి విషయాన్ని ప్రార్ధన విజ్ఞాపనల ద్వారా దేవునికి తెలియపరచాలి. అంతేకాని నీ ఇష్టన్ని అడుగకూడదు,దేవుని చిత్త ప్రకటన దేవుని ప్రతి ప్రకారం ప్రతీ పనీ జరిగించాలని కోరుకోవాలి.

నీవు ఏ విషయాన్ని అయినా దేవుని సమక్షంలో విజ్ఞాపన తెలియపరిచిన ప్పుడు నా తండ్రి నా విన్నపం విని నాకు తప్పక జవాబు ఇస్తాడు అని నమ్మి ముందుగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చాలి అటువంటి కృతజ్ఞత పూర్వకమైన విన్నపం దేవునికి చాలా ఇష్టం. నీవు దేవుని పై ఉంచిన నమ్మకాన్ని ఆయన ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడు నీవు చెల్లించే స్తుతులకు రెట్టింపు ఆశీర్వాదం దేవుడు మీకు కలుగజేస్తాడు. ఆ రీతిగా ఆశీర్వాదాలు పొందుకోనే స్థితి దేవుడు మీకు కలుగజేయును గాక!

🛐ప్రార్ధన🛐
ప్రభువా మీరు నాయెడల చూపిన కృపలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్..

దేవుని సంతోషపెట్టాలి

🙏ప్రభువు నామములో శుభోదయం🙏

⛪నేడు దిన ధ్యానము⛪

✝️ *దేవుని సంతోషపెట్టాలి*✝️

నీ ఆనందప్రవాహములోనిది 
నీవు వారికి త్రాగించు చున్నావు. 
కీర్తనలు 36:8

మనుషులు అనుభవించే మంచితనాన్ని దావీదు రాస్తున్నాడు. మనుషులు చెడుతనానికీ, దేవుని కృపకూ మధ్య ఉన్న భేదం గురించి కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. నీ పొరుగు వారు నీకు కీడు చేయటానికి ఆలోచన చేస్తారు. కానీ దేవుడు నీకు మంచి జరగాలనే కోరుకుంటాడు. దేవుని కృప ఆకాశమంత విశాలమైనది. దేవుని నీ పట్ల చేసే పనులన్నీ కేవలం న్యాయ సమ్మతమైనవే. దేవుని యొక్క అనుగ్రహాన్ని నీవు,నేను ఈ లోకం ఎవరు కూడా వెలకట్టలేనిది. నీవు అనుభవించే ప్రతి మంచి వస్తువు దేవుడిచ్చినదే. కుటుంబాన్ని పిల్లలను, మీ జీవిత భాగస్వామిని అన్నింటినీ దేవుడు నికిచ్చినవే. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన దాన్ని అసహ్యించుకుంటే, దేవుని అసహ్యించుకున్నట్లే. దేవుని అనుమతి లేనిదే దేవుని అనుగ్రహం లేనిది ఏదీ కూడా నీ దగ్గరకు రాదు నీకు సొంతం అవ్వదు. దేవుడు నీ కొరకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని సంతోష పరచాలి. ఇచ్చిన దేవుని నీ ప్రవర్తనతో సంతోష పెట్టాలి. అలా దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు నీవు, నీ కుటుంబం దేవుని ఆనంద ప్రవాహంలో ప్రవేశించి, దేవుని వెలుగు పొందుటకు దేవుని ప్రేమ నీకు తోడైయుండును గాక!

🛐 *ప్రార్ధన:-*🛐

ప్రియ ప్రభువా! నేను కలిగి ఉన్న సమస్తము నీ వలన కలిగినది వాటిని ఉపయోగించి మిమ్మును నిత్యము సంతోష పెట్టువానిగా నన్ను ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్!

25 November 2021

నిర్మలమైన మనస్సాక్షి


🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము⛪

✝️ *నిర్మలమైన మనస్సాక్షి*✝️

 క్రీస్తు నందున్న మీ సత్ ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు.
1 పేతురు 3:16

నీవు మనస్పూర్తిగా, ఇష్టపూర్వకంగా దేవునిని నీ హృదయంలో ప్రభువుగా అంగీకరించు. అన్ని విషయాలలో క్రీస్తునందు నీ సత్ ప్రవర్తన సరిగా ఉందో లేదో పరీక్షించుకో ?
మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎప్పుడు అందరూ నన్నే చూస్తున్నారు అనుకుంటాడు. వీధిలో నడుస్తూ ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే వారు నా గురించే మాట్లాడుకుంటున్నారు అనుకుంటాడు. నేను వీధిలో నడవలేక పోతున్నాను పాస్టర్ గారు, అందరూ బహుశా నా గురించే మాట్లాడుకుంటున్నారు అంటాడు. నీ క్రియలు సరైన రీతిలో ఉండి, నీ హృదయంలో సరైన ఆలోచనలు ఆలోచిస్తే నీకు ఆ తలంపులు రావు. నీ ప్రవర్తన, నీ మనసు సరిగ్గా ఉంచుకో ముందు. ఆ తర్వాత నీపై అపనింద మోపే వారిని గురించి దేవునికి తెలియపరచు ఆయనే చూసుకుంటాడు. నీవు క్రీస్తు బిడ్డవై ఉండి నీలో ఎటువంటి హేతువు లేకుండా నిర్మలమైన మనస్సాక్షి, సాత్వికం కలిగి ఉంటే దేవుడు నిన్ను విడిచి పెడతాడా? ఆయన బిడ్డగా ఉన్నప్పుడు ఆయన బిడ్డ మీద నిందలు వేస్తే ఆయన ఊరుకుంటాడా, ఆలోచించు. ఏ మనిషినికి మరొక మనిషికి హాని చేసే అధికారం ఇవ్వబడలేదు. భూమియు దాని సంపూర్ణతయు దేవుని ఆధీనంలో ఉన్నవని వాక్యము చాలా స్పష్టంగా బోధిస్తుంది. నా గురించే మాట్లాడుకుంటున్నారు అని ఆలోచించకు ముందు క్రీస్తులో నీ ప్రవర్తనను సరి చేసుకో. అప్పుడు దేవుడు ఆయన తన రెక్కలచాటున నిన్ను కాపాడి, ఏ నిందలు నీకు తగలకుండా నిన్ను కాపాడుతాడు. అటువంటి కాపుదల నీకు కలుగును గాక!

🛐 *ప్రార్ధన* 🛐
నా రక్షకా! నా జీవితంలో ఎన్ని నిందలు, ఆటుపోట్లు వచ్చినా, మంచి మనస్సాక్షిని కలిగి, మీ ఆలోచనలు కలిగి జీవించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్!

23 November 2021

ఏ పరిస్థితి నుండి అయినా ఆయన రక్షించగల సమర్థుడు

🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము⛪
 *
✝️ *ఏ పరిస్థితి నుండి ఆయన రక్షించగల సమర్థుడు*✝️

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని  - యెషయా 49:8

బంధింపబడిన ప్రజలకు చీకటిలో ఉన్న ప్రజలకు దేవుడు బలమైన దుర్గము గా ఉంటున్నాడు. ఎటువంటి కష్టంలో, ఏ బాధలో నీవు బంధింపబడి ఉన్న ఆదుకుంటానని సెలవిస్తున్నాడు.ఒక రాజు తన శత్రువుల బారినుండి తప్పించుకోవటానికి ఒక గుర్రమును, ఒక దీపము, తాను పెంచుకుంటున్న పక్షి తీసుకుని ఎడారి ప్రాంతానికి ఎవరికీ తెలియని ప్రాంతానికి వెళుతున్నాడు చాలా చీకటి పడిపోయింది. ఎడారిలో కదలకుండా ఒకేచోట కూర్చుని ఉండిపోయాడు. చాలా భయంకరమైన గాలి రావడం మొదలైంది. ఆ గాలికి దీపం ఆరిపోయింది పక్షి పారిపోయింది పక్షి టపటపా కొట్టుకోవటంలో గుర్రం బెదిరిపోయి పారిపోయింది. అతను ఒంటరిగా ఉండి పోయాడు. ఏదో లైట్ లు దగ్గరికి వస్తున్నట్లు, గుర్రాల చప్పుళ్ళు వస్తున్నట్లు అనిపించి ఆ ఎడారిలో కదలకుండా శబ్దం చేయకుండా పడుకున్నాడు. శత్రు సమూహాలు అతనిపై నుంచి వెళ్లి పోయినవి కాని అతని పై నుంచి వెళ్లి పోయినవి కానీ అతనిని కనుగొన లేకపోయింది ఉదయం చూడగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. శత్రువుల నుంచి తనను కాపాడినందులకు దేవునికి వందనాలు తెలియ పరిచాడు. ఉదయాన్నే తన గుర్రం ఇంకొక గుర్రాన్ని తీసుకువచ్చింది. సంతోషించి తన ప్రయాణాన్ని ముందుకు సాగించాడు, ఎంత గొప్ప దేవుడో చూసారా నీ శత్రువుల నుంచి ఎలా కాపాడాలో, ఏ సమయానికి నీకు ఏది అవసరమో ఎరిగిన దేవుడు, ఆ రాజును కాపాడిన దేవుడు, నిన్ను కాపాడలేడా? నీ జీవితాన్ని తీర్చిదిద్దలేడా?దేవునిని వేడుకో,ఆయనే నిన్ను కాపాడి, నీ కష్టాలన్నీ తీరుస్తాడు, అటువంటి అనుకూల సమయం దేవుడు నీకిచ్చే వరకు ఎదురు చూస్తూ దీవెన పొందుకో.. 

 🛐*ప్రార్థన:-*🛐
 నా రక్షకా! నీ నీడలో నన్ను నడిపించి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, వాటి నుండి నన్ను తప్పించి కాపాడి నడిపించుమని యేసు క్రీస్తు నామములో తండ్రి. ఆమెన్!

22 November 2021

నిన్ను నీవు కనపరచు కొనుటకు సిద్ధపాటు


🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము⛪
 *నిన్ను నీవు కనపరచు కొనుటకు సిద్ధపాటు* 

"కాబట్టి ఇశ్రాయేలీయు లారా, మీయెడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రా యేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధ పడుడి." 
 - ఆమోసు 4:12

ఇశ్రాయేలీయులు తమ జీవితాలలో దేవుని మాటలు హెచ్చరికలు శిక్షలు విధానాలని నిర్లక్ష్యం చేశారు. ఇశ్రాయేల్ లోని ధనికులూ అధికారులూ కూడా తన సంపద పోగు చేసుకుంటూ పేదలను బాధించారు. వారు ఇతరులకు చేసే విధంగానే దేవుడు వారికి చేస్తాడు. దేవుని శాసనాలకూ విరోధంగా అనేకమైన పాపాలు చేసిన వారిని శిక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇటువంటి వారిని పవిత్రమైన వారిగానూ, నీతి న్యాయాలు గల జనాంగముగాను పేదల పట్ల దయ చూపించే జనాంగము గాను ఉండేందుకు దేవుడు వారికి సమృద్ధిని అనుగ్రహించాడు. ఆ బాధ్యతను నిర్లక్ష్యం చేసినట్లయితే శిక్షింప బడతారు. దేవుని చేతిలో నుండి తప్పించుకోలేరు. అందుకే బహు జాగ్రత్తగా దేవుడు నీ యెడల కృప చూపినట్లు, నీవు కూడా దీనుల పట్ల కృప చూపించేలా జీవించాలి. దేవుని తీర్పు ఎదుర్కొనేందుకు నీవు సిద్దపడి ఉండాలి పశ్చాత్తాపపడి ఉండాలి. "మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి" అనే వాక్యాన్ని నీ జీవితానికి హెచ్చరికగా చేసుకుని జీవించాలి. మీ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుడు చెప్పబోయే దాన్ని వినేందుకు సిద్ధపడాలి. నీతి న్యాయాలు అనుసరించి జీవించుటకు సిద్ధపడిన వారుగా ఉండాలి. నాకు ఏం దొరుకుతుందా అని చూడడం కంటే ఇతరులకు ఎలా సహాయం చేద్దాం అని ఆలోచించడం శ్రేష్టం. దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడు. కాబట్టి నీ జీవితాన్ని బహు జాగ్రత్తగా ఆయనను వెదకి ఆయన ఎదుట సిద్ధపడిన మనసుతో నిలబడాలి. అటువంటి జీవితం జీవించడానికి దేవుని కృప నీకు తోడైయుండును గాక!

 🛐ప్రార్థన🛐

నా రక్షకా! నీవు నన్ను చూసినప్పుడు నేనును మీ వంటి స్వరూపమును కలిగి జీవించునట్లు నన్ను నేను నీ ఎదుట కనపరచు కొనుటకు సిద్దపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

20 November 2021

రక్షించు దేవుడు

🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము:-⛪

 ✝️*రక్షించు దేవుడు*✝️

 "మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే."
ద్వితీ.కాం. 20:4 

దేవుని వాక్యం పట్ల విధేయత, ఆయన సేవకులు పట్ల ప్రేమ, కనుపరచే చర్యల వల్ల దేవునికి స్తుతి, ప్రజలకు దీవెన కలుగుతాయి. విశ్వాసులకు ఈ లోకంలో ఉన్నంత కాలము అలసట, ఆయాసకర జీవితము ఇబ్బందులు తప్పవు. కొన్నిసార్లు వారు కృంగిపోయి నిరాశకు కూడా లోనవుతారు. లోకంలో జీవిత పోరాటం చేస్తుంటారు. అలాంటి సమయంలో, కాపరి అటువంటి వారి దరిచేరి వారి ఆత్మలకు సెదదీర్చి ఉరడిస్తాడు. నీవు కూడా నే జీవిత పోరాటం అలసిపోయి ఉన్నవా?

యేసుని రక్షకునిగా నీ శరీరంతో కాదు నీ ఆత్మతో ఆయనను ఆరాధించు, అప్పుడు నిన్ను రక్షించి నీ జీవితాన్ని సంరక్షిస్తాడు. ఎన్నడు అక్రమ మార్గంలో గానీ, మోసకరమైనా విశాల వీధుల్లో గానీ, పాపం ఉన్న దారిలో గాని ఆయన నడిపించడు. కేవలం నీతి న్యాయాల మార్గంలో నిన్ను నడిపిస్తాడు. క్రీస్తు బిడ్డలను కొన్నిసార్లు కీడు చుట్టుముడుతుంది. దేవుని బిడ్డ అయిన నీకు నీ జీవితంలో చీకటి చుట్టుముట్టి కుంగదీసే పరిస్థితులు నీకు సంభవించవచ్చు. చివరికి మరణం కూడా నీదరికి రావచ్చు. అయినా కూడా నీవు భయపడువద్దు ఎందుకంటే నీ పక్షాన యుద్ధము చేసేవాడు, నీ జీవితాన్ని రక్షించువాడు సర్వశక్తి గల సృష్టికర్త ఉన్నాడని మరిచిపోవద్దు. ఆయనే నిన్ను రక్షించి నీ జీవితానికి కావలసిన దీవెనలు నీపై కుమ్మరిస్తాడు. అటువంటి దీవెనలు పొందుకోవటానికి దేవుని కృప నీకు తోడైయుండును గాక!

 🛐*ప్రార్థన*🛐

నా దేవా! నీవు అందించు రక్షణను నేను పొంది తరించినట్లు నీ సన్నిధి చేరునట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్!

18 November 2021

పరిపూర్ణమైన సంతోషం

🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము⛪

✝️ *పరిపూర్ణమైన సంతోషం*✝️

మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. 
యోహాను 16:24

మన సంతోషం లోక సంతోషానికి వ్యతిరేకం గా ఉంటావున్నది. లోకము ఏమి ఎదురు చూస్తూ ఉన్నది అంటే యేసుక్రీస్తును చంపడం ద్వారా లోకం సంతోషించాలని ఎదురుచూసిన్నది. కాని శిష్యులు యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా సంతోషించినారు. పునరుద్ధానం ద్వారానే మనకు సంతోషం క్రీస్తు లేని పునరుద్ధానము నిరీక్షణ లేదు. ఇంత వరకు శిష్యులు యేసు నామమున వాస్తవంగా దేవుని ఏమీ అడగలేదు. వారి యేసును ప్రత్యక్షంగా అడగ లేదు లేక దేవునికి ప్రత్యక్షంగా ప్రార్ధించి ఉండలేదు. ఇప్పుడు వారు యేసు నామములో సమస్తమును దేవుని అడగవచ్చు. అన్నింటి కంటే వారు పరిశుద్ధాత్మ అడిగితే ఆయన వారి నింపుతాడు అప్పుడు వారు సంతోషం పరిపూర్ణం అవుతుంది

🛐ప్రార్ధన:🛐
ఓ దేవా నా హృదయమును తెరిచి నీ సన్నిధిలో పానార్పణముగా పోయుచు, హృదయ పూర్వకంగా చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్..

👉 మనము పరలోకం యొక్క సంపదతో వ్యవహరించే బదులు భూమి యొక్క సంపదను వెంబడిస్తాము. ప్రపంచం అందించే వాటికి మరియు యేసు అందించే వాటికి మధ్య ఉన్న వ్యతిరేకతను మనం గ్రహించినప్పుడు మన ఆనందం పరిపూర్ణమవుతుంది - CS లూయిస్

17 November 2021

విశ్వాసం ద్వారా విజయము

🙏ప్రభువు నామమున శుభోదయం🙏
 
⛪నేడు దిన ధ్యానము⛪
✝️ *విశ్వాసం ద్వారా విజయము*✝️
వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి.
హెబ్రీ. 11:33

కొంతమంది భక్తులు విశ్వాసం ద్వారా వారు పొందుకున్న రాజ్యాలను పొందుతున్న విజయాలను ఈ వాక్యం నొక్కి చెప్పడం చూస్తున్నాము.దేవుని ఎడల ఉన్న నమ్మకం వల్లనే వారు రాజ్యాలు జయించారు. దావీదు యెహోవా నామములో ప్రార్థన చేయగా రాజ్యాలు పొందుకున్నాడు. సొలొమోను తన ప్రజలను నాయ్యంగా పరిపాలించుటకు జ్ఞానమును కోరగా వివేచన జ్ఞానాన్ని పొందుకున్నాడు. వాగ్దానాలు పొందుకున్నారు. దానియేలు ప్రార్థన చేయగా సింహాల నోళ్ళను మూయిoచాడు. ఇలా ఎంతో మంది భక్తులు, దేవుని కార్యాలు నిమిత్తం నమ్మకంతో వారు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు, గొప్ప గొప్ప విజయాలు అందించారు. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యము నిన్ను ప్రోత్సాహపరుస్తుండగా, నీ జీవితంలో అసాధ్యమై యున్న అనేక కార్యములను సాధించు కొనుటకు దేవుని వద్ద గోజాడు, ఆయన పాదములను గట్టిగా పట్టుకో. దేవుడు కనికర స్వరూపుడు, తప్పక కరుణిస్తాడు.

 🛐*ప్రార్థన🛐

నా దేవా! మా పితరుల విశ్వాసము ద్వారా వారి పట్ల ఎన్నో కార్యాములు జరిగించారు. నా విశ్వాసమును కూడా బలపరిచి నా జీవితంలో గొప్ప కార్యములు జరిగించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

16 November 2021

ఆయనను జ్ఞాపకము చేసుకొనుము


🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము:⛪
✝️ *ఆయనను జ్ఞాపకము చేసుకొనుము*✝️

        బబులోను చెర నుండి తిరిగి వచ్చేవేళ దేవుడు వారి అవసరాలను తీరుస్తాడని ఇశ్రాయేలు వారికి ధైర్యం చెప్పేందుకు ఈ విధంగా మరొకసారి వారికి గుర్తు చేసే సందర్భంలోనిది ఈ వాక్యం. ఇశ్రాయేలు దేశం అదంతా ఎడారి ఒక చిన్న చెట్టు కూడా కనిపించదు. నీళ్లు కూడా ఎక్కడా కనిపించవు ఎర్ర సముద్రం మాత్రం కనిపిస్తుంది. దాని లోని నీరు త్రాగే నీరు కాదు భయంకరమైన ప్రదేశం. మనలాంటి వారు ఒక రాత్రి ఆ ప్రదేశం లో ఉన్నామంటే గుండె ఆగి చచ్చిపోతాము. కాని దేవుడు తన ప్రజలైన వారిని విడువడు కాబట్టి తన ప్రజలకు *మారాను* మధురంగా మార్చాడు. ఎక్కడ దాహం వేస్తే అక్కడ వారి కోసం నీళ్లు ఏర్పాటు చేసాడు. అసలు దాహమే లేకుండా చేసాడు. అటువంటి గొప్ప అద్భుతాలు చేసిన దేవుని ఇశ్రాయేలు ప్రజలు మరచిపోతున్న సందర్భంలో వారికి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను గుర్తు చేసి వారిని బలపరుస్తున్న భక్తుని మాటను బట్టి నీవు కూడా నీ జీవితంలో దేవుడు చేసిన మేలును నిరంతరము నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు, వారితో ఉన్న దేవుడు, నీతో కూడా ఉండి నిన్ను నడిపిస్తాడని నమ్ము. అప్పుడు ఎటువంటి దప్పిక లేకుండా నీకు సమస్తమును కలుగచేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని కృప నీకు తోడైయుండును గాక!

 🛐*ప్రార్థన:-*🛐
        నా దేవా! ఇశ్రాయేలు పట్ల మీరు చేసిన కార్యములు నా పట్ల కూడా జరిగిమని, మీరు చేసిన మేళ్ళను మరువకుండ బుద్ధిని దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి.ఆమెన్!

15 November 2021

గోడల పై అజ్ఞలు

🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము⛪

 ✝️*గోడల పై అజ్ఞలు* ✝️

సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను. ద్వితీ 6: 7,8,9.

చాలా మంది క్రైస్తవులు, విశ్వాసులు, వాళ్ళ వాళ్ళ గోడల పైన ఆశీర్వాదాలు, ఇంకా దేవుని వాగ్దానాలు వ్రాసి పెట్టుకుంటారు. ఆ విధంగా చేయడం నిజంగా చాలా మంచిది. ఎందుకంటే, అవి మన కళ్ల ఎదుట ఉన్నప్పుడు, మన విశ్వాసము అధికమై మనము కృంగుదలకు లోను కాకుండా ఉంటాము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో, దేవుడు తన ప్రజలకు ఆయన ఆజ్ఞలను తమ పిల్లలకు నేర్పించాలని చెప్పారు. అంతే కాదు, వాటి గురించి నిత్యమూ మనము, మన పిల్లలతో మాట్లాడాలి. మనము కూర్చున్నపుడు, నడచునప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, ఆయన ఆజ్ఞలను, విధులను గూర్చి మన పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. మనమీవిధంగా చేసినప్పుడు, మన పిల్లలు దేవునిలో భయభక్తులతో పెరిగి, ఆశీర్వదించబడతారు.అంతే కాదు, వాటిని మన చేతులకు కట్టుకోవాలని, ఇంకా, కన్నుల మధ్య బాసికము లాగా ఉండాలని దేవుడంటున్నారు. కానీ పచ్చ బొట్టులు వేసుకోరాదు. ఈ రోజులలో శరీరమంతా పచ్చ బొట్లు పొడిపించుకుంటున్నారు. అది ఏ మాత్రము మంచిది కాదు. కానీ, ఆయన ఆజ్ఞలను, విధులను మన ఇంటి గోడల పైన, ద్వారబంధాల పైన, గవునుల పైన వ్రాసిపెట్టుకుంటే, వాటిని మనము మరచిపోము. అవి మన కన్నుల ఎదుటే ఎల్లప్పుడూ ఉంటే మనమిక పాపము చేయము.

🛐ప్రార్థన:🛐

పరలోకపు తండ్రీ, మీ ఆజ్ఞలను మేమెల్లప్పుడూ మా హృదయములలోనూ, ఇళ్లలోనూ ఉంచుకొననివ్వండి. మీకు విరోధముగా పాపము చేయనీయకండి. మీ మాటలకు లోబడుటకు మాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

👉ఆశీర్వాద పుస్తకము ఎంతటి ఆశీర్వాదాన్ని, జీవాన్ని, ఆరోగ్యాన్ని, సమృద్ధిని, శాంతిని తెస్తుందంటే, ఇంక మరెన్నడూ మనము పేదవాళ్ళము కాము. – స్మిత్ విగల్స్ వర్థ్.

10 November 2021

సరి చేసుకొనుము


🙏ప్రభువు నామములో శుభోదయం🙏

⛪నేడు దిన ధ్యానము:-⛪

✝️ *సరి చేసుకొనుము*✝️

కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యముచేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు యెహోవా న్యాయముతీర్చు దేవుడుఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు.
యెషయా 30:18

ఎందుకు నా జీవితంలో ఈ కార్యం జరగట్లేదు అని ఆలోచిస్తున్నాను కానీ దేవుడు నీవు ఎంతవరకు ఆయన పై ఆధారపడ్డావో అని గమనిస్తూ ఉంటాడు నీవు పూర్తిగా ఆయన పై ఆధారపడే వరకు ఎదురు చూస్తాడు నా బిడ్డ ఎప్పటికీ నా నుంచి తప్పిపోడు అని నీ మీద నమ్మకం కుదిరిన తర్వాత నీ జీవితంలో ఏవైతే కార్యాలు జరగటం లేదని బాధపడుతున్నావో వాటినన్నింటినీ దేవుడు సమయానుకూలంగా నీకు అనుగ్రహిస్తాడు.

ఎందుకు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచించుకునే కంటే నాలో నేనేమీ సరిదిద్దుకోవాలి అని మీ ప్రవర్తనను సరిదిద్దుకుంటే ఆయనకు ఇష్టమైన జీవితం జీవించడానికి ప్రయత్నిస్తే ఆయన నీ పై దయ చూపించి నీకు ఎన్నో మేలులు చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు.

నీ జీవితంలో ఉన్న అవమానములకు ఫలానావారు కారణమని అపవాదిని ప్రేరేపించి వారిని ద్వేషించేలా చేస్తుంది. కాని వాక్యము సెలవిస్తుందేమనగా, మీ అవమానములకు కారణం ఏ మనుషులు కాదు కానీ నీవు దేవుని యొక్క ఆజ్ఞలను ఏదో ఒకటి లేదా కొన్ని మీరటమే అని తెలుసుకో అవి ఏమిటో నీవు గ్రహించుకుని సరిదిద్దుకో అప్పుడు దేవుని దయ యందును మనుషుల దయ యందును నీవు అభివృద్ధిని నొందుతావు అటువంటిది దేవుని యొక్క సహాయము నీకు కలుగును గాక ఆమెన్.

🛐ప్రార్ధన:-🛐
దేవా నీ దయ వలన నాలోని దోషములను అధికముగా అయిననూ నాపై దయ చూపి నాలోని అసమర్థతను సరిదిద్దు కొనుటకు సకాలంలో అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము పరమతండ్రి. ఆమెన్!

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...