Showing posts with label ఆల్ఫా ఒమేగ అయిన మహిమాన్వితుడా. Show all posts
Showing posts with label ఆల్ఫా ఒమేగ అయిన మహిమాన్వితుడా. Show all posts

18 August 2021

Alpha Omega Ayina Mahimanwithuda | అల్ఫా ఒమేగ అయిన మహిమాన్వితుడా

అల్ఫా ఒమేగ అయిన - మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా - నిరంతరం స్తోత్రార్హుడా
రాత్రిలో కాంతి కిరణమా - పగటిలో కృపా నిలయమా
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా 
నాతో స్నేహమై నా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా 

తేజోమయుడా నీ దివ్య సంకల్పమే - ఆశ్చర్యకరమైన వెలుగులొ నడుచుటకు 
ఆశ నిరాశల వలయాలు తప్పించి - అగ్ని జ్వాలగ నను చేసెను 
నా స్తుతి కీర్తన నీవే - స్తుతి ఆరాధన నీకే ||అల్ఫా ఒమేగ||

నిజస్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా - 
నను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను 
నా చెలిమి నీతోనేె - నా కలమి నీలోనేె ||అల్ఫా ఒమేగ||
DOWNLOAD MP3 SONG 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...