సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో
"దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||
1.ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను
మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను
"దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||
2.దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి
బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి
"దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||
3.జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను
కన్యక గర్భాన ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను
"దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||