పరికించినావా యోచించినావా ప్రభు యేసు కాడిని మోయలేవా...
1.ఉరకలు వేసే నీ యౌవనం - పరుగులు తీయును పాపానికై (2)
అందుకే అందుకే నీ జీవితం మలచుకో ||యౌవ||
2.గాయపడిన ఆ ప్రభు చేతులు - నీకై చాపె దివారాత్రులు (2)
ఎంత సేపు నిలువబెట్టి - ఏడ్పింతురు విభుని ||యౌవ||
3.పాపపు జీతము మరణమని - పాపికి లేదు మోక్షమని (2)
మంచి తరుణము లేదు సమయము - మోకరిల్లుము ప్రభుని చెంత ||యౌవ||