Showing posts with label ఆగని పరుగులో ఎండిన ఎడారులు. Show all posts
Showing posts with label ఆగని పరుగులో ఎండిన ఎడారులు. Show all posts

07 February 2021

Aagani Parugulo Yendina Yedarulu | ఆగని పరుగులో ఎండిన ఎడారులు

ఆగని పరుగులో - ఎండిన ఎడారులు 
కృంగిన బ్రతుకులో - నిండిన కొరతలు 
ఉన్నపాటునా నలిగె నా వైపునా 
కదలిరాలేవా ఆదరించగ రావా 
కన్నీరే నా మజిలీ, దరి చేరే నీ జాలి 
లాలించే నీ ప్రేమ, నా ప్రాణమై 
కరుణించే నీ చూపు, మన్నించే నా మనవి 
అందించే నీ చేయి, నా స్నేహమై ||ఆగని||

1.లోక ప్రేమే సదా - కలల కడలే కదా
తరంగమై కావుమా - తిరిగి తీరమునకు (2)
నీవే కదా ఆధారం - సదా నీకే దాసోహం యేసయ్య..
అర్పించెదా - నా జీవితం ||ఆగని||

2.ఎదుట నిలిచే నీవే - ప్రేమకు రూపం నీవే
కృపామయా కావుమా - జార విడువకు నన్ను (2)
నీవే కదా నా మూలం సదా నీపై నా భారం యేసయ్యా
ప్రేమించెదా - కలకాలము ||ఆగని||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...