Showing posts with label Naajeevitham Neekankitham. Show all posts
Showing posts with label Naajeevitham Neekankitham. Show all posts

02 January 2022

Naajeevitham Neekankitham | నాజీవితం నీకంకితం నీ సేవలోనే

నాజీవితం నీకంకితం నీ సేవలోనే పునరంకితం 

కష్టమే కాల్చిన నష్టమే కూల్చిన 
మరువను నీ వాక్యము విడువను నీ మార్గము

కడగండ్ల సుడిలోన వడగండ్ల జడిలోన 
ఏ తోడు రాకున్నా ఏ నీడ లేకున్నా 
నా చెంత నీవుంటే చేయూత నిస్తుంటే 

కష్టమే కాల్చిన నష్టమే కూల్చిన 
మరువను నీ వాక్యము విడువను నీ మార్గము 

ప్రతివాది చెరలోనే అపవాది ఉరిలోన 
నే చిక్కిపోతున్నా నే నలిగి పోతున్నా . 
నీ ప్రేమ నాకుంటే నీ దీవెన ఉంటే 

కష్టమే కాల్చిన నష్టమే కూల్చిన 
మరువను నీ వాక్యము విడువను నీ మార్గము

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...