Showing posts with label Bhayamu chendaku bhakthuda. Show all posts
Showing posts with label Bhayamu chendaku bhakthuda. Show all posts

27 August 2023

Bhayamu chendaku bhakthuda భయము చెందకు భక్తుడా


భయము చెందకు భక్తుడా - ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)
భయము చెందకు నీవు - దిగులు చెందకు నీవు (2)
జీవమిచ్చిన యెహొవున్నాడు
ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము||

1.బబులోను దేశమందున - ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2)
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2)
నాల్గవ వాడు ఉండలేదా - ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా ||భయము||

2.చెరసాలలో వేసినా - తన దేహమంతా గాయాలతో నిండినా (2)
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2)
భూకంపం కలుగ లేదా - ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా ||భయము||

3.ఆస్తి అంతా పోయినా - తన దేహమంతా.. కురుపులతో నిండినా (2)
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె (2)
అని యోబు పలుక లేదా - ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా ||భయము||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...