Showing posts with label Gollapalli nathaniyelu. Show all posts
Showing posts with label Gollapalli nathaniyelu. Show all posts

19 August 2021

Yesu Kreesthundu Nithya Devundu | యేసు క్రీస్తుఁడు నిత్య దేవుఁడు

95                         క్రీస్తు దైవత్వము
రా -శంకరాభరణము (చాయ:దేవుడిచ్చిన దివ్య) తా- అట
                
యేసు క్రీస్తుఁడు నిత్య దేవుఁడు – ఎఱిగి నమ్ముఁడి మనుజులారా = మోస మొందక మోక్షపతికిఁక – దాసులై – బ్రతుకండి రండి || యేసు ||

1. ఆరు దినములలోపలనే – యాకసము భూలోకములను = ప్రాకటముగఁ జేసి నాఁడు – ప్రకాశుఁడాయన ప్రజ్ఞవంతుఁడు || యేసు ||

2. ఆది పురుషుని యాదిస్త్రీనిఁక – హస్తములతో నంటి చేసెను మేదినిన్ ఫలవనములో న – సాధులై నివసింప నిచ్చెను || యేసు ||

3. వార లిద్దపు దేవునాజ్ఞను – కోరికలతో మీరినప్పుడు= గారడీ పిశాచ తంత్రము – వారి పరమై పాపులైరి || యేసు ||

4. వీరలందఱు వారి సంతతి – వేరెలేరీ ధరణిలో దు = ష్కార్యులై దేవుని యాజ్ఞలు – మిరి రందరు నరక పాత్రులు || యేసు ||

5. ఇంత పాపభరితులై కా – సంతసత్యము లేని నరుల = నెంతగాఁ బ్రేమించెనో తన – సొంత ప్రాణముఁ బలిగఁబెట్టెను || యేసు ||

6. పాపమించుకలేని కరుణా – పావనుడు నరుఁడాయెను = శాపగ్రస్తులమైన శాపములు తాఁజేతఁ బూనెను || యేసు ||

7. ఎన్నరాని బాధలొందుచు – పుణ్యరక్తము జిందెనిలను = ఎన్నడు నీలాంటి ప్రేమ – వన్నెలేదో యన్నలారా || యేసు ||

8. మనలఁ బాపమునుండి బాపను – మనుజుఁడై మరణంబునొంది = మన ప్రభువె మూఁడవ దినంబున – మహినిలేచి పరము వెళ్లెను || యేసు ||
                                             - గొల్లపల్లి నతానియేలు.

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...