Showing posts with label 063 పరమపురి కల్పభూజ నిరత. Show all posts
Showing posts with label 063 పరమపురి కల్పభూజ నిరత. Show all posts

20 August 2021

Paramapuri Kalpabhuja Nirata | పరమపురి కల్పభూజ నిరత

63
త్యేక దేవునికి స్తుతి
(చాయ: అన్నామన యేసు)
రా – శంకరాభరణము, తా – ఏక
                     
  పరమపురి కల్పభూజ - నిరత భూనరుల పూజ = యురుతరచిత మహిమతేజ వరస్తుతి సల్పెదము రాజ || పరమ ||

1.జనక సుత శుద్ధాత్మ - యను పేరిట యేకాత్మ = ఘనతర సంరక్ష ప్రేమ ననిపి మము కనికరించు || పరమ ||

2.నీవే మా ప్రాపువంచు - నెరనమ్మి యుందు మంచు = భావంబున దలఁచు వారిఁ - బావనులఁ జేయు సదా || పరమ ||

3.కలుషంబులను హరింప - నిల సైతానును జయింప = బలుమారు నిను దలంచు - బలము గల ప్రభుఁడ వీవే || పరమ ||

4.ఈ లోక పాపనరులు - చాల నిను నమ్మి మరల = దూలిచే దారుణ సై తానును బడఁదొక్కివేయు || పరమ ||

5.అల్పా ఓ మేగయును - నాద్యంతంబులును = కల్పాంత స్థాయువైన = కరా కరుణించు మమును ||పరమ||
                               – పాలపర్తి యాకోబు

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...