Showing posts with label Calvary Temple. Show all posts
Showing posts with label Calvary Temple. Show all posts

01 February 2021

Digulu Padaku Sevaka Digulu | దిగులు పడకు సేవకా దిగులు పడకుమయా

దిగులు పడకు సేవకా దిగులు పడకుమయా 
నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచె గదా 
కష్టాలు తీర్చి కన్నీటిని తుడిచి ఆదరించునుగా 
నీతోనే నడచి నీలోనే నిలచి నిన్ను నడుపునుగా 
ఓ సేవకా భయపడకిక జయము నీదె గదా 

అగ్నివంటి శోధనలకు భయపడకుమయా 
అగ్నిలోను క్రీస్తు అండ తోడుండగా 
అగ్ని గుండమే నిన్ను హెచ్చించి ఘనపరచునుగా 
షద్రకు మేషకబెద్నెగోలను మరచిపోకుమా 
ఓ సేవకా భయపడకికా అగ్ని మేలెగదా 

ఏమి తిందునో ఎక్కడ ఉందునో చింతించకుమా 
నీకున్న అవసరతలు తండ్రికి తెలియునుగా 
ఆకాశము నుండి మన్నాను పంపి పోషించే గదా 
ఐదు రొట్టెలు రెండు చేపలు సంగతి మరువకుమా 
ఓ సేవకా భయపడకిక గంపలు మిగిలెగదా 

నీవు కలిగిన దర్శనమును విడిచిపెట్టకుమా 
లోకాశలకు ధన సంపదకు లొంగిపోకుమా 
స్త్రీ వ్యామోహం ఈ లోక స్నేహం నీకు తగదు గదా 
ఆత్మల రక్షణ సంఘ పోషణ నీపై నుండె గదా 
ఓ సేవకా వెనుదిరుగక ముందుకు సాగుమయా

Naatho Maatladumayya Nannu | నాతో మాట్లాడుమయ్యా నన్నూ దర్శించు

నాతో మాట్లాడుమయ్యా నన్నూ దర్శించుమయ్యా 
నీ మందిరాన నీ సన్నిధాన 
నీ ఆత్మతో నన్ను నింపూమయా
యేసయ్యా..ఆ...యేసయ్యా...ఆ .. 
యేసయ్యా...ఆ ..యేసయ్యా ...యేసయ్యా(2)

కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కడవరకు నను చేర్చుమయ్యా
కరువు తోడైనా కలిమి వేరైనా -కరుణించి కాపాడుమయ్యా
నా వేదనలో.. నీ జాలితో నా శోధనలో.. నీ చేతితో 
నిత్యము నను నడిపించుమయ్యా ... 
                                              ||యేసయ్యా||
నా వారే నన్ను నిందించు వేళ ననువిడచి పోబోకుమయ్యా 
ఆదరణ నాకు కరువైనవేళ దరిచేరి ఓదార్చుమయ్యా 
నా నిందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై 
నిత్యము నను నడిపించుమయ్యా...
                                              ||యేసయ్యా||
నా కాలు జారి తొట్రిల్లు వేళ చేజాచి నిలబెట్టుమయ్యా 
సాతాను నన్ను బంధించువేళ -ననుచేరి విడిపించుమయ్యా 
నీ చేతితో నను పట్టుకో నీ సేవలో నను వాడుకో 
నిత్యము నను నడిపించుమయ్యా ..
                                              ||యేసయ్యా||

Nee Prema Nee Karuna Chalunaya| నీ ప్రేమా నీ కరుణా చాలునయా

నీ ప్రేమా నీ కరుణా చాలునయా నా జీవితానా 
మరి దేనినీ ఆశించనూ నే కోరను ఈ జాగానా 
చాలయ్య చాలీ దీవెనలు చాలు 
మేలయ్య మేలు నీ సన్నిధి మేలు 
                                       ||నీ ప్రేమా||
1. గురిలేని నన్ను గుర్తించినావే -
ఎనలేని ప్రేమను చూపించినావే 
వెలలేని నాకు విలువిచ్చినావే -
విలువైన పాత్రగా నను మార్చినావే 
                                       ||నీ ప్రేమా||
2. చే జారిన నాకై చే చాచినావే 
చెదరిన నా బ్రతుకును చెరదీసినావే 
చెరనుండి నన్ను విడిపించినావే 
చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే 
                                       ||నీ ప్రేమా||
3. నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే 
కల్వరిలో ప్రాణమిచ్చి ననుకొన్నావే 
నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే 
నీ కుమారునిగా నను మార్చినావే
                                       ||నీ ప్రేమా||

Kanulunna Kaanaleni Chevulunna | కనులున్న కానలేని చెవులున్న

కనులున్న కానలేని చెవులున్న వినలేని(2)
మనసున్న మతిలేని స్థితియున్న గతిలేని(2)
వాడను యేసయ్యా ఓడిపోయిన వాడను(2)

1. అన్నీవున్న ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని  
    దారివున్నా కానరాని చెంతనున్న చేరలేని 
    యేసయ్యా.. నన్ను విడువకయ్యా(2)
    దిక్కులేనివాడను 
    వాడను యేసయ్యా చెదరిపోయిన గూడును(2)

2. భాషలున్న భావములేని ఆత్మవున్న అవివేకిని
    భక్తివున్న శక్తి లేని ప్రార్థనవున్నా ప్రేమలేని 
    యేసయ్యా... నన్ను కరుణించుమా (2)
    ఫలములేనివాడను 
    వాసిని యేసయ్యా.. పేరుకు మాత్రమే విశ్వాసిని(2) 

3. బోధవున్నా బ్రతుకులేని పిలుపువున్న ప్రయాస పడని
    సేవవున్నా సాక్ష్యము లేని సంఘమున్న ఆత్మలు లేని
    యేసయ్యా... నన్ను నింపుమయ్యా(2)
    ఆత్మలేని వాడను 
    పాదిరిని యేసయ్యా మాదిరి లేని కాపరిని(2)
                                                 ||కనులున్న||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...