Showing posts with label Mahimatho mana yesu. Show all posts
Showing posts with label Mahimatho mana yesu. Show all posts

28 February 2023

Mahimatho mana yesu మహిమతో మన యేసు

229
క్రీస్తు మహిమతో వచ్చుట
రా - ఘంటా, తా - అట 
 
మహిమతో మన యేసు - ఇహమునకు వేంచేయున్ = సహోదరులారా మన మా - మహిమలో వెలుఁగుదుము ||మహిమతో||
 
1.మోములు వంచి యేసు - నామము నుతియించు = పామరులమైన మనలఁ - బ్రేమతోఁ గప్పినాఁడే ||మహిమతో||
 
2.పాత్రులమా మనము - శత్రులమే కాదా = మిత్రులన్ జేసిన వి - చిత్రము తెలియలేము ||మహిమతో||
 
3.శిరముల పైని జీవ - కిరీటములతోను = బరమ దేవుని వరములు - మురి యుచు మరువలేము ||మహిమతో||
 
4.వీణెలతో మనము - నాణెమైన పాట = ఋణము చెల్లింపలేమని - యణఁ గి మణఁగి పాడుదుము ||మహిమతో||
- గొల్లపల్లి నతానియేలు 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...