Showing posts with label తలుచుకుంటె చాలును ఓ యేసు నీ ప్రేమ. Show all posts
Showing posts with label తలుచుకుంటె చాలును ఓ యేసు నీ ప్రేమ. Show all posts

19 March 2021

Taluchukunte Chalunu O Yesu Nee Prema | తలుచుకుంటె చాలును ఓ యేసు నీ ప్రేమ

తలుచుకుంటె చాలును ఓ యేసు నీ ప్రేమ
జలజల జల రాలును కృతజ్ఞతా కన్నీళ్ళ
తలుచుకొంటే చాలును కరిగించును రాళ్ళను
కల్వరి స్వరము ఇది కల్వరి స్వరము

1. నీ మోమున ఊసిన ఉమ్ములు
    నా మోహపు చూపు తుడిచెను
    నీ చెంపను కొట్టిన దెబ్బలు
    నా నోటిని శుద్ధి చేసెను (2)
    నీ శిరస్సున గుచ్చిన ముండ్లు
    నా మోసపు తలపును త్రుంచెను (2)
    ఎంత త్యాగపూరితమో నీప్రేమా...
    ఎంత క్షమాభరితమో నీప్రేమా…

2. నీ దేహము చీరిన కొరడా -
    నా కామమును చీల్చెను -
    నీ చేతుల కాళ్లకు మేకులు -
    నా చీకటి దారి మూసెను (2)
    సిలువ నెత్తుటి ధారలు
    నా కలుషమును కడిగి వేసెను (2)
    ఎంత త్యాగపూరితమో నీప్రేమా...
    ఎంత క్షమాభరితమో నీ ప్రేమా…

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...