Showing posts with label 568 దీవించు దేవా నీ బిడ్డలను. Show all posts
Showing posts with label 568 దీవించు దేవా నీ బిడ్డలను. Show all posts

21 August 2020

Deevinchu neva nee biddalanu | దీవించు దేవా నీ బిడ్డలను

568 
గృహ ప్రవేశము
(చాయ: ఆలించు దేవ)
రా – శ్రీ రాగము, తా – అట

దీవించు దేవా - నీ బిడ్డలను దీవించు దేవా = దీవించుమీ గృహము - దేవపుత్రుల మంచి - స్థావరంబుగ వెలసి - సత్యకాంతుల బరుప ||దీవించు||

1.నీవే యీ గృహమునకు - నిత్యతల పతివంచు - నేవేళ నీ మనసు - నెరిగి జీవింపగ ||దీవించు||

2.సంభాషణలవేళ - సన్నిహితుడా నీకు - సంబరంబును - గూర్చు సద్వాక్కులను బలుక ||దీవించు||

3.భోజన సమయమున భూరి ప్రేమతో నిన్ను - పూజ్యుండౌ యతిధిగ పూజసల్పుచు బిలువ ||దీవించు||

4.ఇరుగుపొరుగులనెల్ల - పరవారివలెగాక - పరమాత్మనీసుతుల - వలె జూచి ప్రేమింప ||దీవించు||

5.అనుదిన ప్రార్థన - లందు శ్రద్ధాభక్తు - లను జూపి క్రైస్తవ - యనుభవంబుల నొంద ||దీవించు||

6.క్రైస్తవగృహ విధులీ - గృహమున నెరవేర - విస్తారమగు కృపను - వీర లందరి కొసరి ||దీవించు|| 

7.ఆయురారోగ్యంబు - లాత్మైశ్వర్యములిచ్చి - ఈ యూర వీరు నీ కింపగు సాక్ష్యము నియ్య ||దీవించు||
 - పి.పి. శుభామణి
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...