Showing posts with label అద్వితీయుడా. Show all posts
Showing posts with label అద్వితీయుడా. Show all posts

02 March 2023

Adviteeyuda lyrics | అద్వితీయుడా

Adviteeyuda - అద్వితీయుడా - Hosanna Ministries 2023 new Album Song-1 Pas.JOHN WESLEY

అద్వితీయుడా నన్నేలు దైవమా వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యములను
 
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు (2)
కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటిలేరు ఇలలో అద్వితీయుడా ||మదిలోన||
 
1.ప్రతీ గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తి నీవై
నడిపించుచున్న నేర్పరీ
అలుపెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై నను నిలువనీయని వేలలో
హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై తడికన్నులనే తుడిచిన నేస్తం ఇలలో నీవేకదా యేసయ్యా ||మదిలోన||
 
2.నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగు జాడలలోనే
నీతో సహజీవనమే ఆద్యాత్మిక పరవశమై ఆశయాల దిశగా నడిపెనే
సంకల్ప దీక్షతో సాగెదా నీ నిత్య ఆధరనే అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతా తీర్చి నా సేదదీర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకు సాక్షిగా యేసయ్యా ||మదిలోన||
 
3.విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్య నిర్మాతవు స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు ఆ ఘడియ వరకు విడువకు
నే వేచియున్నాను నీ రాక కోసమే శ్రేష్టమైన
స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా నా ఊహలలో ఆశల సౌధం ఇలలో నీవేనయా యేసయ్యా ||మదిలోన||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...