ఎందుకయ్యా ఈ వేదనా - ఎవరి కొరకు ఈ శోధనా (2)
ఎందుకొరకు ఈ త్యాగము -ఎవరి కొరకు ఈ బలిదానం (2) ||ఎందుకయ్యా||
ఎందుకొరకు ఈ త్యాగము -ఎవరి కొరకు ఈ బలిదానం (2) ||ఎందుకయ్యా||
1.రెల్లుగడ్డినే రాజదండముగా చేసి..
ముళ్ళ కిరీటము శిరమున మోపి.. (2)
మోము పైన ఉమ్మి వేసి ..వలువలులాగి విలువలు మరచి..
మోము పైన ఉమ్మి వేసి ..వలువలులాగి విలువలు మరచి..
యూదుల రాజు నీవేనంటూ అపహసించిరి ... అవమానించిరి ||ఎందుకయ్యా||
2.పాప భారము భుజముపై మోస్తూ... కలువరికే పయనమవ్వగా.. (2)
సిలువ మ్రానును మోయలేక ..
సిలువ మ్రానును మోయలేక ..
తడబడు అడుగులతో సొమ్మసిల్లగా..(2)
ప్రేమ మనసులు తల్లడిల్లెను ...
కఠిన శిలలు కన్నీరు కార్చేను ||ఎందుకయ్యా||
No comments:
Post a Comment