Showing posts with label Nee Krupaye Nannu Kaachenu. Show all posts
Showing posts with label Nee Krupaye Nannu Kaachenu. Show all posts

12 July 2021

Nee Krupaye Nannu Kaachenu | నీ కృపయే నన్ను కాచెను నీ దయయే

నీ కృపయే నన్ను కాచెను నీ దయయే నన్ను దాచెను
నీ క్షమయే నన్ను ఓర్చెను నీ వాక్యమే ఓదార్చెను
చాలునయ్యా నీ కృప చాలునయ్యా

1. గాఢాంధకారములో నేనుండగా - నీ సన్నిధియే నాకు వెలుగాయెగా
నా శత్రువుయే నన్ను తరుముచుండగా - నా స్థానములో నిలిచి పోరాడెగా
భయభీతులలో నేనుండగా - అవమానములో అల్లాడగా 
నా కాపరియై నన్ను చేరెగా - నావైరులను వెళ్ళెగొట్టెగా
చాలునయ్యా నీ కృప చాలునయ్య

2. నావారే నన్ను గెంటి వేయగా - మరణభయమే నన్ను ఆవరింపగా 
నా చెంతచేరి నన్ను స్వస్థపరిచెగా - నీ చేయి చాచి నన్ను చేరదీసెగా 
అపజయమే నన్ను కృంగదీయగా - అంటరానిదాననని గేళిచేయగా 
నా పక్షమున చేరి జయమిచ్చెగా - నాతో వుంటానని మాటిచ్చిగా 
చాలునయ్యా నీ కృప చాలునయ్య 

CALVARY TEMPLE's
Album: Nee Maate Chaalunayaa
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...