Showing posts with label Rammu rammu parishudhathma. Show all posts
Showing posts with label Rammu rammu parishudhathma. Show all posts

28 May 2023

Rammu rammu parishudhathma రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా

245
పరిశుద్ధాత్మ, రమ్ము
రా - శ్రీ రాగము, తా - ఆది 

రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా - రమ్ము రమ్ము = రమ్ము దీవింపఁగ - నిమ్ము నీదు కృపను - నింపు మా డెందముల్ - నెమ్మదిఁ బొందంగ ||రమ్ము||

1.జీవంపు టూటవు - ప్రేమ జ్వాల వీవె = దేవ దాన మీవె - యాద రించువాఁడ ||రమ్ము||

2.దేవహస్త మీవె - వరము లన్ని నీవె = నీవె తండ్రి వాగ్ధ - త్తమ్మయి వెలుగుచుండు ||రమ్ము||

3.మాటలాడు శక్తి - నిచ్చి నాయాత్మను - మేటిల్ల నను నభి - షేకించుమీ దేవ ||రమ్ము||

4.ఇమ్ము నీదు వెలుఁగు - నింపు నీ ప్రేమతో = కమ్ము నాకుఁ తోడు - నన్ను బలపర్చుమా ||రమ్ము||

6.పారదోలు దవ్వు - నాత్మ శత్రువుల నిం = పార నీదు నెమ్మ - దిచ్చి ప్రోవు నన్ను ||రమ్ము||

6.ముందు నీవు నడువ - నన్ను డాయ దేది = యిందు నన్ను ఁ జెరచు - వారు లేరు భువిని ||రమ్ము||

7.జనకుఁ జూపు నాకు - నట్లె చూపు సుతుని - ననయ మెఱిఁగి దేవ నిను నమ్మి జీవింప ||రమ్ము||

8.జనక సుతాత్మయౌ - ఘనత్రిత్వమౌ దేవా = నిను సన్నుతింపను నీదు దయ నంపుమా ||రమ్ము||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...