"నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము" - కీర్తన 103:2
నీ మేలులు వివరింపతరమా
నీ మేలులు వివరింపతరమా ప్రభువా
నీ కృపలను నే మరువగలనా
ఆదరించావు అగాపే ప్రేమతో
ఆదుకున్నావు నీ జాలి మనసుతో - నీ జాలి మనసుతో
బహు శ్రమలతో నేను సతమతమవుతున్నా
నను ధైర్యపరచి నడిపించినావే
నా హృదయవేధన తొలగించినావే ||ఆద||
2.ఊహించలేని కార్యాలు ఎన్నో
లెక్కించలేని పర్యాయములలో
నా జీవితంలో జరిగించినావే
నీ కృపతో నిత్యము దీవించినావే ||ఆద||
3.మరచిపోలేని నీ మేలులెన్నో
దయచేసినావు నా జీవితములో
నీ ప్రేమకు సాటి లేదేది ఇలలో
నీ కరుణకు బదులు ఏముంది ధరలో ||ఆద||
రచన & స్వరకల్పన సురేష్ నిటల