Showing posts with label Randi suvartha sunadam. Show all posts
Showing posts with label Randi suvartha sunadam. Show all posts

16 August 2020

Randi suvaartha sunaadamutho | రండి సువార్త సునాదముతో

135
సువార్త సునాదము

రండి సువార్త సునాదముతో - 
రంజిలు సిలువ నినాదముతో 
తంబుర సితార నాదముతో - 
ప్రభుయేసు దయానిధి సన్నిధికి

1.యేసే మానవ జాతి వికాసం -
యేసే మానవ నీతి విలాసం -
యేసే పతిత పావన నామం - 
భాసుర క్రైస్తవ శుభనామం ||రండి||

2.యేసే దేవుని ప్రేమ స్వరూపం -
యేసే సర్వేశ్వర ప్రతిరూపం -
యేసే ప్రజాపతి పరమేశం -
ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి||

3.యేసే సిలువను మోసిన దైవం
యేసే ఆత్మల శాశ్వత జీవం 
యేసే క్షమాపణ అధికారం
దాసుల ప్రార్థన సహకారం ||రండి||

4.యేసే సంఘములో మనకాంతి 
యేసే హృదయములో ఘనశాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి
పసిపాపల దీవెనమూర్తి  ||రండి||

5.యేసే జీవన ముక్తికి మార్గం
యేసే భక్తుల భూతల స్వర్గం 
యేసే ప్రపంచ శాంతికి సూత్రం
వాసిగ నమ్మిన జనస్తోత్రం  ||రండి||
                         - ఏ.బి.మాసిలామణి
_________________________________
Randi suvaartha sunaadamutho -
Ranjillu siluva sunaadamutho- 
Tambura sitaara naadamotho - 
Prabhu yesu dayanidhi sannidhiki

Yase manava jaathi Vikasam 
Yase manava neethi vilaasam
Yese pathita paavana naamam
Bhasura Kraisthava shubha naamam

Yese devuni prema swarupam
Yese sarveshwara prathi rupam
Yese praja pathi paramesham
Aashritha janamula sukha vaasam

Yese siluvanu mosina daivam
Yese aathmala shaswatha jeevam
Yese kshamapana adhikaaram
Daasula prardhana sahakaaram

Yese sanghamulo mana kanthi
Yese hrudayamulo Ghana Shanthi
Yese kutumba jeevana Jyothi
Padi paapala deevena Murthy

Yese jeevana mukthiki maargam
Yese bhakthula bhoothala swargam
Yese prapamcha shanthiki suthram
Vaasiga nammina jana sthothram
                          - A.B. Maasilamani
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...