Showing posts with label Ne Padipothini Nee Premaku. Show all posts
Showing posts with label Ne Padipothini Nee Premaku. Show all posts

27 June 2021

Ne Padipothini Nee Premaku | నే పడిపోతిని నీ ప్రేమకు ఇలలో

నే పడిపోతిని నీ ప్రేమకు ఇలలో
మైమరచితిని నా మదిని దేవా
నా ప్రతికూలతలో నా చెయ్యిపట్టి
నన్నాధరించి నడిపించితివే

1. ఈ లోక స్నేహముతో నేను కలిసి
రక్షణ జీవితం విడచితినే
మేలులెన్నో పొందిన క్షణమే
సత్యాన్ని విడచి నడిచితినే
నీ రక్తముతో నను కడిగితివే
నీ సహనముతో నను నడిపితివే

2. నా పాప భారమంత నీవు భరియించి
ఆ సిలువ భారము మోసితివే
నా ప్రాణమునకు నీ ప్రాణము బలియిచ్చి
ఎనలేని ప్రేమను చూపితివే
శుద్ధుడవు పరిశుద్ధుడవు
శుద్ధాహృదయం నాకు ఇచ్చితివే

నే పడిపోతిని నీ ప్రేమకు ఇలలో
మైమరచితిని నా మదిని దేవా
నా ప్రతికూలతలో నా చెయ్యిపట్టి
నన్నాధరించి నడిపించితివే

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...