Showing posts with label Nenellappudu Yehovanu. Show all posts
Showing posts with label Nenellappudu Yehovanu. Show all posts

03 December 2022

Nenellappudu yehovanu | నేనెల్లప్పుడు యెహోవాను


నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను..
ఆత్మతో సత్యముతో మనస్సుతో నా హృదయముతో..
నా జీవితాంతము నా యేసుని ఇల్లలో...
నే వెంబడించెదను.. ఓ...ఓ..ఓ..ఓ (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

1.నీతిమంతుల మొర్రవిని శ్రమల నుండి విడిపించి విరిగిన మనస్సును నలిగిన బ్రతుకును (2) 
తన వాక్యముతో ఎల్లవేళలా నను ఆదరించును (2)
ఓ..ఓ..ఓ..ఓ (2) 

2.నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ ఎడబాయావని
కరువులో కష్టములో బాధలో బలహీనతలో (2)
తన ప్రేమతో ఎల్లవేళలా నను ఆదుకోనును (2)
ఓ..ఓ..ఓ..ఓ (2)

08 December 2021

Antha Naa Meluke | అంతా నా మేలుకే ఆరాధనా| Nenellappudu Yehovanu | నేనెల్లప్పుడు యెహోవాను

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ 
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) 
అ.ప: అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే 
అంతా నా మంచికే - (తన ఛచిత్తమునకు తల వంచితే) (2)
అరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను

1.కన్నీళ్ళే పానములైన - కఠిన దుఃఖ బాధలైన 
స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన 
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) 
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)

2.ఆస్తులన్ని కోల్పొయిన - కన్నవారే కునుమరుగైన 
ఊపిరి బరువైన - గుండెలే పగిలినా 
యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను (2)
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2)

3.అవమానం ఎంతైన నా వారే కాదన్న 
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ? 
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు (2)
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు (2)

4.ఆశలే సమాధియైన - వ్యాధి బాధ వెల్లువైన 
అధికారము కొప్పుకొని - రక్షణకై ఆనందింతున్ 
నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా (2)
పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్ (2) 

5.చదువులే రాకున్న - ఓటమి పాలైన 
ఉద్యోగం లేకున్న - భూమికే బరువైన - 
నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2)
నీవుద్దేశించినది నిష్ప్రలము కానేరదు  (2) 

6.సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి - మేలుకై జరుగును 
యేసుని సారూప్యము నేను పొందాలని (2)
అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2)

7.నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు 
ఇక మీదట నేను తెలిసికొందును 
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2)
- Pranam Kamalakar,
- Dr. Asher Andrew.
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...