Showing posts with label Raj Prakash Paul. Show all posts
Showing posts with label Raj Prakash Paul. Show all posts

02 January 2022

Shramayaina Bhadhaina | శ్రమయైనా బాధైనా హింసలెన్ని

శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
ఖడ్గమే ఎదురైనా – శోధనలు ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
నా రాజు వచ్చుచున్నాడు – భీకరుడై వచ్చుచున్నాడు – (2)
సర్వోన్నతుడు మేఘారూఢిగా – తీర్పును తీర్చ రానున్నాడు
ఎదురేలేని కొదమసింహం – మహా ఉగ్రతతో రానున్నాడు

ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
ఎవరు? ఎవరు?ఎవరు? ఎవరు?
శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు
యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు

అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు – సర్వము చేసిన సృష్టికర్త
మహోన్నతుడు మహేశ్వరుడు – సర్వము గెలిచిన సర్వేశ్వరుడు
దేవాది దేవుడు రాజాధి రాజు – ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు

విశ్వాసమే నా బలము – నిత్యజీవము చేపట్టుటే నా భాగ్యము
శ్రమలేలేని బాధేలేని – ఆ లోకంలో నిరంతరం జీవింతును
విమోచకుడు సజీవుడు – నా కనులారా నే చూచెదను
యుగయుగములకు మహారాజునితో – పాలించుటకే పోరాడెదను

ఓ క్రైస్తవా సోలిపోకుమా – తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో
మోసపోకుమా జారిపోకుమా – నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో
మంచి పోరాటం నువ్వు పోరాడు – నీ పరుగునే కడముట్టించు
విశ్వాసమును కాపాడుము – యేసుని చేర వెయ్యి ముందడుగు ||శ్రమయైనా||

30 November 2021

Mruthyunjayuda Na Vimochaka | మృత్యుంజయుడా నా విమోచకా


మృత్యుంజయుడా - నా విమోచకా..నా నిరీక్షణ...  జీవాధారుడా...  
నీ వాక్కే నాకు వెలుగు - నీ సన్నిధే నాకు క్షేమము (2)
చాలయ్య యేసయ్య.. నీ ప్రేమే చాలయ్య (2)
ఆరాధనా యేసుకే నా రాజుకే - ఆలాపన యేసుకే నా రాజుకే (2)

విలువలేని నన్ను దృష్టించావు - తొలగియున్న నాకు దారి చూపావు (2)
నీ పిలుపు నన్ను పట్టుకుందయ్యా - నీ కృపయే నాకు చాలు యేసయ్య (2)
చాలయ్య యేసయ్య - నీ ప్రేమే చాలయ్య (2)
ఆరాధనా యేసుకే నా రాజుకే - ఆలాపన యేసుకే నా రాజుకే (2)

చీకటిలో నన్ను వెలిగించావు -  ద్రోహినైన నన్ను మన్నించావు (2)
ఇక నేను నీకే అర్పితమయ్యా - నీ సేవే నాకు ధ్యేయం యేసయ్య (2)
చాలయ్య యేసయ్య - నీ ప్రేమే చాలయ్య  (2)
ఆరాధనా యేసుకే నా రాజుకే - ఆలాపన యేసుకే నా రాజుకే (2)
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...