Showing posts with label Nemmadileni Hrudayalaku. Show all posts
Showing posts with label Nemmadileni Hrudayalaku. Show all posts

02 January 2022

Nemmadileni Hrudayalaku | నెమ్మదిలేని హృదయాలకు

నెమ్మదిలేని హృదయాలకు - నెమ్మదినీయుమా
స్వస్థతలేని నీ ప్రజకు - స్వస్థతనీయుమా
శాంతినినొసగుమయ్యా - స్వస్థత చేకూర్చుమా 

షాలోమ్ షాలోమ్ షాలోమ్ షాలోమ్ 
యెహోవా రాఫా నీకే స్థుతి

1. ఐగుప్తు రోగములలో ఏదియు - నీ చెంతకు రానీయనంటివి 
నిను స్వస్థపరచు దేవుడనేనని -నాకభయమిచ్చితివి 

2. ఓ నీతిసూర్యుడా నీ వెలుగులో  - నీ ప్రజలు స్వస్థత పొందెదరు
నీ వాక్కు పంపి మము పైకిలేపి - మము స్వస్థపరచితివి 

3. నీ చెంతకు చేరిన జనులపై - నీ కృపను మెండుగా కురిపించినావు 
నీవు పొందిన గాయములచే - స్వస్థత మేము నొందితిమి

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...