Showing posts with label Zion songs. Show all posts
Showing posts with label Zion songs. Show all posts

28 February 2023

Paramu digenu mahima ninde naalo |పరము దిగెను మహిమ నిండెనాలో

1.హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - ఎన్నడు మరువని దినం
నే చీకటిలో తిరిగినపుడు యేసు నన్ను సంధించె
హా! ఎంత జాలిగల మిత్రుడు హృదయ అక్కరతీర్చెను
మరణచ్చాయలు పోయె ముదమున తెలిపెద - చీకటినంత బాపెన్

పల్లవి: పరము దిగెను మహిమ నిండెనాలో
సిలువ యొద్ద స్వస్థత కలిగెను
నా పాపం కడిగెను రాత్రి పగలై మారెను
పరము దిగెను మహిమ నిండెనాలో

2. పరిశుద్ధ ఆత్మతో జన్మించితివి దేవుని గృహమందు
కల్వరి ప్రేమచే కల్గెనీతి ఓ ఎంత ఔన్నత్యము
తీర్మానము జరిగె వేగముగా పాపిగా నేను రాగా
కృపనిచ్చె దాని నే స్వీకరించగా రక్షించెను స్తోత్రము

3. నిశ్చయముగ పరమందున్న కాలము తీరగనే
భవనములు నాకందున్నవని స్థిరముగనే నమ్ముదున్
నమ్మి సిలువనే చేరిననాడే అదియే అద్భుతదినం
నిత్యైశ్వర్యమీ దీవెనలు పొందితి ప్రభు హస్తమునుండి

07 October 2022

Nee Jaldaru vrukshpu | నీ జల్దరు వృక్షపు నీడలలో

నీ జల్దరు వృక్షపు నీడలలో
నే నానంద భరితుడనైతిని
బలురక్కసి వృక్షపుగాయములు
ప్రేమాహస్తములతో తాకు ప్రభు  

పల్లవి: నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలిచితివి
నీ శిరము వానకు తడిసినను
నను రక్షించుటకు వేచితివి  

1. ఓ ప్రియుడా నా అతిసుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి
నీ సొగసును నాకు నొసగితివి ||నా హృదయపు||  
 
2. నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి
ద్రాక్షారస ధారలకన్న మరి
నీ ప్రేమే ఎంతో అతిమధురం ||నా హృదయపు||  

3. ఉన్నత శిఖరములు దాటుచును
ఇదిగో అతడొచ్చు చున్నాడు
నా హృదయపు తలుపులు తెరచుకొని
నా ప్రియుని కొరకు కనిపెట్టెదను ||నా హృదయపు||
  
4. నీ విందు శాలకు నడిపించి
రాజులు యాజకులతో జేర్చితివి
జీవాహారము నా కందించి
పరమా గీతములను నేర్పితివి ||నా హృదయపు||
                  - K. హెన్రీ గారు 

06 October 2022

Yehova naa kaapari naaku | యెహోవా నా కాపరి నాకు


యెహోవా నా కాపరి - నాకు లేమి లేదు
పచ్చికగల చోట్ల - మచ్చికతో నడుపున్

1.మరణపు చీకటిలో - తిరుగుచుండినను
ప్రభుయేసు నన్ను - కరుణతో ఆదరించున్ ||యెహోవా||

2.పగవారి యెదుట - ప్రేమతో నొక విందు
ప్రభు సిద్ధము చేయున్ - పరవశ మొందెదము |యెహోవా||

3.నూనెతో నా తలను - అభిషేకము చేయున్
నా హృదయము నిండి- పొర్లుచున్నది ||యెహోవా||

4.చిరకాలము నేను - ప్రభు మందిరములో
వసియించెద నిరతం - సంతసముగా నుందున్ ||యెహోవా||

20 March 2022

Yesayya naamam preethigala | యేసయ్య నామం ప్రీతిగల నామం

యేసయ్య నామం - ప్రీతిగల నామం
సాటి లేని నామం - మధుర నామం

పాపము పోవును - భయమును పోవును
పరమ సంతోషము - భక్తుల కీయును

పరిమళ తైలము - యేసయ్య నామము
భువిలో సువాసన - యిచ్చెడి నామము

భూలోకమంతట - మేలైన నామము
సైన్యాధిపతియగు - యేసయ్య నామము

నిన్న నేడు - మారని నామము
నమ్మినవారిని - విడువని నామము

ప్రతివాని మోకాలు - వంచెడి నామము
ప్రతి వాని నాలుక - స్తుతించెడి నామము

సాతాను సేనను - జయించిన నామము
పాప పిశాచిని - తరిమెడీ నామము

భక్తుల కాచెడీ - శక్తిగల నామము
పరమున చెర్బెడి - పరిశుద్ధ నామము

18 March 2022

Enaleni sthuthulatho | ఎనలేని స్తుతులతో ఆరాధింతుము

ఎనలేని స్తుతులతో - ఆరాధింతుము ప్రభువా (2)
దీన మనసుతో - నిన్ను కొలుతుమయ్యా (2) ||ఎనలేని||

1. నీ నామ గానం మాకెంతో ముదము - నీ ప్రేమ వాత్సల్యం మాకెంతో ప్రియము (2)
నీ కార్యములే ఆశ్చర్య కార్యములు - నీ తలంపులే మాకెంతో మధురం (2) ||ఎనలేని||

2. మా ఉన్నత దుర్గము మాదేవుడే - మేమాశ్రయించిన మా శైలము (2)
మా దీపమును వెలిగించువాడు - మా దేవుడే మాకు వెలుగు (2) ||ఎనలేని||

3. సన్మార్గమందు నడిపించినావు - దుర్మార్గులందరిని రక్షించినావు (2)
దరిచేరి నమ్మిన దీనులందరిని - నీ ఆత్మ ద్వారా నడిపించినావు (2) ||ఎనలేని||
DOWNLOAD MP3 SONG HERE 👇

28 December 2021

O manavunda nee gathi ఓ మానవుండ నీ గతి


639 
1.ఓ మానవుండ నీ గతి యేమౌనో తెలియునా
యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా? ||ఆహా||
 
ప|| ఆహా..ఆ...అంత్యతీర్పు నందున - యేసూ నీ రక్షకుడే
మహాభయంకరమో - సింహంబుగా నుండు
 
2.లోకాలు పుట్టినప్పటినుండి మృతులైన ఏ
 కులజుడైన నాటికి - తెర్పులో నిలచును ||ఆహా||
 
3.మృతులైన ఘనులు - హీనులు యేసయ్య యెదుటను
ప్రతివారు నిలిచియుందురు - బ్రతికిన రీతిగనే ||ఆహా||
 
4.గ్రంధాలు విప్పబడగ - గ్రంధాలలో వారి 
గ్రంథంబు బట్టబయలై - పొందుదురు తీర్పును ||ఆహా||
 
5.నరులెల్ల క్రియలచొప్పున - మరి తీర్పు పొందుదురు
మరణము మృతుల లోకము -  గురియౌను యగ్నికి ||ఆహా||
 
6.ఈనాడు నీవు కూడను - యేసుని విడిచినచో 
ఆనాడు నీవు కూడాను - అందుండి ఏడ్చెదవు ||ఆహా||
 
7.దేవుని జీవగ్రంథము - దేవుడు తెరచును 
ఎవ్యాని పేరందుండదో - వాడగ్నిలో బడును ||ఆహా|| 
DOWNLOAD MP3 SONG HERE 👇

05 June 2021

Prema Nee Prema Varninchuta | ప్రేమ నీ ప్రేమా వర్ణించుట నా తరమా

ప్రేమ నీ ప్రేమా వర్ణించుట నా తరమా
దేవదూతలైన నీ ప్రేమను వర్ణింపలేరు ప్రభువా
                                                       ||ప్రేమ||
సముద్రము లోతుకంటే ఎంతో లోతైనది -
ఎవరు కొలువగలరు ఆ ప్రేమకు సాటి ఏది(2)
ప్రభువా నీ దివ్య ప్రేమకై అర్పింతును నా జీవితం(2)
                                                       ||ప్రేమ||
నీ ప్రేమ మరణము కంటే ఎంతో బలమైనది -
ఆ ప్రేమే ఈ పాపిని రక్షించి కాచినది(2)
ప్రభువా నీ దివ్య ప్రేమకై అర్పింతును నా జీవితం(2)
                                                       ||ప్రేమ||
కలువరి సిలువప్రేమయే నన్నువిమోచించి ఆదరించెను-
ఆ దివ్య ప్రేమయే తండ్రితో ఐక్యపరచెను(2)
ప్రభువా నీ దివ్య ప్రేమకై అర్పింతును నా జీవితం(2)
                                                       ||ప్రేమ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Arunodayme Nee Sannidhi Cheri | అరుణోదయమే నీ సన్నిధి చేరి

అరుణోదయమే నీ సన్నిధి చేరి అర్పణగా మారెదన్
ఆరాధనా స్తుతి స్తోత్రములన్ ఆర్పణల్ చెల్లింతును
ప్రియ యేసువా నీ సన్నిధియందు అప్పగింతును నన్నునే
ఆరాధనా స్తుతి స్తోత్రములన్ ఆర్పణల్ చెల్లింతును

ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా(2)
ప్రియ యేసు రాజునకే మహిమ స్వరూపునకే(2)

పరలోక మహిమను విడచితివి నరరూపిగ ఇలకే తెంచితివి(2)
నా కొరకై రుధిరము కార్చితివి మధురం నీప్రేమ అతి మధురం(2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా(4)
ప్రియ యేసు రాజునకే మహిమ స్వరూపునకే(2)

02 June 2021

Gorrepilla vivaahothsava | గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము

గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి (2)

1.సర్వాధికారియు- సర్వోన్నతుండైన - 
మన తండ్రిని ఘనపరచి - మనముత్సహించెదము 
                                                ||గొర్రెపిల్ల||
2.సిద్ధపడెను వధువు - సుప్రకాశముగ -
 నిర్మల వస్త్రములతో - నలంకరించుకొనెన్ 
                                                ||గొర్రెపిల్ల||
3.పరిశుద్ధుల నీతిక్రియలే - యా వస్త్రములు -
గొర్రెపిల్ల రక్తములో - శుద్ధి నొందినవారు 
                                                ||గొర్రెపిల్ల||
4.తెల్లని గుర్రముపై - కూర్చుండినవాడు 
నమ్మకమై యున్నట్టి - పెండ్లి కుమారుండు 
                                                ||గొర్రెపిల్ల||
5.దేవుని వాక్యమును - నామము గలవాడు
 రక్తములో ముంచిన - వస్త్రమునే ధరించె 
                                                ||గొర్రెపిల్ల||
6.పరలోక సేనలు - తెల్ల వస్త్రములతో 
తెల్ల గుర్రములెక్కి - వెంబడింతురు ప్రభుని 
                                                ||గొర్రెపిల్ల||
7.ప్రేమించి సంఘముకై- ప్రాణంబునిడె ప్రభువు
పరిశుద్ధ పరచుట కొరకై - తానప్పగించుకొనెన్ 
                                                ||గొర్రెపిల్ల||
8.శ్రీయేసు క్రీస్తుండే - సంఘంబునకు శిరస్సు - 
వాక్య ఉదకముతోడ - శుద్ధిపరచుచుండె 
                                                ||గొర్రెపిల్ల||
9.యెహోవా రాజ్యములో - భూలోకవాసులు -
 సంతోష హృదయములతో - తేజరిల్లుదురు 
                                                ||గొర్రెపిల్ల||
10.దేవా ఈ కార్యమును - నెరవేర్చితివి నీవే -
 నిత్యమును నీ మహిమ - పాడెదం హల్లెలూయా -
                                                ||గొర్రెపిల్ల||
DOWNLOAD MP3 SONG HERE 👇

21 March 2021

Amulya Rakthamu Dwara Rakshana | అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన

అమూల్య రక్తము ద్వారా - రక్షణ పొందిన జనులారా
సర్వశక్తుని ప్రజలారా - పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను - పరిశుద్ధులారా పాడెదము

1. మన యౌవన జీవితముల్ - శరీరాశకు లోబరచి
చెడుమాటలను పలుకుచు - శాంతిలేక యుంటిమిగా

2. చెడు మార్గమున పోతిమి - దాని యంతము మరణము
నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి

3. నిత్య సత్య దేవుని - నామమున మొరలిడక
స్వంత నీతితోడనే - దేవుని రాజ్యము కోరితిమి

4. కనికరముగల దేవుడు - మానవరూపము దాల్చెను
ప్రాణము సిలువను బలిజేసి - మనల విమోచించెను

5. తన రక్తధారలలో - మన పాపములను కడిగి
మన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో

6. పాపులమైన మనమీద - తన యాశ్చర్య ఘనప్రేమ
కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము

7. మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసెను ధన్యులుగా
మన దేవుని కర్పించెదము - జీవాత్మ శరీరములన్
DOWNLOAD MP3 SONG HERE 👇

10 January 2021

Randi Yehovanu Gurchi | రండి యెహొవాను గూర్చి ఉత్సాహగానము

రండి యెహొవాను గూర్చి - ఉత్సాహగానము చేసేదము
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని ||రండి||

కష్ట నష్టము లెన్నున్నా - పొంగు సాగరా లెదురైనా (2)
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2) ||రండి||

విరిగినలిగిన హృదయముతో - దేవదేవుని సన్నిధిలో(2)
అనిశము ప్రార్ధించిన - కలుగు ఈవులు మనకెన్నో (2) ||రండి||

త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడని (2)
నీతి సూర్యుండాయనే యని - నిత్యము స్తుతి చేయుదము (2) ||రండి||
_______________________________
Randi yehovanu goorchi uthsaha Gaanamu cheyudamu
Aayane mana poshakudu namma dagina devudani ||Randi||

Kashta nashtamu lennunna - pongu saagaru ledurainaa (2)
Aayane mana aashrayamu - irukulo ibbhandulalo (2) ||Randi||

Virigi naligina hrudayamutho - devadevuni sannidhilo (2)
Anishamu prardhinchina- kalugu eevulu manakenno (2) ||Randi||

Throva thappina vaaralanu - cheradeese naadhudani (2)
Neethi suryundayane yani - nithyamu sthuthi cheyudamu (2) ||Randi||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...