Showing posts with label Dhaathruthvamunu Galigi. Show all posts
Showing posts with label Dhaathruthvamunu Galigi. Show all posts

10 October 2021

Dhaathruthvamunu galigi | దాతృత్వమును గలిగి పెరుగుదమ

573
క్రైస్తవ దాతృత్వము
రా - శంకరాభరణము, తా - అట
(చాయ: యేసునామంబెత్తి పాడుదమ)

దాతృత్వమును గలిగి పెరుగుదమ = ధనము - ధాత్రి దేవుని దంచు నెఱు - గుదమ ||దాతృ||  

1.శక్తికొలఁది కాన్కలర్పింతమ = మన భుక్తినుండి కొంతఁ దీయుధమ ||దాతృ||  

2.సంతోషముగ నియ్య సాగుదమ = మన - స్సంతటితోఁ జేయ నేగు దమ ||దాతృ||  

3.గర్వఘనములు వీడి యర్పింతమ = యుర్వి - సర్వ మాయనదంచు నేర్పింతమ ||దాతృ||  

4.సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ = క్రీస్తు - సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ ||దాతృ|| 

5.ప్రతియాదివార మిది మది నుంతమ = దీని - ప్రతి సంఘస్థుఁడు చేయ బోధింతమ ||దాతృ|| 

6.విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ = సంఘ - విధవాళి దానముతో  దర్శింతుము ||దాతృ|| 

7.దిక్కులేని జనుల దీవింతమ = వారి - యక్కఱలలో మేలుఁ గావింతమ ||దాతృ|| 

8.పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ = మఱల - నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ ||దాతృ||  

9.వెదజల్లి యభివృద్ధి పొందుదమ = మోక్ష - పదవు లను భవింపఁ బరుగిడుదమ ||దాతృ|| 

10.వర్ధిల్లిన కొలది చెల్లింతము = లోక - వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ ||దాతృ||
                            - మోర్త ప్రకాశము

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...