Showing posts with label నిన్ను కాపాడువాడు కునుకడు. Show all posts
Showing posts with label నిన్ను కాపాడువాడు కునుకడు. Show all posts

02 January 2022

Ninnu Kaapaduvaadu Kunukadu | నిన్ను కాపాడువాడు కునుకడు

నిన్ను కాపాడువాడు కునుకడు 
నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2) 
నీ భారము వహియించు యేసు 
నీ కొరకై మరణించె చూడు (2) || నిన్ను ||

పలుకరించే వారు లేక పరితపిస్తున్నా 
కనికరించి వారు లేక కుమిలిపోతున్నా (2) కలతలెన్నో కీడులెన్నో 
బ్రతుకు ఆశను అణచివేసినా (2) 
ఎడబాయడు యేసు నిన్ను 
దరి చేర్చును యేసు నిన్ను (2) || నిన్ను ||

మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా
పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2) భీతులెన్నో భ్రాంతులెన్నో 
సంతసంబును త్రుంచివేసినా (2) 
ఎడబాయడు యేసు నిన్ను 
దరి చేర్చును యేసు నిన్ను (2) || నిన్ను ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...