Showing posts with label Goppa Deva Neevu Naa Thandrivi. Show all posts
Showing posts with label Goppa Deva Neevu Naa Thandrivi. Show all posts

18 August 2021

Goppa Deva Neevu Naa Thandrivi | గొప్ప దేవ నీవు నా తండ్రివి

60
నీవు నా తండ్రివి
రా – ఆనంద భైరవి, తా – ఆది
                  
గొప్ప దేవ నీవు నా తండ్రివి - యకాశమందు - గొప్ప దేవ నాకుఁ దండ్రివి = తప్పకుండ వత్తు నీ - దరికి యేసు నామమందు - గొప్ప కరుణ చేత న - న్నిప్పుడు తగఁ జేర్చుకొనుము || గొప్ప ||

1. నీవు మిగుల గొప్ప వాఁడవు - నా సృష్టి కర్త - యీవు లెపుడు నిచ్చు వాఁ డవు = భావమందు నినుఁ దలంచి - పావనాత్మ నాకు నిచ్చి - జీవమార్గమందు నిలిపి - కావు మనుచు వేఁడుకొందు || గొప్ప ||

2. చిన్నవాని నంగి ప్రార్థన - నీ లోకమందు - మున్ను దయను నిన్న వాఁడవు సన్నుతుఁడగు యేసు నీదు - సన్నిధి నున్నాఁడు గాన - నన్నుఁ గనికరించు మనుచు నమ్మి వత్తు నిపుడు || గొప్ప||

3. విలువ గల్గు నీదు నాజ్ఞలు - నా హృదయమందు - బలు విధములఁ దలఁ చు చుందును = బలుకులందుఁబనులయందు - బలముఁ జూపి నిన్ను గొలిచి - యిలను నిన్నుఁ బ్రీతిపరుతు - నలయక నీ కరుణ మెయిని || గొప్ప||

4. మీఁది రాజ్యమందుఁ జేర్చుము - కరుణాసముద్ర - బీద నైన నన్నుఁ గరుణచే = సోదరులను గూడికొనుచు - మోద మొప్పఁగ నీదు సేవఁ బాదుకొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి || గొప్ప ||
                            - పులిపాక జగన్నాథము

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...