Showing posts with label పరమందు ఉన్న ఆ దైవము. Show all posts
Showing posts with label పరమందు ఉన్న ఆ దైవము. Show all posts

13 November 2022

Entho anandamu | Paramandu unna aa daivamu| పరమందు ఉన్న ఆ దైవము



పరమందు ఉన్న ఆ దైవము -
భువిపైకి దిగివచ్చినా వైనము (2) 
జనులందరి రక్షణకై ఆ దైవము దయచూపి చేసిన సంకల్పము (2)
ఎంతో ఆనందము - నిత్య సంతోషము 
ఎంతో వైభోగము - క్రీస్తుని జననము (2)  

1.ప్రజలందరు పాపులై - దేవునికి దూరమై
పాపం పరిపక్వమై - మరణం దరి చేరువై (2)
పాపాన్ని క్షమియించుటకు - మరణాన్ని తొలగించుటకు 
అందరినీ రక్షించుటకు - పరిశుద్ధత స్థాపించుటకు
దైవమే... మనుష్యునిగా ఇలలో జన్మింపగా
ఎంతో ఆనందము - నిత్య సంతోషము 
ఎంతో వైభోగము - క్రీస్తుని జననము (2) ||పరమందు||  

2. ప్రజలందరు శుద్దులై - పాపానికి దూరమై 
ప్రభు యేసుని శిష్యులై - లోకానికి వేడుకై (2)
క్రీస్తును ప్రకటించుటకు - క్రీస్తు ప్రేమ చూపించుటకు
క్రీస్తు లా జీవించుటకు - పాపిని రక్షించుటకు
దైవమే... మాదిరిగా ఇలలో జన్మించగా
ఎంతో ఆనందము - నిత్య సంతోషము
ఎంతో వైభోగము - క్రీస్తుని జననము (2) ||పరమందు||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...