Showing posts with label Deva Maa Kutumbamu lyrics. Show all posts
Showing posts with label Deva Maa Kutumbamu lyrics. Show all posts

15 April 2021

Devaa Maa Kutumbamu Nee Sevake | దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము

దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
ఈ శాప లోకానా నీ సాక్షులుగ నిలువ
నీ ఆత్మతో నింపుమా.. నీ ఆత్మతో నింపుమా
దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము

1. కాపరి మా యేసు ప్రభువే.. కొదువేమి లేదు మాకు
మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్య
లోబడి జీవింతుము..లోపంబులు సవరించుము..
లోకాశలు వీడి..లోకంబు లోన..నీ మందగా ఉందుము

2. సమృద్ధి జీవంబును.. సమృద్ధిగా మాకిమ్ము
నెమ్మదిగల ఇల్లు.. నిమ్మళమగు మనస్సు..ఇమ్మహిలో మాకిమ్మయ్య
ఇమ్ముగ దయచేయుము.. గిన్నెనిండిన అనుభవము
ఎన్నో కుటుంబాల... ధన్యులుగా చేయంగ.. మమ్ములను బలపరచుము

3. ఏ కీడు రాకుండగా.. కాపాడుము మా పిల్లలను
లోకా దురవ్యసనముల..తాకుడు లేకుండ.. దాచుము నీచేతులలో
వోలీవ మొక్కల వలెను..ధ్రాక్ష తీగలను పోలి
ఫల సంపదలతోను...కలకాలము జీవించ... కురిపించుము నీ దీవెనలన్

4. పెంపార జేయుము మాలో.. సొంపుగ నీ ఘన ప్రేమన్ 
నింపుమ హృదయముల.. శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము ..
వింతైన నీప్రేమను..అంతట ప్రకటింతుము. కొంతకాలమే మేము..ఉందుము లోకానా.. చెంతచేరగ కోరెదము.. 
నీ చెంతచేరగ కోరెదము..

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...