Showing posts with label Siluvalo Aa Siluvalo Aa Ghora. Show all posts
Showing posts with label Siluvalo Aa Siluvalo Aa Ghora. Show all posts

07 March 2021

Siluvalo aa siluvalo aa ghora | సిలువలో ఆ సిలువలో ఆ ఘోర

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో - 
తులువల ఆ మధ్యలో వ్రేలాడిన యేసయ్యా (2)
వెలి అయిన యేసయ్యా - బలి అయిన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా - నీవెంతో అలసితివా ||సిలువలో||

1.నేరము చేయని నీవు - ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ - మోయలేక మోసావు (2)
కొరడాలు చెళ్లని చీల్చెనే - నీ సుందర దేహమునే (2)
తడిపెనే నీ తనువునే - రుధిరంబు ధారలే (2) ||వెలి||

2.వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె - 
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను (2)
ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా ||వెలి||

2.నాదు పాప భారం - నిను సిలువకు గురి చేసెనే -
నాదు దోషమే నిన్ను - అణువణువున హింసించెనే (2)
నీవు కార్చిన రక్త ధారలే - నా రక్షణ ఆధారం (2)
సిలువను చేరెదన్ - విరిగిన హృదయముతోను (2) ||వెలి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...