Showing posts with label Prabhuva mammunu deevinchi. Show all posts
Showing posts with label Prabhuva mammunu deevinchi. Show all posts

30 January 2022

Prabhuva mammunu deevinchi | ప్రభువా మమ్మునుదీవించి

610             ఆరాధన ముగింపు
రా - భీంప్లాస్                         తా - త్రిపుట

ప్రభువా మమ్మునుదీవించి - పంపుము నీ కృప నందించి అభినందన ములఁ జేకొనుమా -  విభవము మహిమోన్నతి కీర్తి యుగయుగములకు నీకగుతన్॥ప్రభువా॥ 

1. పగతురఁ బ్రేమించెడు శక్తిన్ - తగఁబొరుగును జూచెడి రక్తిన్ మిగులందయ చేయుము దైవ - జగదేక కుమారా కీర్తి - యుగయుగములకు నీ కగుతన్ చేయుము ॥ప్రభువా

2. గుడిలో వినిన నీవాక్యము మా - గుండెలఁ బదిలము జేయఁగను  గుడిబయటను నా చారములో - నడువగఁ దోడ్పడుమో కీర్తి యుగయుగము - లకు నీ కగుతన్ ॥ప్రభువా॥ 

3. క్రైస్తవ మైత్రిని సంఘములో - విస్తరణము జేయఁగనిమ్ము నేస్తవ భావము లోకములో - నెరపఁగ దయఁగనుమో కీర్తి యుగయుగములకు నీ కగుతన్ ॥ప్రభువా|| 
                        - మొలతాటి విద్యానందము

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...