Showing posts with label మంచే లేని నా పైన ఎంతో ప్రేమ. Show all posts
Showing posts with label మంచే లేని నా పైన ఎంతో ప్రేమ. Show all posts

19 January 2022

Manche leni naapaina | మంచే లేని నా పైన ఎంతో ప్రేమ

మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు (2)
ఆదియంత మైనవాడవు - మానవుని రూపమెత్తావు (2)
పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి (2) 
ఎంతగా స్తుతులు పాడినా - యేసు నీ ఋణము తీరునా (2) ||మంచే లేని||

లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు - సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు (2)
నీదెంత దీన మనస్సు - నా కెంత ఘనత యేసు (2)
ఎంతగా స్తుతులు పాడినా - యేసు నీ ఋణము తీరునా (2) ||మంచే లేని||

నాశనమైన నన్ను రక్షించ గోరిన నీవు - వాత్సల్యము చూపి నాచెంత కొచ్చినావు (2)
నీలోన జాలి పొంగే - నాలోన శాంతి నిండె (2)
ఎంతగా స్తుతులు పాడినా - యేసు నీ ఋణము తీరునా (2) ||మంచే లేని||

చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు - వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు (2) 
నీ సాటిలేని త్యాగం - నా పాలి గొప్ప భాగ్యం (2) 
ఎంతగా స్తుతులు పాడినా - యేసు నీ ఋణము తీరునా (2) ||మంచే లేని||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...