Showing posts with label Alpakaalamu Paapabhogamu. Show all posts
Showing posts with label Alpakaalamu Paapabhogamu. Show all posts

11 November 2021

Alpakalamu Paapabhogamu | అల్పకాలము పాపభోగము

అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా 
మరణించగానే పరమునకు నీవు చేరుట ప్రాముఖ్యమా ? 
సంపాదన సందడిలో నీవు బ్రతుకుటే నీకిష్టమా
సమస్త జనుల యొద్ధ నీవు వాక్యమును ప్రకటించుమా ||అల్ప ||

కిరీటము వద్దని నా మోషే ప్రజలతో శ్రమ పొందెను
దేవుని ఇల్లంతటిలో బహు నమ్మకముగా ఉండెను
ప్రధానులు అధిపతులు రాజుతో చట్టం ఒకటి తెచ్చిన
తలవంచక దానియేలు సింహాల బోనులో చేరెను 
ఈ లోకములో ఉన్నదంతా పాపమని నువ్వు తెలుసుకో 
బ్రతికుండగా సత్ క్రియల చేత దేవునిని మెప్పించుకో (2) ||అల్ప||

అపోస్తలులు శ్రమలను అనుభవించి క్రీస్తుని వెంటాడిరి 
ప్రతి ఫలముగా మరణించి వారు పరిశుద్ధులతో ఉండిరి 
ప్రజల రక్షణ కొరకు ప్రభువు సిలువలో మరణించెను
తిరిగి లేచి తండ్రి సింహాసనము నందు ఉంచెను 
రాళ్లతో కొట్టబడినరూ అని వాస్తవము లను తెలుసుకో 
రంపము లతో కోయబడిరని బ్రతకడం నువ్వు నేర్చుకో (2) ||అల్ప||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...