Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

15 June 2023

Hrudayamanedu thalupunodha హృదయ మనెడు తలుపు

310
యేసు హృదయద్వారమును తట్టుట 
రా - భైరవి,   తా - ఆది

హృదయ మనెడు తలుపునొద్ద - యేసు నాధుండు = నిలచి సదయుడగుచు దట్టు చుండు - సకల విధములను ||హృదయ||

1.పరుని బోలి నిలుచున్నాడు - పరికించి చూడ = నతడు పరుడుగాడు రక్షకుండు - ప్రాణ స్నేహితుడు ||హృదయ||

2.కరుణాశీలుం డతడు గాన - గాచి యున్నాడు = యేసు - కరుణ నెఱిగి గారవింప - గరము న్యాయంబు ||హృదయ||

3.ఎంతసేపు నిలువబెట్టి - యేడ్పింతు రతని = నాత - డెంతో దయచే బిలుచు చున్నా - డిప్పుడు మిమ్ములను ||హృదయ||

4.అతడు మిత్రు డతడు మిత్రు - డఖిల పాపులకు = మీర లతని పిలుపు వింటి రేని - యతడు - ప్రియుడగును ||హృదయ||

5.జాలిచేత దన హస్తముల - జాపి యున్నాడు = మిమ్ము - నాలింగనము సేయ గోరి - యనిశము కని పెట్టు ||హృదయ||

6.సాటి లేని దయగల వాడు - సర్వేశు సుతుడు = తన - మాట వినెడు వారల నెల్ల - సూటిగ రక్షించు || హృదయ||

7.చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసు నాధు = నతడు - చేర్చు కొనుచు మీకిచ్చును - చిర జీవము గృపను ||హృదయ||

8.అతడు తప్పక కలుగజేయు - నఖిల భాగ్యములు = మీర - లతని హత్తుకొందు రప్పు - డానందముతోడ ||హృదయ||

9.బ్రతుకు శాశ్వతంబు కాదు - పరికించి చూడ = గాన బ్రతికి యుండు కాలముననే - ప్రభుని గొలువండి ||హృదయ||
                                  - పులిపాక జగన్నాదము

11 May 2023

Hrudayama hrudayama హృదయమా హృదయమా

హృదయమా హృదయమా (2)
నీవేల క్రుంగియున్నావు -
నాలో నీవేల తొందర పడుచున్నావు (2)
హృదయమా హృదయమా (2)

దేవునియందు నిరీక్షణ ఉంచుము - 
దేవుడే నీకు సహాయం చేయును (2)
ఆయనే నీ రక్షకుడు నీ విమోచకుడు (2)
ఆయనయందే విశ్వాసముంచుము (2)
||హృదయమా||

క్రుంగియున్నవేళలో లేవనెత్తి -
మరణము నుండి విడిపించి (2)
శ్రమయు దుఃఖమును తీసి వేసి
సంతోషవస్త్రము ధరింప చేయును (2)
||హృదయమా||
DOWNLOAD MP3 SONG HERE 👇

07 April 2023

Hosanna hosanna yesanna yesanna హోసన్నా హోసన్నా యేసన్నా

హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా
నీవున్నా చాలన్నా ఎంతో మదురమన్నా
నన్ను ఏలు దైవమా నీకోసమెగా 
హృదయ వాసం తెరిచి ఉంచాగా (2)
 
1.తీరని దాహం - లోకపు మొహము
ఆత్మలో దాహము - తీర్చేడి దైవమా (2)
 జీవప్రవాహం నీనామ గానం
వీనుల విందై పొంగెను రాగం
తీయగ ఆత్మ నీదు దివ్య కృపైన ||హోసన్నా||
 
2.మెల్లని స్వరము - వినబడె నాత్మలో
రక్షకుడగు నీ - అమర సునాదం (2)
సిలువలోనే ముగిసిపోయెను 
పాపపు శాపం తొలగిపోయెను 
స్తోత్రము చేసెదను ఆహ్వానమైనా ||హాసన్నా||
DOWNLOAD MP3 SONG HERE 👇

31 October 2022

Happy happy christmas antu | హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ ఆర్భటించెదం 
అందరి రక్షకుడేసని చాటి చెప్పెదం
ఊరువాడ వీధుల్లోన తిరిగి చెప్పెదం
యేసే మన దేవుడని ఆరాధించెదం

వార్త సంతోషవార్త శుభవార్త సర్వలోకనికీ
వార్త రక్షణవార్త ప్రేమసువార్త ప్రజలందరికీ
యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని
చీకటి బ్రతుకులను వెలుగుగ చేస్తాడని
ధైర్యమే మన వంతని చెప్పెను దూత

హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ అంటూ ఆర్భటించెదం 
అందరి రక్షకుడేసని చాటి చెప్పెదం 
ఊరూవాడా వీదుల్లోన తిరిగి చెప్పెదం
యేసే మన దేవుడని ఆరాధించెదం (2)
క్రిస్మస్ పాటలతో క్రీస్తు ప్రేమతో (2)
ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధిద్దాం

1.మన పాపం మన శాపం తీసివేయను - యేసు ధరకు వచ్చెను
మన రోగం మన మరణం తీసివేయను - యేసు ఇలకు వచ్చెను (2)
పాపము తీయుటకు - శాపము బాపుటకు
సిలువ రక్తముతో - మనలను కడుగుటకు 
ఎంతో ఇష్టపడి వచ్చెను యేసు (2) ||హ్యాపీ హ్యాపీ||

2.ఇమ్మానుయేలను వాగ్ధానముతో 
యేసు ధరకు వచ్చెను
ఇల నుండి పరలోకం మనలచేర్చను యేసు ఇలకు వచ్చును (2)
మన తోడైయుండ మనలను రక్షింప
మనకై మరణించి సమాధి చేయబడి
తిరిగి లేచుటకు వచ్చెను యేసు (2)||హ్యాపీ హ్యాపీ||

21 April 2022

Halleluya yani paadudi | హలెలూయ యని పాడుఁడీ

217 
ఆయన యుగ యుగములు జీవించుచున్నాడు
రా - బిళహరి, తా - త్రిపుట
(ఛాయ: గీతములు పాడుడీ)

హలెలూయ యని పాడుఁడీ - సమాధిపై - వెలుఁ గేమొ పరికించుఁడీ = కలఁడు యేసు సజీవుఁడయి, లే - ఖనముల లవి నెరవేరెను - కలిమి మోదము గులగ, దివి నుతి - సలువ మహిమను వచ్చును ||హలెలూయ||

1.హలెలూయ యని పాఁడుడీ - యీ జగతికిఁ - కలిగె రక్షణ చూడుఁడీ = శిలఁ దొలంగెను, ముద్ర విడె, కా -  వలి సమాజము దేవుని - బలిమి కాగక పారిపోయెను - గలిబి లాయెను నరకము ||హలెలూయ||

2.హలెలూయ యని పాడుఁడీ - చీఁకటిపైని - వెలుఁగే జయ మొందుసుండీ = యిలను మృత్యువు గూలె, బ్రతికెఁగా - యల విశ్వాసము మరలను - బలనిరీక్షణ మనకుఁ గలిగెను - బ్రతిహృదయము బలపడెన్ ||హలెలూయ||

3.హలెలూయ యని పాడుఁడీ - దుఃఖించు నో -  చెలియలారా వినుఁడీ = సొలయకుండఁగ మీర లటునిటు - చూచుచుండుట యెవరిని - ఫలము లేదిఁక బ్రతుకు యేసు - ప్రభుని వెదకుట మృతులలో ||హలెలూయ||

4.హలెలూయ యని పాడుఁడీ - యేసు ప్రభుని -  వలననే గలిగెఁగనుఁడీ = యిలయుఁ బరమును సఖ్యపడియెను - గలిగె హర్షము చావుచే - సిలువ చింతలు మాని, పొందుఁడి - కలకలంబగు మోదము ||హలెలూయ||

5.హలెలూయ యని పాడుఁడీ - మీ భూరి చిం - తలుతీరె మది నమ్ముఁడీ = బలహీనపు చిన్న మందా! - ప్రభుని చెంతకు మరలుము - కలుగు జీవము మిమ్ము నాయన - కరుణతో నడుపును సదా ||హలెలూయ||

6.హలెలూయ యని పాడుఁడీ - సంఘము సదా - నిలిచి యుండును సుమండీ = పలు తెరంగుల రిపుల వలనను - బాధ లెన్నియుఁ గలిగినన్ దొలఁగ కేమియు నన్ని యడ్డుల - గెలిచి వర్ధిల్లుచుండును ||హలెలూయ||

7.హలెలూయ యని పాడుఁడీ - దేవుని బోధ - కులు సర్వరాష్ట్రంబుల = నెలమి మహిమకుఁ బ్రథమ ఫలమగు - యేసు రక్షణ వార్తను - వెలుఁ గువలెఁ బ్రసరింపఁ జేయుదు - రిలను ధృతితో నేర్పుతో ||హలెలూయ||

8.హలెలూయ యని పాడుఁడీ - భక్తులారా - విలపింపవలదు సుండీ = కలుగకుండుఁడి సందియంబులు - గడుచు కాలము శీఘ్రమే - కలుగు మీకు సమాధి మిమ్మును గౌఁగిలింప నెమ్మది ||హలెలూయ||

9.హలెలూయ యని పాడుఁడీ - గోధుమ గింజ - వలె బ్రతుకుదురు మీరల = ఇల ప్రభువు తన పంటఁ గూర్పను - నేగుదెంచును జివరను - తొలఁగఁ జేయును గురుగులను గో - ధుమలనుండి నిజంబుగా ||హలెలూయ||
                    – కడియం గాబ్రియేలు

03 April 2022

Harshame yentho harshame | హర్షమే యెంతో హర్షమే

208   
క్రీస్తుని యాచర్యమైన మరణం 
(ఛాయ: చూడరే క్రీస్తుని)
రా - మూఖారీ,   తా - త్రిపుట

¹హర్షమే యెంతో హర్షమే - క్రీస్తును కార్యము - హర్షమే యెంతో హర్షమే = హర్షమే తద్భక్తవరులకు - నద్భుతంబగు యేసు క్రియలా - కర్షమై హృదయంబు నందలి - కలుషముం ధ్వంసింపఁజేయు ||హర్షమే||

1.²ఆర్యుఁడై భాసిల్లు మన ప్రభు - నార్త ధ్వనితో జీవమీయఁగ = సూర్యరశ్మి దొలంగి ³యిరలై ⁴క్షోణియును గంపంబు నొందుట ||హర్షమే||

2.మారణముఁ దానొందునయ్యెడ - మంగళముగా మృతులనేకుల్ దారుణిం జీవించి మఱలను = దామెరుసలేమందుఁ జొచ్చుట ||హర్షమే||

3.పొరిపొరిం గాసించు చొక త - స్కరుఁడు వధ్యాస్తంభమున న = నర్మువ కోస్వామియన న్బ్రభు - కరుణతో మోక్షం బొసంగుట ||హర్షమే||

4.ఏలి ⁵కనువిడ సాలమోన్భూ - పౌలు నా దేవాలయపు తెర = జీలిపోవను రెండుగా జన - జాల మాశ్చర్యమునఁ బొందుట ||హర్షమే||

5.సిలువపై యేసున్ శపించిన - ఖలులకై దేవునిఁ బితాయని = పిలిచి వీరింగావు మంచును - బ్రేమతో జీవంబు విడుచుట ||హర్షమే||

6.నెయ్యమున విభుఁ డేసునాధుం - ⁶డి య్యరులకై ప్రాణమీయఁగ = వ్రయ్యలాయె ధరాధరంబులు - నయ్యరాతులు భీతినొందుట ||హర్షమే||

7.కీటకముతో సాటి యగునా - ఘాటమగు పెనుబాటులెల్ల = మాటికిని దామీట నేనిఁక - మేటి జీవకిరీట మొందుట ||హర్షమే||
               – మిక్కిలి సమూయేలు
_____________________________
¹సంతోషమే.²పూజ్యుడై. ³చీకటియై. ⁴భూమి. ⁵ప్రాణము. ⁶శత్రువులకు.

26 December 2021

Hai lokama prabhuvachen | హాయి, లోకమా! ప్రభువచ్చెన్

131 Joy to the world, The Lord is come

1. హాయి, లోకమా! ప్రభువచ్చెన్ - అంగీకరించుమీ
పాపాత్ములెల్ల రేసునున్ - కీర్తించి పాడుఁడీ.

2. హాయి రక్షకుండు ఏలును - సాతాను రాజ్యమున్ 
నశింపఁజేసి మా యేసే - జయంబు నొందును.

3. పాప దుఃఖంబులెల్లను - నివృత్తిఁ జేయును 
రక్షణ్య సుఖక్షేమముల్ - సదా వ్యాపించును.

4. సునీతి సత్యకృపలన్ - రాజ్యంబు నేలును 
భూజనులార మ్రొక్కుడీ - స్తోత్రార్హుఁడాయెనే.
                                       - ఐజాక్ వాట్స్
                                 - జాకబ్ చాంబర్లిన్

06 December 2021

Samanyudavu Kaavu | సామాన్యుడవు కావు


హేపీ క్రిస్మస్ హేపీ క్రిస్మస్ హేపీ హేపీ హేపీ క్రిస్మస్ 
మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)

సామాన్యుడవు కావు సృష్టికర్తవు నీవు -  బలహీనుడవు కావు బలమైన దేవుడవు (2)
పాపిని రక్షింప యేసు పరమును వీడావు చీకటి - తొలగించి మాలో వెలుగును నింపావు (2)

1. ఆదాము హవ్వలు చేసిన పాపం శిక్షను తెచ్చిందీ (2)
క్రీస్తు చేసిన త్యాగం మనకు రక్షణ నిచ్చింది (2) ||హేపీ క్రిస్మస్||

2. జ్ఞానులు గొర్రెలకాపరులు ప్రభువుని చూశారు (2)
దీనులైన వారలకు ఆ భాగ్యం దొరికింది (2) ||హేపీ క్రిస్మస్||

3. యేసుని నీవు నమ్మినచో శాంతి సమాధానం (2) నిత్యమైన సంతోషం పరలోకమే నీ సొంతం (2) ||హేపీ క్రిస్మస్||

DOWNLOAD MP3 SONG HERE 👇

01 October 2021

Halleluya Sthuthi Mahima | హల్లెలూయ స్తుతి మహిమ

హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

1. అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము (2)
అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||

2. ఆకాశమునుండి మన్నాను పంపిన - దేవుని స్తుతించెదము (2)
బండనుండి మధుర జలమును పంపిన - ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||

DOWNLOAD MP3 SONG HERE 👇

04 July 2021

Ha Yananda Sudinamu Nayesun | హా యానంద సుదినము నాయేసున్

345
Oh happy day that fixed my choice


1.హా ! యానంద సుదినము - నాయేసున్ నమ్ము దినము 
ప్రయాస మెల్ల బోయిన - దయా రక్షణ దినము 

   llభాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము 
    భక్తి ప్రార్థన లేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన
    భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినముll

2.ప్రభునితో నిరంతమౌ - నిబంధన జేసికొంటి 
నే బట్టితి నింపొందగ - విభుని పాద పద్మము

3.నా యాత్మ, శాంత మొందుము - నీ యేసె నీ యాధారము 
భయంబు లేక రక్షణన్ - పాలిభాగంబు పొందుము

4.నే నేసువాడ నేసుడు - నిత్యంబు నా వాడాయెను
ఇదెంత గొప్ప భాగ్యము - నే నేసు యొక్క మిత్రుడన్

5. నే జేసెడి యొప్పందము - ఎల్లడ నెఱవేర్తును 
నే జచ్చు వేళయందును - నీ దయ మెచ్చి పాడుదు
 - ఫిలిప్ డాడ్రిడ్జి.
అను : బర్నార్డ్ లూకాస్

10 December 2020

Hey Prabhu Yesu | హే ప్రభుయేసు

307
యేసుక్రీస్తు సమాధానకర్త

హే ప్రభుయేసు - హే ప్రభుయేసు - హే ప్రభుదేవ సుతా సిల్వధర, పాపహరా, శాంతికర  ||హే ప్రభు||

1.శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంత నిధి = శాంతి స్వరూపా, జీవనదీపా - శాంతి సువార్తనిధీ ||సిల్వధరా||

2.తపములు తరచిన నిన్నె గదా - జపములు గొలిచిన నిన్నెగదా = విఫలులు జేసిన విజ్ఞాపనలకు - సఫలత నీవెగదా ||సిల్వధరా||

3.మతము లు వెదకిన నిన్నెగదా - వ్రతములు గోరిన నిన్నె గదా = పతితులు దేవుని సుతులని నేర్పిన - హితమతి నీవెగదా ||సిల్వధరా||

4.పలుకులలో నీ శాంతికధ - తొలకరి వానగ గురిసె గదా = మలమల మాడిన మానవ హృదయము - కలకలలా డెకదా ||సిల్వధరా||

5.కాననతుల్య సమాజములో - హీనత జెందెను మానవత = మానవ మైత్రిని సిల్వ పతాకము - దానము జే సెగదా ||సిల్వధరా||

6.దేవుని బాసిన లోకములో - చావుయె కాపురముండె గదా = దేవునితో సఖ్యంబును జగతికి - యీవి నిడితివి గదా ||సిల్వధరా||

7.పాపము చేసిన స్త్రీనిగని - పాపుల కోపము మండె గదా = దాపున జేరి పాపిని బ్రోచిన - కాపరి నీ వెగదా ||సిల్వధరా||

8.ఖాళీ సమాధిలో మరణమును - ఖైదిగ జేసిన నీవెగదా = ఖలమయుడగు సాతానుని గర్వము - ఖండనమా యెగదా ||సిల్వధరా||

9.కలువరిలో నీ శాంతి సుధా - సెలయేఱుగ బ్రవహించె గదా = కలుష యెడారిలో కలువలు పూయుట - సిలువ విజయముగదా ||సిల్వధరా||
   - ఏ . బి. మాసిలామణి
DOWNLOAD MP3 SONG HERE 👇

18 November 2020

Halleluya Naa Pranama | హల్లెలూయ నా ప్రాణమ యోహోవాను

హల్లెలూయ నా ప్రాణమ యోహోవాను - సుత్తించు

1.నా జీవిత కాలమంతయు -నే నెహోవానే స్తుతించెదను
నా బ్రతుకు కాలమంతయూ - నాదేవుని కీర్తింతున్ (2) ||హల్లెలూయ||

2.రాజులచేతనైనను - మరి నరుల చేతనైనను
రక్షణ భాగ్యము కల్గదు - వారిని నమ్ముకొనకండి (2) ||హల్లెలూయ||

3.వారి ప్రాణము నశియించును - వారుమంటిలో గలసెదరు
వారి సంకల్పములన్నియు నాడే - నాశనము నొందును (2) ||హల్లెలూయ||

4.యాకోబు దేవుండు - ఎవ్వనికి సాయంబగునో
యెవడెహోవా మీద ఆశ పెట్టునో వాడే ధన్యుండు (2) ||హల్లెలూయ||

5.ఆకాశభూమి సముద్రం - దానిలోని దంత సృజించెన్
ఆ తండ్రి యెన్నండైన తన మాటలు తప్పనివాడు (2) ||హల్లెలూయ||

6.బాధనొందు వారికి - అతడే న్యాయము తీర్చున్
ఆకలిగొని నట్టి వారికి ఆహారము దయ చేయున్ (2) ||హల్లెలూయ||

7.బాధింపబడిన వారి - బంధము లాయన తెంపున్
పుట్టంధుల కన్నులు యెహోవా తెరువ జేసెడివాడు (2) ||హల్లెలూయ||

8.కృంగినట్టి జనులను - నింగి కెత్తెడు వాడాయెనే
నీతిమంతుల నెల్లరిని - యెహోవా ప్రేమించెన్ (2) ||హల్లెలూయ||

9.పరదేశ వాసులను - కాపాడు వాడాయనే
నేదిక్కులేని వారిని - విధవల నాదరించును(2) ||హల్లెలూయ||

10.భక్తిహీనుల దారిని - వంకరగా జేయును
యెహోవాయే తరతరములు పరిపాలించుచుండును (2) ||హల్లెలూయ||

11.సీయోను నీ దేవుడు - తరతరములు రాజ్యమేలును
యోహోవాను స్తుతించుడి - హల్లెలూయ ఆమెన్ (2) ||హల్లెలూయ||
DOWNLOAD MP3 SONG HERE 👇

02 November 2020

Hrudayalanele Raraju Yesuva | హృదయాలనేలే రారాజు యేసువా

హృదయాలనేలే రారాజు యేసువా - 
అధరాలపై నీ పేరే కదలాడుచుండగా (2)
నీ కొరకే నేను జీవింతును - 
నా జీవితమంతా అర్పింతును  ||హృదయాల||

1.నా ప్రియులే శతృవులై - నీచముగా నిందించి 
నన్నెంతో తూలనాడి - నా చేయి వీడగా (2) 
నా దరికి చేరి నన్ను ప్రేమించినావా 
నన్నెంతో ఆదరించి కృప చూపినావా
నా హృదయనాథుడా నా యేసువా
నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా  ||హృదయాల||

2.నీ హృదయ లోగిలిలోన - నను చేర్చు నాప్రియుడా
నీ ప్రేమ కౌగిలిలోన - నను దాచు నా విభుడా (2)
పరలోక మార్గాన నడిపించు నా ప్రభు
అరణ్య యాత్రలోన నిన్నాను కొందును
అతిలోక సుందరుడా శ్రీ యేసువా
రాజాధిరాజా ఘన యేసువా  ||హృదయాల||
______________________________
Hrudayalanele raraju yesuva - Adharaalapai nee pere - kadalaaduthundaga (2)
Nee korake nenu jeevinthunu - naa Jeevithamantha arpinthunu ||Hrudayaala||

Na priyule shathruvulai - neechamuga nindinchi 
Nannentho thulanadi - naa cheyi veedaga (2)
Naa dariki cheri nannu preminchinava
Nannentho aadarinchi krupa Chupinava 
Naa hrudayanaduda naa yesuva 
Naa Pranapriyuda Kreesthesuva ||Hrudayaala||

Nee hrudaya logililona - nanu cherchu naa Priyuda - 
Nee prema kougililona - nanu dachu naa vibhudaa(2)
Paraloka margana nadipinchu naa prabhu -
Aaranya yathralona ninnaanukondunu 
Athiloka sundaruda shree yesuva - 
Rajadhiraja ghana yesuva ||Hrudayaala||

DOWNLOAD MP3 SONG HERE 👇

04 August 2020

Hrudayaranyamulo | హృదయారణ్యములో

హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
వినిపించుచున్నది కేక నాకు - ఒక కేక నాకు  (2)

1. నాకు బలము ఉన్నంత వరకు -
    నమ్మలేదు నా యేసుని (2)
    బలమంతా పోయాక ఆఆఆ .. (2)
    నమ్మాలని ఉంది ప్రభు యేసుని     ||వినిపి|| 

2. నాకు స్వరము ఉన్నంత వరకు 
    పాడలేదు ప్రభు గీతముల్ (2)
    స్వరమంతా పోయాక ఆఆఆ ...(2)
    పాడాలని ఉంది ప్రభు గీతముల్     ॥వినిపి||

3. నాకు ధనము ఉన్నంత వరకు -
    ఇవ్వలేదు ప్రభు సేవకు (2)
    ధనమంతా పోయాక ఆఆఆ ..(2)
    ఇవ్వాలని ఉంది . ప్రభు సేవకు.    ||వినిపి||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...