Showing posts with label Puvvu virisi ralina parimalambu. Show all posts
Showing posts with label Puvvu virisi ralina parimalambu. Show all posts

06 October 2022

Puvvu virisi ralina parimalambu | పువ్వు విరిసి రాలినా పరిమళంబు


పువ్వు విరిసి రాలినా -
పరిమళంబు మిగులును (2)
జీవ నీవే తెలుసుకో
నీ జీవితం ఏపాటిదో ||పువ్వు||  

ధరలో కలిమి లేములు -
దరి చేరగానే కరగిపోవును (2)
దూరపర్చుమా లౌకికం
చేరు యేసును శీఘ్రమే ||పువ్వు||  

పుడమిలో ఫలియించుమా -
ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా (2)
నేల రాలిన పువ్వులా
తేలిపోకుమా గాలిలోన ||పువ్వు||  

భువిలో బ్రతుకుట కన్నను -
భగవంత సన్నిధి పెన్నిధి (2)
భారమనక పిలువవే
కోరుకో నువ్వు క్రైస్తవా ||పువ్వు|| 
– ఆచార్య ఆర్. ఆర్. కె. మూర్తి గారు 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...