Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

04 June 2026

నిజముగా పరిశుద్ధు డొక Nijamugaa parishudhudokadi nelapai

292
పాపము సార్వత్రికము 
రా - కేదరాగౌళ, తా - త్రిపుట 

నిజముగాఁ పరిశుద్ధు డొకఁ డీ - నేలపై లేఁడు = ¹వృజినములచేఁ జెడిన మదిని బ -విత్రమూలం బెటుల ²బొడమును ||నిజము||

1.³దురిత లతలకు ⁴మూలకందము - దుస్స్వభావము దానిఁ గూడిన - నరులలోఁ బరిశుద్ధ విధు లె -న్నటికిఁ గనరావు = ⁵నెరవుగా సద్ధర్మములనే ⁶తెఱఁగుననుఁ ⁷గావింప నేర్తురు - ధరణి లోపల ముసిఁడి చెట్టున - చెఱకు రస ముండునె తలంపగ ||నిజము||

2.మనసు క్రియ లన్నిటికి మూలం - బనుచు శాస్త్రము పల్కు మఱి యా - మనసు శుచిగాకున్న నగునే - తనకు క్రియాశుద్ధి = ⁸అనిశ మా హృదయము దురిచ్ఛల - ⁹నలరి ¹⁰మిధ్యాసక్తి నుండఁగ - ఘనతగల సత్యార్య ముల నిల - మనుజుఁడె ¹¹ట్లొ నరింపఁజాలును ||నిజము||

3.నిరతమును పాపాగ్నిచేతను - గరగుచున్న మనంబులోపల - పరమ ధర్మము భక్తి ఎటువలెఁ - బాదుకొని యుండున్ = నిరపరాధి యొకండు లేఁ డని - నిక్కముగఁ గనపచ్చుచున్నది - పరమ దేవుఁడు క్రీస్తు కృతమునఁ - పాపులను రక్షింపవలయును ||నిజము||

- పురుషోత్తము చౌదరి
________________________________________
¹పాపము చేత, ²పులుసు, ³పాపమును తీగలకు, ⁴వేరు, గడ్డ ⁵చక్కగా, ⁶విధముగా, ⁷చేయలేరు, ⁸ఎల్లప్పుడు, ⁹సంతోషించి, ¹⁰మాయ, ¹¹చేయగలుగును 

నమ్మరె నరులార యేసుని సమ్మతిగా Nammare narulaara yesuni sammatiga

296
నమ్మినవారికి రక్షణ
(చాయ: పాపమా దలచు సుమీ)
రా - ముఖారి, తా - ఆది

నమ్మరె నరులార - యేసుని - సమ్మతిగాఁ జేరి = నమ్మిన వారల నిమ్ముగ బ్రోచును - సొమ్ముగ తను జేర్చి ||నమ్మరె||

1.యేసు క్రీస్తుకంటెఁ - పోషకు - లెవ్వరు లేరుసుమీ = దోషుల తన దాసులుగాఁ దీసియు - దోసముఁ బాపు సుమీ ||నమ్మరె||

2.నరకము నొందక మీ - రయ్యో - నరకము బాధ సుమీ = న్యాయము కాదుసుమి నరులార - నష్టము మీకు సుమీ ||నమ్మరె||

3.తండ్రి కొమరుఁడు విమ - లాత్ముఁడు - త్ర్యేకదేవుండు =  తండ్రి వలెను మనలను పాలించును - తండ్రిగ నమ్ముదము ||నమ్మరె||

4.ధరణిలో నొకఁడైన - చూడరె - ధన్యుడు లేఁడనుచు = దీర్ఘదర్శి దావీదు తెల్పె నిటు - దీనుల కందఱికి ||నమ్మరె||

6.ప్రభు మన పాపముకై - ప్రాణము - బలిగా - నిచ్చునుగా = పాపము మోసెను మృతియై లేచెను - పాపులఁ బ్రోచుటకై ||నమ్మరె||

7.దేవసుతుని రక్తం - అబ్బిన - ద్రోహుల కతిప్రొయము = పావన మొనరించును పాపికి నిఁక - జీవనమై యుండున్ ||నమ్మరె||

- గెల్లా రామయ్య

17 May 2026

నడ్పుమీ, మహా యెహోవా Nadpumi maha yehova

429
Guide me, O Thou Great Jehovah

1.నడ్పుమీ, మహా యెహోవా 
లోక యాత్ర యందున 
నీదు శక్తి నాకు దిక్కు 
నన్ రక్షింపఁ జేఁపట్టు 
దివ్య మన్నా, దివ్య మన్నా 
నా కాహారమై యుండు.

2.ఊటగా స్వచ్ఛజలంబు 
బండనుండి పారనీ 
అగ్ని మేఘ స్తంభాలచే 
నడవిన్ నన్ దాఁటించుఁ 
గొప్ప ప్రాపూ, గొప్ప ప్రాపూ 
నాకు డాలవు సదా.

3.యొర్దాన్ నది దాఁటు వేళ 
భీతు లెల్లఁ బాపుము 
మృత్యు శ్రమ లన్ని నన్ను 
క్షేమ కానాన్ జేర్చును 
స్తుతి గీతి, స్తుతి గీతి 
నీ కర్పింతు నిత్యము
- విలియం విలియమ్స్ 
అను: హెచ్ హెన్రీ డేవిస్ 

19 April 2026

నన్నెంతగానో నీవు కోరావుగా Nannenthagano neevu koraavuga

నన్నెంతగానో నీవు కోరావుగా 
బ్రతుకంత నాకు తోడై ఉన్నావుగా 
రచించావు నన్ను నీవు 
క్షమించావు నన్ను నీవు 
నీ ప్రేమ చాలు నాకు నా యేసయ్య

1. ఏముంది ఈ జగాన - ఎదురీత సాగరాన 
నా జీవ నావ నీవే నా యేసయ్య 
తీరాలే దూరమైన - కనుమేర చీకటైన 
ఏ భయము లేదు నాకు నీవుండగా 
అలజడులే రేగినా - అధికారం నీదనీ 
అనుదినము నీ కృపా - స్తుతియించి పాడనీ 
ప్రియమైన యేసయ్య - నడిపించు నన్నిలా

2. ఊహించలేను దేవ నీవు లేని జీవితాన్ని 
ఓ నిమిషమైన నేను మనలేనుగా 
నాలోని ఆశ నీవే - ఎదలోని ధ్యాస నీవే 
నీ పాదసేవకేగ ఈ జీవితం 
ఆణువణువు నీవనీ- ఇహమందు పాడనీ 
కడవరకు సాక్షిగా - కలకాలం సాగనీ 
ప్రియమైన యేసయ్య - కరుణించు నన్నిలా

15 April 2026

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు Nenu naa illu naa intivarandaru


నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము (2)
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2)
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||

ఎడారిలో ఉన్న నా జీవితమును
మేలుతో నింపితివే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే||

నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
నీ కృపతో నింపితివే (2)
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||

జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యమాశ్చర్యమే (2)
నీ పాత్రను కానే కాను
కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||

22 March 2026

Neekanna lokana naa నీకన్నా లోకాన నా కెవరున్నారయ్యా

 
నీకన్నా లోకాన నా కెవరున్నారయ్యా
నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా

1. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా
ప్రాణం బెట్టిన దేవుడవు నీవే యేసయ్యా

2. నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా
జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా

3. నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా
రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా

4. నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా
అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా

24 May 2025

Namo yesu naadha నమో యేసునాధా నాధా


నమో యేసునాధా నాధా నమో జీవనాధా సమాన విరహిత

సనాతనాత్మా సమున్నతోజ్వల ప్రశాంత ధామా ||నమో||

1. స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగ భూ
వలయాకాశంబుల మించుచు భువన పాలనముజేసెటి ప్రభువా ||నమో||

2. ధరణీ మానవ విమోచనార్థము కరుణను జీవము లొసగిన ప్రభువా
పరమ కృపాభరితా మృతసారా వరసజ్జన హృదయాబ్జ విహారా ||నమో||

3. సుందర మలయజ గంధ ధూపముల చందముననుమా వినుతులు గొను
మా వందే దేవ దయాసందీప వందే శుభదానంద స్వరూపా ||నమో||

01 December 2024

Ninnu chudaga vachhinadura నిన్ను చూడగ వచ్చినాడురా

నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు -
గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు (2)
లోకమే సంతోషించగా - ప్రేమనే పంచే క్రీస్తుగా
బెత్లెహేమను ఊరిలో.. కన్యకు పుట్టినాడురా
పొత్తి గుడ్డల మధ్యలో.. హాయిగా నిద్దరోయెరా ||నిన్ను||

దేవుని కోపము నుండి
తప్పించే ప్రియ పుత్రుడాయనే (2)
ముట్టుకో ముద్దు పెట్టుకో (2) ||బెత్లెహేమను||

గుండెలో కొలువైయుండి
దీవించే ధనవంతుడాయనే (2)
ఎత్తుకో బాగా హత్తుకో (2) ||బెత్లెహేమను||

తోడుగ వెంటే ఉండి
రక్షించే బలవంతుడాయనే (2)
చేరుకో నేడే కోరుకో (2) ||బెత్లెహేమను||

04 November 2024

Nee Prema Yentho Goppadi నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా

రచన , స్వరకల్పన , గానం : Bro . RAJU KONDETI 

నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా 
నీ ప్రేమ ఎంతో మధురము ప్రభువా 
నీ ప్రేమ జంటేలేనే ధారలు కన్నా 
తీయనిది ప్రభువా ప్రభువా . 

దేవాధి దేవుడవు - రాజధి రాజువు 
దేవాధి దేవుడవు - రాజధి రాజువు 

శాశ్వత కాలము నీ శ్వాస తోనే జీవించెదను 
నీ కృప బాహుళ్యము దయచేయుము నాపై 
దేవాధి దేవుడవు - రాజధి రాజువు 
దేవాధి దేవుడవు - రాజధి రాజువు 

ఆ కనికర సంపన్నుడా కరుణించుము మమ్ము 
నీ కృపలో మము నడిపించుము 
దేవాధి దేవుడవు - రాజధి రాజువు 
దేవాధి దేవుడవు - రాజధి రాజువు

28 April 2024

Ninnu nammi vacchi ne siggu chendhaledhu నిన్ను నమ్మి వచ్చి, నే సిగ్గుచెందలేదు


నిన్ను నమ్మి ఏమి - నే సిగ్గుచెందలేదు
నిన్ను నమ్మి వచ్చి - ఏమి సిగ్గుచెందలేదు

నిన్ను నమ్మి ఏమి - నే సిగ్గుచెందలేదు
నీ దయ నన్ను చేయి విడువ లేదు
వట్టి చేతితో వచ్చితిని - రెండు పరివారాలనిచ్చితివే (2)

ఏల్‌-ఎలోహేయి ఏల్‌-ఎలోహేయి ఏల్‌-ఎలోహేయి
నిన్నే స్తుతింతున్..

గాయపడ్డాను - కన్నీళ్లు కార్చాను
కలతచెందిన నన్ను కరుణించావు
నిబంధనను నాతో చేసితివే
కోల్పోయినవన్నీ ఇచ్చితివే (2) ||ఏల్‌||

ప్రియులందరు విడిచి పోయినా
ప్రియమైనవన్నీ నాకిచ్చితివే (2)
పరదేశిగా నేనున్న చోటే
స్వాస్థ్యముగా నాకు మార్చితివే ||ఏల్‌||

09 April 2024

Nenante neekenduko ee prema నేనంటే నీకెందుకో ఈ ప్రేమా

నేనంటే నీకెందుకో ఈ ప్రేమా. - నన్ను మరచి పొవెందుకు (2)
నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా - నన్ను విడిచిపోవెందుకు 
కష్టాలలో నష్టాలలో - వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలో కడగండ్లలో - వేదనలో శోధనలో
నా ప్రాణమైనావు నీవు - ప్రాణమా.. నా ప్రాణమా (2) ||నేనంటే||

1.నిన్ను మరచిపోయినా - నన్ను మరచిపోలేవు -
నిన్ను వీడిపోయినా - నన్ను వీడిపోలేవు (2)
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)
ఏ ఋణమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే||

2.ప్రార్ధించకపోయినా - పలకరిస్తు ఉంటావు -
మాట వినకపోయినా - కలవరిస్తు ఉంటావు (2)
ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4)
ఏ బలమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే|| 
DOWNLOAD THIS SONG  HERE 👇

22 October 2023

Ne maripoyina neevu maranannavu నే మారిపోయినా నీవు మారనన్నావు


నేమారిపోయినా నీవు మారనన్నావు 
నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు (2)
ఇదియేమి బంధమో నీ ప్రేమ అనుభందం (2) వర్ణించలేను నీ ప్రేమను - వివరించలేను నీ ప్రేమను ||నేమారి||

1.నేనెంత వద్దన్నా నావెంట పడ్డావు -
వెంటాడి వెంటాడి నీవైపు తిప్పావు (2)
నేను మాట్లాడకున్నా నాతోనే మాటాడి (2)
నా మదిని గెలిచావు నా దైవమైనావు (2) ||నేమారి||

2.నాలో యేమిలేకున్నా యేరికోరుకున్నావు 
నేనేమి కాకున్నా నా ప్రాణమన్నావు (2)
నేను నిన్ను యెరుగకున్నా నీవు నన్ను యెరిగావు (2)
నా హ్రుదిలొ నిలిచావు - నా తండ్రివైనావు (2)

3.నేనేమి అడగకున్నా నాకన్ని యిచ్చావు - ఆశ్చర్యకార్యములెన్నో నాపట్ల చేశావు (2) ఊహంచలేనంత ఉన్నతముగ ఉంచావు (2)
నన్ను నీకొరకే - అర్పించుకొందును (2)

19 September 2023

Na jeevam naa sarvam నా జీవం నా సర్వం

నా జీవం నా సర్వం నీవే దేవా (2)
నా కొరకే బలియైన గొర్రెపిల్లా - నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా - నా జీవం నా సర్వం నీవే దేవా (2)

తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై 
నాకై ప్రాణమిచ్చితివి (2)

ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హ్రుదయమె నే నర్పింతును (2)
నా జీవం నా సర్వం నీవే దేవా (2 )

నా కొరకే బలియైన గొర్రెపిల్లా నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా  (2)
నా జీవం నా సర్వం నీవే దేవా (2)

10 September 2023

Nee dayalo nenunna నీ దయలో నేనున్నా ఇంత కాలం

నీ దయలో నేనున్నా ఇంత కాలం
నీ కృపలో దాచినావు గతకాలం (2)
నీ  దయలేనిదే నేనెమౌదునో తెలియదయ్యా ||నీ దయలో||

1.తలిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో
చేయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)
నీ దయ వుంటే వారు కాగలరు అధిపతులుగా
నీ దయలేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడలోనే నను దాచి వుంచావని
నా శేష జీవితాన్నే నీతోనే గడపాలని ||నీ దయలో||   

2. నేలరాలిన నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు
అపవాది కోరలను అంటకుండ దాచావు (2)
నీ రెక్కల నీడలే నాలాశ్రయ దుర్గము
ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచుమా
నీ పాదాల చెంతనే నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని ||నీ దయలో||

27 August 2023

Nee nama smarana pujaneeyamu నీ నామస్మరణ పూజనీయము


నీ నామస్మరణ పూజనీయము యేసయ్య 
నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదన్ (2)

మరువను మరువను మరువనయ నీ నామమును..... విడువను విడువను విడువనయా నీ స్నేహమును..(2)
||నీ నామస్మరణ||

1.ఎంతటి ఘనులైనా వణుకుతూ పలికిన నామం 
విశ్వాస వీరులంతా ప్రార్ధించి గెలిచిన నామం 
చర్మపు పొరలు ఒలిచినా శిరస్సును ఖండించినా (2)
మరువను యేసునామము విడువను ఆయన స్నేహం (2)

మరువను మరువను మరువనయ నీ నామమును..... విడువను విడువను విడువనయా నీ స్నేహమును..(2)
||నీ నామస్మరణ||

2.పాపపు నా బ్రతుకును శుద్ధిగా చేసిన నామం.. పలుమార్లు పడిపోయిన క్షమియించి నిలిపిన నామం (2)
సాతాను శోధించినా సిలువపై నన్నుంచినా (2)
మరువను యేసు నామము - విడువను అయన స్నేహం..

మరువను మరువను మరువనయ నీ నామమును..... విడువను విడువను విడువనయా నీ స్నేహమును..
మరువనయా... ఆ..ఆ విడువనయా.... ఆ.. ఆ
||నీ నామస్మరణ||

25 August 2023

Nadipinchu chunnadu najaraeyudu నడిపించు చున్నాడు నజరేయుడు


నడిపించు చున్నాడు - నజరేయుడు
నడక నేర్పుచున్నాడు - నను విడువని దేవుడు
గాఢాంధకారములైనా - కన్నీటి లోయలైనా
కష్టాల తీరములైన - కఠినమైన మార్గములైనా ||నడి||

1.నా కాళ్ళు తడబడగా - నడువ లేక నిలబడగా (2)
అడుగులో అడుగేసి - చేతిలో చెయ్యేసి (2)
ఊసుచెప్పినాడు - బాసచేసినాడు (2)
ఆదరించే దేవుడు నా యేసయ్యా 
ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ||నడి||

2.ముదిమిలో బలముడిగి - నిలువలేక తూలిపోగా (2)
చంకలో ఎత్తుకొని - ముద్దులతో ముంచెత్తి (2)
ప్రేమ చూపినాడు - ప్రాణమిచ్చినాడు (2)
ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా 
ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా ||నడి||

DOWNLOAD MP3 SONG HERE 👇

11 August 2023

Ebinejare ebinejare ఎబినేజరే Nenu na illu na inti నేను నా ఇల్లు నా ఇంటి


నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించేదము (2)
నీ కనుపాపలే నన్ను కాచి - నేను చెదరక మోసావు స్తోత్రం (2)

ఎబినేజరే - ఎబినేజరే - ఇంత కాలము కాచితివే
ఎబినేజరే - ఎబినేజరే - నా తోడువై నడిచితివే
స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కౌగిలిలో దాచితివి స్తోత్రం

1.ఎడారిలో ఉన్న నా జీవితమును - మేళ్లతో నింపితివి (2)
ఒక కీడైన దరి చేరక నన్ను - తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబెనేజరే||

2.ఆశలే లేని నా బ్రతుకును - నీ కృపతో నింపితివి (2)
నీవు చూపిన ప్రేమను పాడగా - పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబెనేజరే||

06 August 2023

Na hrudayavasi o yesayya నా హృదయవాసి ఓ యేసయ్యా


నా హృదయవాసి ఓ యేసయ్యా 
నను నడిపించు నా దైవమా (2) 
ప్రణమిల్లెదను నీపాదసన్నిధిలో 
పాడి స్తుతించెద నీనామము (2) ||నా హృదయ||

1.సొంతవారే స్వార్థపరులై క్రుంగదీసెనే
అన్యాయపు తీర్పుకే గురిచేయగా (2)
యేసయ్యా నా అంతరంగ మూగ భావమే (2)
విలపించెను నీ పాదాల చెంత
నిత్య కృపతో నను నిలబెట్టిన దైవమా (2) ||నా హృదయ||

2.దారిచెడి గమ్యమునకు మరుగాయేనే
విశ్వాస యాత్రలో నా పరుగు నిలిచెను (2) 
యేసయ్యా నా ఆర్తధ్వని నీకు చేరగా (2) 
ప్రతిధ్వనించెను నీ ప్రేమ స్వరము
స్థిర రాజ్యముకు నన్ను చేర్చె ఓ మార్గమ (2) ||నా హృదయ||

3.మమ్మును గొనిపోవ త్వరలో రానుంటివే
చిరకాలము నీ సన్నిధిలో నిలుపుటకై (2) 
యేసయ్యా నీ ఆగమనము నే తలంచగా (2) పరవసించెను నా అంతరంగము 
నీ కౌగిలిలో చేరే ఆ దివ్య క్షణముకై (2) ||నా హృదయ||

12 May 2023

Na devudu prathi avasaramunu నా దేవుడు ప్రతి అవసరమును

నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వరములో

తల్లి వలె ప్రేమించును తండ్రి వలె పోషించును
కాపరి వలె నడిపించును వైద్యునిలా స్వస్థపరచును

కలవరిపడి నే కొండలవైపు కన్నులెత్తుదునా
నా సహాయము నీవేగ నా యేసు నా రాజా ||తల్లి||

జీవించుచున్నది నేను కాదు జీవించు క్రీస్తేసే
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే ||తల్లి||

10 May 2023

Nee sannidhilo aanandame | నీ సన్నిధిలో ఆనందమే

నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే
స్తుతులందుకో స్తోత్రార్హుడా - పదివేలలో అతి సుందరుడా
కరుణించుమా కరుణామయా – మహిమ ఘనత నీకే దేవా

1.మా హృదయాలను నీ ఆలయముగా
నీ ఆలయమే మా దాగు చోటుగా
నీ చిత్తము మాలో నెరవేరగా
పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా
కృప చూపుము దేవా - దీవించు ప్రభువా
నీ ఆత్మ శక్తితో నింపుము దేవా
కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా

2.నీ మహిమార్థమే మా క్రియలన్నియు
నీ కనికరములే మేలులన్నియు
విశ్వాసముతో ప్రార్ధింప నేర్పుమా
నీ వాక్య వెలుగులో దర్శించుమా
దరి చేర్చు ప్రభువా - పరలోక దేవా
కడ వరకు మమ్ము నడిపించుమా
కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...