Showing posts with label Pranam Kamalakar songs. Show all posts
Showing posts with label Pranam Kamalakar songs. Show all posts

21 February 2024

Ea reetiga kolicheda ఏ రీతిగా కొలిచెద ప్రభు

ఏ రీతిగా కొలిచెద - ప్రభు నీ సేవలో నిలిచెద 

ఏ రీతిగా కొలిచెద - ప్రభు నీ సేవలో నిలిచెద ఇదే ఆశ మదిలో అనుదినం ఇదే నా ప్రపంచం అనుక్షణం సదా యేసు నీలో బ్రతికెద
ఏ రీతిగా కొలిచెద - ప్రభు నీ ప్రేమలో నిలిచెద

1. నీ మమతే - అమూల్యమైనదీ
ఊహలకే - అతీతమైనదీ
నా గతం - ఓడించగా
నీ దరే - చేరానుగా
పాపములో నన్ను - విడనాడక
విమోచించినా - నిజ దైవమా
ప్రార్ధనలే నాలో - ఫలియించగా
ప్రతీ శ్వాసలో - ప్రభవించవా
నీ ప్రేమ ఇలలో - పాడెద - నిరతం దేవా

2. నీ వరమే - విశేషమైనదీ
వాక్యముగా - వసించుచున్నదీ
నీ స్వరం - నా దీపమై
నీ బలం - ఆధారమై
ఆశ్రయమైనావు - కలకాలము
కృపాసాగరా - స్తుతి పాత్రుడా
శాశ్వత నీ ప్రేమ - వివరించుట
ఎలా సాధ్యమూ - ప్రియ యేసయా

12 March 2023

Samarpinchedanu samasthamu | సమర్పించెదను సమస్తము

సమర్పించెదను సమస్తము
సన్నుతించెదను సతతము
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును,
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
  
1.శ్రేష్టమైనవి కలిగించెను నష్టము లోకజ్ఞానము ఆయెను వెర్రితనము ధనము దరిచేర్చెను నాశనము పరపతి చూపించెను దుష్టత్వము 
 
2.నిలుపుకొనెదను నీ మాదిరి వినయము
చెల్లించెదను ఉచ్వాస నిశ్వాసములు
అర్పించెదను నా ప్రాణము
ఇదియే ఆరాధనా బలిపీఠము

Edho aasha naalo lyrics | ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ

ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ (2)
యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ 
మితిలేని ప్రేమ చూపించినావు 
శృతి చేసి నన్ను పలికించినావు 
ఈ స్తోత్రగానం నీ సొంతమే
 
1.పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము
పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము (2)
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక
కరుణామయా నా యేసయ్య
 
2.నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా
నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన (2)
ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును 
నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్య

06 December 2022

Ooruko naa pranama | ఊరుకో నా ప్రాణమా కలత


ఊరుకో నా ప్రాణమా కలత చెందకు 
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా (2)

ఎడారి దారిలోన - కన్నీటి లోయలోన (2)
నా పక్షమందు నిలచి నా ముందరే నడచి 
నీ శక్తినే చాట నన్నుంచేనే ఈ చోట 
నిన్నేరుగుటే మా ధనం
ఆరాధనే మా ఆయుధం

1.ఎర్ర సముద్రలు నా ముందు పొర్లుచున్న 
ఫరో సైన్యమంత నా వెనుక తరుముచున్న
నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా 
నడి మధ్యలో నన్ను విడిచిపెట్టున (2) ||ఊరుకో||

2.ఇంత వరకు నడిపించిన దక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభమేగా (2)
వాగ్దానము ఇచ్చిన సర్వశక్తిమంతుడు 
దుష్కార్యము చేయుట అసంభమేగా (2) ||ఊరుకో||

3.అవరోధలెన్నో నా చుట్టు అలుముకున్న 
అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా
యెహోవా సెలవిచ్చిన ఒక్క మాటయైనను 
చరిత్రలో ఎన్నటికి తప్పియుండలేదుగా ||ఊరుకో||

08 November 2022

Yelo yelo yelo antu | ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ


ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు  
సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా 
దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే 
సంగీతాలే పాడాలండీ - హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు 
పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు 
నిన్నే కోరి నిన్నే చేరి 
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు 

1.లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా -
ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2)
దూతాళి పాడి - కొలిచారు చూడు 
ఘనమైన ఒక వేడుక   
ఆ గొల్లలేగా - దరువేసే చూడు 
మెస్సయ్య - పుట్టాడనీ          
మన మెస్సయ్య - పుట్టాడనీ    

2.వెన్నెల్లో పూసింది ఓ సందడీ - పలికింది ఊరంతా ఈ సంగతీ -
ఈ దీనుడంట - పసిబాలుడంట - వెలిసాడు మహరాజుగా (2)
మనసున్న వాడు - దయ చూపువాడు 
అలనాటి అనుబంధమే
కనులారా చూడు - మనసారా వేడు 
దిగి వచ్చే మనకోసమే
ఇల దిగి వచ్చే మనకోసమే 

3.ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా - 
వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా (2)
సలిగాలి రాత్రి - పిలిసింది సూడు 
మనలోన ఒక పండగ
భయమేల నీకు - దిగులేల నీకు 
యేసయ్య మనకుండగా 
మన యేసయ్య మనకుండగా

24 July 2022

Naa cheruvai naa snehamai | నా చేరువై నా స్నేహమై


నా చేరువై నా స్నేహమై 
నను ప్రేమించే నా యేసయ్య 

నీ ప్రేమలోనే నేనుండిపోనీ 
నీ సేవలోనే నను సాగనీ 
నీ ధ్యాసలోనే మైమరచిపోనీ 
నీ వాక్కు నాలో నెరవేరనీ 

నా వరం నా బలం నీవే నా గానం 
నా ధనం నా మనం నీవే ఆనందం 
తోడుగా నీడగా నీవే నా దైవం 
ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం

1.నా వేదనందు - నా గాయమందు 
నిను చేరుకున్నా - నా యేసయ్య . 
నీ చరణమందు - నీ ధ్యానమందు 
నిను కోరుకున్నా - నీ ప్రేమకై 

కరుణించినావు నను పిలచినావు 
గమనించినావు ఘనపరచినావు 
నీవేగా దేవా నా ఊపిరి.

2.నా జీవితాన - ఏ భారమైన 
నీ జాలి హృదయం - లాలించెనే 
ప్రతికూలమైన - ఏ ప్రళయమైన 
ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య 
విలువైన ప్రేమ కనపరచినావు 
బలపరచి నన్ను గెలిపించినావు 
నీవేగా దేవా నా ఊపిరి

పాపాప పద పాప పద పాపాప 
పమపమగరిసరిగమ పాపామపదపా
పమపదనీనీనినిసని మపదనిసాసానిసారిసా
సరిగమపమగరిసానిదపమా 
గమని గమనీనీ గమని గమనీని సగప సగపాప సగప సగపాప 
సరిగ సరి గమపమ సరిగ సరి గమపమ 
రిగమరి గమపదని రిగమరి గమపదని 
తధీమ్ త తకిట తఝం త తఝణు 
తక తకిట తకధిమిత తక ఝణుత 
సరిగమ పమగరి గమపద నిదపమ
పదనిసరిగమపమగరిసనిదపమ 
మాపదనిస గామపదని రీగామపద 
సారిగమదప మగరి 
సగరి గమ గమప గమపదని 
గరిసనిదపదనిసాసా గరిసనిదపదనిసాసా
మపదనిసా మపదనిసా మపదనిసా

24 September 2021

Yesayya nee prema naa | యేసయ్య నీ ప్రేమ నా సొంతము



యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము 
యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము 
ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము 
ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం 

1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు 
నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు 
నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు 
నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం 
నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి 
నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ 

2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు 
లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే 
నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా 
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం 
సాటే లేరు నీకు - సర్వాధికారివి నీవు 
మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు

15 July 2021

Okapari thalachina yesuni prema | ఒకపరి తలచిన యేసుని ప్రేమ


ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా 
వినయము కలిగి వెదకిన వారికి విదితమే సదా (2) కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమా 
మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాణ 
ఇదే కదా నీ ప్రేమ చరితం ||ఒకపరి||

1. నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవు 
నీ చరితంబుల ఉపకారముల భువిలో భాగ్యము నాకు 
విరిగిన మనసే నీ ప్రియమై మరువని మమతే నీ కరుణయ్ 
నిన్నే సేవింతును ||ఒకపరి||

2. శూన్యములోన చీకటి బాపి వెలుగై నిలచిన దేవా
దాపునజేరి దయనే చూపి నాలో వశమైనావా
 తరగని సుఖమే నీ వరమై కలిగిన బ్రతుకు నీ వశమై
 నన్నే నడిపించేనా ||ఒకపరి||

05 July 2021

Naa Thodu Neeve Devaa Naa Bhalamu | నా తోడు నీవే దేవా నా బలము నీవే

నా తోడు నీవే దేవా... నా బలము నీవే ప్రభువా 


నా తోడు - నీవే దేవా... నా బలము - నీవే ప్రభువా 
నా ధైర్యం - నీవే దేవా... నా సర్వం - నీవే ప్రభువా
 కాపాడే దైవం నీవేగా - కనుపాపగ నన్ను కాచేగా 
నీ దయలో , నీ కృపలో , నీ ఒడిలో, నన్నిలలో ..

1. నాలో కన్నీరే నీవైపే చూడగా - నీవే యేసయ్య సంతోషం నింపగా 
నిట్టూర్పు లోయలలో - గాఢాంధకారములో 
నీవే నా అండగా నన్ను బలపరచగా 
నడిపించే వాక్యం నీవైతివే - కరుణించే దైవం నీవైతివే నీ దయలో.... నీ కృపలో....

2. ఎన్నో కలతలే నామదిలో నిండగా - నీవే యేసయ్య నావెంటే ఉండగా 
నా భయమును తొలగించి - విశ్వాసము కలిగించి
 నీవే నా అండగా - నన్ను స్థిరపరచగా 
నీవుంటే చాలు నా యేసయ్య - నీ ప్రేమే నాకు చూపావయ్యా 
నీ దయలో..., నీ కృపలో....

27 June 2021

Pilichenu Prabhu Yesu Nadhudu | పిలిచెను ప్రభు యేసు నాథుడు

పిలిచెను ప్రభు యేసు నాథుడు
ప్రేమతో నిను తెలుసుకో
అలక దృష్టితో పలుచ సేయక
దీనమనస్సుతో చేరుకో..

1. కంటికి కనబడునదెల్ల
మంటికి మరి మరలిపోవు
నేలనొలికిన నీటి వలెనే
మరల రాదని తెలుసుకో

2. నరుడుయగు ప్రతివాడు పాపియె
మరణమే పాపపు ఫలితము
నరులకు నిత్య జీవమొసగెడు
యేసు ప్రభువును చేరుకో

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...