Showing posts with label కనలేని కనులేలనయ్యా. Show all posts
Showing posts with label కనలేని కనులేలనయ్యా. Show all posts

06 October 2022

Kanaleni kanulelanayya | కనలేని కనులేలనయ్యా


కనలేని కనులేలనయ్యా 
వినలేని చెవులేలనయ్యా
నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా

1.ఆకలిగొన్న యేసయ్యా -
నాకై ఆహారముగా మారావు గదయ్యా (2)
అట్టి జీవాహారమైన నిన్ను -
చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని||

2.దాహము గొన్న ఓ యేసయ్యా -
జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2)
అట్టి జీవాధిపతివైన నిన్ను -
చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||

౩.మరణించావు యేసయ్యా -
మరణించి నన్ను లేపావు గదయ్యా (2)
అట్టి మరణాధిపతివైన నిన్ను -
చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||

4.రాజ్యమును విడిచిన యేసయ్యా -
నిత్య రాజ్యము నాకిచ్చావు గదయ్యా (2)
అట్టి రాజులకు రాజైన నిన్ను -
చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||

5.అభ్యంతర పరచేటి కన్ను -
కలిగి అగ్నిలో మండేటికన్న (2)
ఆ కళ్లే లేకుంటెనే మేలు -
నాకు నిను చూసే కనులి వేసయ్యా ||కనలేని||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...