Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

01 June 2026

ఆచరించుచునున్నాము ఆ చందము Aacharinchuchunnamu aa chandamu

274
పెద్దల బాప్తిస్మము
రా - నవరోజు, తా - అట 

ఆచరించుచునున్నాము - ఆ చందము మేము = యే చందమేసు ప్రభు సెల - విచ్చివేంచేసితో పరమండలికి ||ఆచరించు||

1.నీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ - నీ సెలవున న్నిఖిల భూస్థులుల్ - వాసికెక్కగా గాఁజేయుటకు వ్యాపించిరి కోరి = యోసియ్యోను రాజశాశ్వత - శ్రీసనాధ శ్రితరక్షభాజ - నీ సుదయచే నీ యుద్యోగము - నిత్యంబును బొంది ||యాచరించు||

2.భాసురత్వత్సమా చార - వాక్యము విని సదావి -  శ్వాసిభాగ్యాభి ముఖ స్వాభావుల నీవేళన్ = భాసమాన పతితపా - వనతాంకిత పాత్ర దరికు - ల్లాసము నెమ్మోములందు - రాజిల్లగం దెచ్చి ||యాచరించు||

3.పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష - పారావతమా - వీరి - నిత్తరి - నరుదౌ నీదైవత్వచి - హ్నముతోడను గూడ = సరవిగా దతియను బొందె దెరగున నీబప్తి స్తోదకములయు - బరిని వ్యాపించియుండుటకు - ప్రార్థించుచు నిన్ను ||యాచరించు||

4.పరయానంద వదనము నీ - దరికరాఁగిగోరు వీరి న్నీ - పరమ కృపన్ దీవించి నీ - కరుణా కటాక్షేక్షన్ = స్థిరతఁ బాంచియాత్మలకు - నీ మహిమ కిరణములు - నెరపు మో అభువాయని - నిన్ను వేడుచు ||నాచరించు||
- విలియం డాకన్ 

16 May 2025

Aaradhana yesu neeke ఆరాధన యేసు నీకే



ఆరాధన యేసు నీకే - ఆరాధన యేసు నీకే (2)
నీ చిత్తము నే చేసెద - నీ బాటలో నే నడిచెద (2)
నీ వాక్యములొ నే నిలిచెద - నిను వెంబడించెద (2)||ఆరాధన||

1. గాలి నీరు అగ్నియు - నీ అద్భుత మాటకు   
లోబడుచునే ఉన్నవి - అన్నీ వేళలా (3)
ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే (2)

నీ చిత్తమునే చేసేద – నీ మార్గములోనే నడిచెద
నీ చిత్తమునే చేసాడా – నీ మార్గములో నడిచెద
నీ సన్నిధిలోనే నిలచెద – నిను వెంబడించెద || ఆరాధన యేసు నీకే||
నీ సన్నిధిలో నే నిలిచెడా – నిన్ను వెంబదించేదా || ఆరాధన యేసు నీకే ||

2. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్   
చూచు చూనే నడచెద - అన్నీ వేళలా (3)
ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే (2)

16 December 2024

Aakasha veedhilo ఆకాశవీధిలో ఒక తార వెలిసింది

ఆకాశవీధిలో ఒక తార వెలిసింది 

ఆకాశవీధిలో ఒక తార వెలిసింది 
విలువైన కాంతులతో ఇల త్రోవ చూపింది 
నశీధిరాత్రిలో నిజదేవుడు పుట్టాడని 
నిత్యరాజ్యము చేర్చు టకై రక్షకుడుదయించాడని 
జగమంతటా జయకేతనమైసాక్షిగ నిలిచింది 
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ 
ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా (2) ||ఆకాశ వీధిలో||

1. పరిశుద్దాత్మతో జననం పవిత్రత నిదర్శనం - 
పరమాత్ము ని ఆగమనం పాపాత్ము ల విమోచనం (2) తండ్రిచిత్తమును నెరవేర్చే తనయుడైపుట్టెను - 
తన పథములో మనల నడిపించేకాపరైవచ్చె ను (2)
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ 
ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా (2) ||ఆకాశ వీధిలో||

2. దివినేలే రారాజు దీనునిగా జన్మించెను - 
దిశలన్ని చాటేలా శుభవార్తను ప్రకటింతుము (2)
చిరునవ్వు లు చిందించేశిశువైమదిమదినీ మీటెను - 
చిరు జ్యో తులు మనలో వెలిగించి చింతలే తీర్చెను (2) 
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ 
ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా (2) ఎంతో ఉత్సాహమే

07 May 2023

Adarna leni na jeevithana | ఆదరణ లేని నా జీవితాన


ఆదరణ లేని నా జీవితాన
నన్ను ఆదరించిన మహనీయుడా
ఏ దిక్కు లేని నా జీవితాన
నన్ను చేరదీసిన నజరేయుడా
నా ఆశ్రయము నీవే - నా ఆధారం నీవే  ||ఆదరణ||

1.దేవెనలే నాకు దూరమాయెను -
దీవెనలు ఇచ్చి ఘనపరచినావె (2)
ఘనుడా నిన్ను స్తుతియించి కొనియాడెదన్ - ఘనుడా నిన్ను కీర్తించి ఘనపరచెదన్ (2) ||ఆదరణ||

2.నా పాపము నన్ను పట్టించినా - నా ఎదుటే నిలచి దయ చూపినావే (2)
దయాలుడ నిన్ను స్తుతియించి కొనియాడెదన్ -
దయాలుడ నిన్ను కీర్తించి ఘనపరచెదన్ (2) ||ఆదరణ||

3. బలములేక నేను కృంగి పోతిని బలమునిచ్చి నన్ను బలపరచినావే (2)
బలవంతుడ నిన్ను స్తుతియించి కొనియాడెదన్ -
బలవంతుడ నిన్ను కీర్తించి ఘనపరచెదన్ (2) ||ఆదరణ||

16 February 2023

Aasha theera naa yesu swaamini ఆశ తీర నా యేసు స్వామిని

 
ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను
ఆత్మతో సత్యముతో స్తుతించెదను
ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము
ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ||
 
దుప్పి నీటికై ఆశపడునట్లుగా
దేవుని కొరకై ఆశ పడుచున్నాను
దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2)
దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత||
 
లోక ఆశలు లయమైపోవును
లోకులెవ్వరు కాపాడలేరు
లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2)
లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత||
DOWNLOAD MP3 SONG HERE 👇

16 December 2022

Aanandamu prabhu nakosagenu | ఆనందము ప్రభు నాకొసగెను

ఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను (2)
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను (2) ||ఆనందము||

ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము||

అలల వలె నా సంతోషము
పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)
నన్ను పిలిచి మేలులెన్నో చేసే
నూతన జీవమొసగెన్ (2) ||ఆనందము||

శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్ (2)
ప్రభువుతో లోకమున్ జయించెదన్
ఆయనతో జీవించెదన్ (2) ||ఆనందము||

20 November 2022

Aananda geetham ne paadeda | ఆనందగీతం నే పాడెద



ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో
సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో
"దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో 
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||

1.ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను
మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను 
"దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో 
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||

2.దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి
బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి 
"దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో 
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||

3.జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను
కన్యక గర్భాన ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను 
"దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను" ||ఆనందగీతం||

12 June 2022

Aathmanosagumayaa paavanaathma ఆత్మనొసగుమయా పావనాత్మ

757
ఆత్మనొసగుమయా పావనాత్మ నొసగుమయా 
శుద్ధాత్మ దేవా - శుభముల దాత - ఉజ్జీవ మీయుమయా ||ఆత్మ||

1.సీయోను గిరిపైన - ఉన్నత గృహమందు (2)
నీ ఆత్మ వరముల - నొందిన శిష్యుల - అనుభవ మీయువయా ||ఆత్మ||

2.యోర్దాన్ తీరమున - పావుర రూపమున (2)
నీ సుతుడేసుకు - ప్రభవించితివే - ఆ యాత్మ నొసగుమయా ||ఆత్మ||

3.జీవన యాత్రలో - ఎన్నెన్ని అవధులున్నా (2) 
పునరుత్థాన - శక్తితో నింపి - నవజీవ మీయుమయా ||ఆత్మ||

4.ఈ మా సంఘములో - ఐక్యత సమకూర్చి (2)
పరిశుద్ధాత్మ - శక్తితో నింపి - పావన పరచుమయా || ఆత్మ||
– బిషప్ దైవాశీర్వాదం గోవాడ

06 June 2022

Aagaka saaguma sevalo | ఆగక సాగుమా సేవలో

ఆగక సాగుమా - సేవలో సేవకా (2)
ప్రభువిచ్చిన పిలుపును - 
మరువక మానక (2) ||ఆగక||

పిలిచినవాడు ప్రభు యేసుడు -
ఎంతైనా నమ్మదగినవాడు (2)
విడువడు నిన్ను ఎడబాయడు -
నాయకుడుగా నడిపిస్తాడు (2) ||ఆగక||

తెల్లబారిన పొలములు చూడు - 
కోత కోయను సిద్ధపడుము (2)
ఆత్మల రక్షణ భారముతో -
సిలువనెత్తుకొని సాగుము (2) ||ఆగక||
DOWNLOAD MP3 SONG HERE 👇

28 April 2022

Aaradhinthu ninnu devaa | ఆరాధింతు నిన్ను దేవా

ఆరాధింతు నిన్ను దేవా - ఆనందింతు నీలో దేవా
ఆరాధనలకు యోగ్యుడా - స్తుతి పాడి నిన్ను పొగడెదను 
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే 

1.యెరికో గోడలు అడ్డువచ్చినా - ఆరాధించిరే గంభీరముగా 
కూలిపోయెను అడ్డుగోడలు - సాగిపోయిరి కనాను యాత్రలో

2.పెంతెకొస్తు పండుగ దినమునందు - ఆరాధించిరందరు ఐక్యతతో 
కుమ్మరించెను అగ్నిజ్వాలలు - నింపబడెను ఆత్మ బలముతో 

3. పౌలు సీలలు బంధింపబడగా - పాటలు పాడి ఆరాధించగా 
బంధకములు త్రెంచబడెను - వెంబడించిరి యేసయ్య నెందరో
English Lyric:
Āarādhinthu ninnu dēvā ānandinthu neelō dēvā 
Aarādhanalaku yōgyuḍā sthutihi paāḍi ninnu pogaḍedanu 
Aārādhana aārādhana aārādhana neekē 

1.Yerikō gōḍalu aḍḍuvachinā - aarādhin̄chirē gambhīramugā 
Kūlipōyenu aḍḍugōḍalu - sāgipōyiri kanānu yāthralō

2.Pentekosthu paṇḍuga dinamunandu - aārādhin̄cirandaru aikyathathō Kummarin̄chenu agnijvālalu - nimpabaḍenu aāthma balamuthō 

3.Paulu sīlalu bandhimpabaḍagā - paāṭalu paāḍi aārādhin̄chagā 
Bandhakamulu tren̄chabaḍenu - vembaḍin̄ciri yēsayya nendharō

25 April 2022

Aaradhana aaradhana | ఆరాధన ఆరాధనా నా యేసు

పాస్టర్ : వై . జెమ్స్ పౌల్ 

ఆరాధన ఆరాధనా - నా యేసు కే ఆరాధనా (2)
జివించువాడవు జీవమిచ్చువాడవు 
మొడైన జీవితాన్ని చిగురింపచేసావు
నీవే దేవుడవు చూచుచున్న దేవుడవు 
నీవే దేవుడవు వినుచున్న దేవుడవు (2) ఆరాధనా ......

వ్యాది భాధలలో నేను వుండగా - నాకు స్వస్థత నిచ్చితివి 
బలహినముగా నేను వుండగా నన్ను నీవు బలపరచి నడిపించితివి ఆరాధనా ......

అప్పు భాధాలలో నేను వుండగా - తీర్చు కొనుటకు మార్గము చుపితివి 
శాంతి సమాధానం లేనప్పుడు నీ శంతినే నాకు ఇచ్చి తివి ఆరాధనా .....

02 March 2022

Aaha yenthati shramala bondithi | ఆహా యెంతటి శ్రమలఁ బొందితి

190
క్రీస్తు మరణము
రా- హిందుస్థానీ తోడితా - త్రిపుట 

ఆహా యెంతటి శ్రమలఁ బొందితి - వయ్యో - దాహ మాయెను నీకు సిల్వపై = ద్రోహు లందరు గూడి రయ్యయ్యో - నీదు - దేహంబు బాధించి రయ్యయ్యో ||యాహా||

1.దుష్కర్ములకు నప్పగించెనా -  యూద - యిస్కరి యోతనెడి శిష్యుడు - తస్కరించినవాని భంగిన నిన్ను - నిష్కారణముగాను బట్టిరా ||ఆహా||

2.కలుషాత్ములందరు గూడిరా - నిన్ను - బలువిధంబుల హింసబెట్టిరా - తలపై ముళ్ల కిరీటముంచి యా - సిలువ నీతోనే మోయించిరా ||ఆహా||

3.కాలుసేతులయందు వారలు - ఇనుప - చీలల దిగగొట్టిరయ్యయ్యో = జాలి - సుమంతైన జూపక - వారు - గేలిజేయుచు బాధపెట్టిరా ||ఆహా||

4.బాధ తగ్గింపరాణువవారలు - నీకు చేదు ద్రాక్షారసము నివ్వగా = నీదు మనస్సు దానినొల్లక గొప్ప - వేదనలను భరియించెనే ||ఆహా||
 – కొత్తపల్లి జాన్

Aa yandhakarapu reyilo | ఆ యంధకారంపు రేయిలో

178
ఆయన అప్పగింపబడిన రాత్రి
రా - అసావెరి,  తా - రూపకము

యంధకారంపు - రేయిలో క్రీస్తు పడు - నాయాసములు దలఁచరే = సాయంతనము శిష్య - ¹నమితితో భోజనముఁ -  జయఁగూర్చున్న ప్రభువు - భక్తుల కనియె ||నా యంధ||

1.ఒకఁడు మీలో నన్ను - యూద ²గణముల చేత - లకు నప్పగింపఁ దలఁ చెన్ - ³మొక మిచ్చకము గల్గు - మూర్ఖుఁడగు యూదాను - ⁴మొనసె వీడనుచుఁ దెలిపి యికఁ మిమ్ముఁగూడియుం - డకయుందునని రొట్టె విరిచి స్తోత్రంబుజేసి = ప్రకటంబుగా - దీని భక్షించుఁడని పిదప - నొక పాత్ర ⁵నాన నిచ్చెన్ - ద్రాక్షారసం ||బా యంధ||

2.తన మేని గురుతు రొ - ట్టెను జేసి పాపవిమో - చనమైన రక్తమునకు - నొనరంగ ద్రాక్షారస - మును గురుతుగాఁ దెలిపి - నెనరుగల కర్త యపుడు - చనె గెత్సెమను వన - స్థలిలోన శిష్యుల - నునిచి తానొక్కరుండు = మనసు వ్యాకులము చే-తను నిండియుండఁగా - ఘనుడు ప్రార్ధించెఁదండ్రిన్ - గాఢముగాను ||ఆ యంధ||

3.శ్రమచేతఁ దన శరీ - రము నుండి దిగజారెఁ - జెమట రక్తపు బొట్లుగా - ⁵నమితమౌ లోకపా - పముఁ జూచి నిట్టూర్పులప్పటప్పటికిఁ బుచ్చి - క్రమముగా దూత తన కడ ⁶కరుగుదెంచి శాం - తముఁ బల్కి చనిన ⁷పిదపం = తమ మనంబులఁ బోలు - ⁸తమసమున యూద సై - న్యము ⁹లేగుదెంచె నపుడు - గెత్సెమను పనికి ||నా యంధ||

4.పరశాంతి ¹⁰శీల స - ర్వజ్ఞతలు గల ప్రభుం - డెరిఁగి తనకున్న పాట్లు - ¹¹పరిపంధి గణముతోఁ - బలికె మీరిచ్చోట - నరయుచున్నా రెవనిని - నరులు నజరేతు యే - సను వాని ననఁగఁ దా - నెఱిఁగించె నేనేయని = ¹²గురుదీప శిఖల ¹³సో - కు ¹⁴పతంగముల భంగి - ధరణిపైఁ బడిరి వారల్ - ¹⁵దర్పము లణఁగి ||యా యంధ||

5.తన శిష్యులను విడువుఁ - డని ¹⁶రిపులచేఁ దానె పట్టువడియెన్ - ¹⁷కినిపి పేతురు యాజ - కుని దాసు ¹⁸కర్ణంబు - ¹⁹దునుమంగ క్రీస్తుఁడపుడు - కనికరంబున స్వస్థ - తను జేయు నావిభుని - కరములను విరిచి కట్టి = వెనుక ముందరఁ జుట్టు - కొని యెరూషలేము పుర - మునకుఁ దీనుకఁ బోయిరి - రాణువవార||లాయంధ||
                              - పురుషోత్తమ చౌదరి
_________________________________
¹సమూహము. ²సమూహముల. ³ముఖస్తుతి చేయు. ⁴సిద్ధపడెను. ⁵అపరిమితమైన. ⁶వచ్చి. ⁷పిమ్మట. ⁸చీకటిలో. ⁹వచ్చెను. ¹⁰మంచి స్వభావము. ¹¹శత్రువులు. ¹²గొప్పదీప జ్వాలలు. ¹³తగులు. ¹⁴మిడతలవలె. ¹⁵గర్వములు. ¹⁶శత్రువులచేత. ¹⁷కోపించి. ¹⁸చెవి. ¹⁹కోయగా.

18 January 2022

Aapthulaina vaare haaniceya | ఆప్తులైన వారే హానిచేయ


ఆప్తులైన వారే హాని చేయచూసినా - మిత్రులే నిలువకుండినా (2) 
న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) 

నమ్మకమైన దేవుడవైన - నీవే చాలు యేసయ్యా (2)
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)
ఇంకేమి కోరుకోనయ్యా (2) 

నను చుట్టుముట్టిన బాధలతో - నాహృదయం కలవరపడగా 
నా స్వంత జనుల నిందలతో - నా గుండె నాలో నీరైపోగా (2) 
మించిన బలవంతుల చేతినుండి - తప్పించిన యేసు దేవుడా 
వంచనకారుల వలల నుండి - రక్షించిన హృదయ నాధుడా 

నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
మిక్కుట ప్రేమను చూపితివే - నను ఓదార్చితివే (2) 

ఎరిగియున్నానయా నీకేదీ - అసాధ్యము కాదని తెలుసుకున్నానయా నీవెపుడూ - మేలు చేస్తావని 

మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని (2) 
మారని వాగ్దానములు మాకొరకు - దాచి ఉంచినావయా 
DOWNLOAD MP3 SONG HERE 👇

02 January 2022

Aasheervadapu Thalupulu Therachi | ఆశీర్వాదపు తలుపులు తెరిచి

ఆశీర్వాదపు తలుపులు తెరిచి 
లోనికి నన్ను ప్రవేశింప చేసి 
ఉల్లాస వస్త్రము నా చేతికిచ్చి 
ఉత్సాహగానము నా గొంతు నుంచి 

సంతోష గీతము పలికించెను 
సువార్త సేవ లో నన్నుంచెను 

పాపి నై నేనుండగా - పరలోకాన్ని విడిచి 
పశువుల పాకలో పసిబాలుడుగా పుట్టి 

దుష్టత్వము లో నేనుండగా - 
దురాత్మలను తరిమివేసి
కోల్పోయిన దానిని తిరిగి నాకు ఇచ్చి 

మరణములో నేనుండగా 
మరణ కట్లను తెంచివేసి 
జీవపు మార్గమును నా ముందు నుంచి

Aaradhinchedam Aarbhatinchedam |ఆరాదించెదం ఆర్భాటించెదం

ఆరాదించెదం ఆర్భాటించెదం
మన యేసు రాజునే కీర్తించెదం
స్తుతి ఘనత మహిమ నిరతం రారాజుకే

1. సింహాసనాసీనుడైన దేవుడు
సాతానుపై జయమిచ్చు దేవుడు
ఏ అపాయము రానీయడు
ఏ కీడు నీ దరికి చేరనీయడు

2. వాగ్దానము నెరవేర్చే దేవుడు
తన కృప మనకు నిత్యం దయచేయును
హల్లేలూయ గానాలతో
ఆయన నామం ఘనపరచెదము
ఆరాధన స్తోత్రార్పణ మన యేసుకే
స్తుతి ఘనత మహిమ నిరతం రారాజుకే

Aanandam Pongindi | ఆనందం పొంగిందీ అపరాధం

ఆనందం పొంగిందీ - అపరాధం పోయింది 
జీవితం మొదలైంది - ఈ అనుభవము నాలో (2)
రక్షణ ఆనందం - శ్రీ యేసు నీ జననం 
తీయని అనురాగం - నీతోనే నా పయనం (2) 
ఊహించిన వివరించిన - సరపోదయ్యా (2) || ఆనందం || 

చీకటి ఆవరించే నెమ్మదిలేక - కలవరమాయె నీవు లేక (2)
నా హృదయంలో జన్మించిన క్షణం - పగలు రేయి పరవశిస్తున్న ప్రతీదినం (2) 
కనుల పండుగ గుండె నిండుగా (2) || ఆనందం || 

ఎదురు చూసాను గమ్యం లేక - నీవొస్తావని చిన్ని కోరిక (2)
దిగివచ్చావు శరీరదారియై - తరియించింది మానవాళి ఏకమై (2)
నీ జన్మము సమాధానము (2) || ఆనందం ||

Aadali aadali | ఆడాలి ఆడాలి

రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు (2)

ఆడాలి... ఆడాలి (2)
ఆడాలి.. ఆడాలి ఆనందంగా ఆడాలి 
పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి (2) 
సంగీత నాధముతో చిందులెన్నో వేయాలి (2) ఎందుకంటే 
యేసు పుట్టాడు మహారాజు వచ్చాడు (4)

ఇశ్రాయేలు వారసుడు యూదా సింహం వచ్చాడు (2) 
అందరికి ఆదర్శంగా ఆధికారంతో బోధించాడు (2) అందరివాడు... మన అందరివాడు (2) 

పుట్టుకలో పవిత్రుడు పావన మూర్తి అతడు (2)
పాపులను ప్రేమించి పరలోకం దిగివచ్చాడు (2) అందిరివాడు .. మన అందరివాడు (2)

Aadharam Neeve Yesayya | ఆధారం నీవే యేసయ్యా

ఆధారం నీవే యేసయ్యా - ఆనందం నీవే మెస్సయ్యా (2) 
నాతల్లియు నీవే నాతండ్రియు నీవే - నాకున్నది నీవే నేనున్నది నీకే 
ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2)

1. బంధువులే నన్ను బాధపరచిన - ఆత్మీయులే నన్ను ఆదరించక పోయన (2) 
కళ్ళలో కన్నీరు కదులుతూనేఉన్న - హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్న (2)
ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2) ||ఆధారం||

2.  అశాంతి నాలో నిలువునా అలుముకుంటున్నా -
ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా (2)
భవిష్యత్తే నాలో భయమే లేపుతున్న - బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా (2) 
ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2) ||ఆధారం||

23 November 2021

ఆశీర్వాదములకు వారసులైయుండుడి

🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము ⛪
✝️ *ఆశీర్వాదములకు వారసులైయుండుడి*✝️

"ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను, దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి." 
1 పేతురు 3:9  

విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవితం ఏమిటో ఈ వాక్యంలో కనబడుచున్నది. ఇతర విశ్వాసుల పట్ల, క్రీస్తు పట్ల, మరియు శత్రువులు పట్ల కూడా ప్రేమ చూపించే వానిగా నీవు ఉండాలి. ఇతరులను ప్రేమించినట్టు నటిస్తే ఏదో లాభం కలగవచ్చు అనుకునే ఆలోచనలు పొరపాటు. ప్రేమిస్తే ఆయనకు వ్యతిరేకమైన వాటినన్నింటినీ అసహ్యించుకోవడం నేర్చుకుంటాము. క్రీస్తు ప్రేమించిన రీతిగా నీవు కూడా మనుషులను ప్రేమించాలి గానీ దూషించుకుడదు. దేవుని ప్రేమిస్తే ఆయన సేవలో మనకు ఆసక్తి ఉంటుంది. నిజానికి ఆయన పట్ల నీ ప్రేమని మాటల్లో గాక, ఆయనకు కోసం నీవు చేసేదానిలోనే వెల్లడి అవుతుంది. మంచి ప్రవర్తనతో క్రీస్తు బిడ్డ గా మాదిరికరంగా జీవిస్తే, దేవుడు నిన్ను తన వారసునిగా ఆశీర్వదిస్తాడు అటువంటి ప్రేమ కలిగి జీవించుట కృప నీకు తోడైయుండును గాక!

🛐 *ప్రార్థన*🛐
 నా ప్రియ ప్రభువా! నేను మీ నిత్య సన్నిధిలో ఆశీర్వాద వారసునిగా నుండునట్లు నీవు నన్ను ప్రేమించినట్లు నేను కూడా ఇతరులను ప్రేమించు జ్ఞానముతో నన్ను నింపుమని యేసుక్రీస్తు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...