Showing posts with label 144 క్రీస్తే సర్వాధికారి. Show all posts
Showing posts with label 144 క్రీస్తే సర్వాధికారి. Show all posts

02 August 2020

Kreesthe Sarvadhikari క్రీస్తే సర్వాధికారి

144
యేసే సర్వాధిపతి 

క్రీస్తే  సర్వాధికారి - క్రీస్తే మోక్షాధికారి 
క్రీస్తే మహోపకారి - క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే||  

1.ముక్తి విధాత నేత - శక్తి నొసంగుదాత
భక్తి విలాప శ్రోత - పరమంబు వీడె గాన ||క్రీస్తే||  

2.దివ్య పథంబురోసి - దైవంబు తోడుబాసి
దాసుని రూపుదాల్చి - ధరణి కేతెంచెగాన ||క్రీస్తే||  

3.శాశ్వత లోకవాసి - సత్యామృతంపురాశి
శాప భారంబు మోసి - శ్రమల సహించెగాన ||క్రీస్తే|| 

4.సైతానుజనము గూల్చన్ - పాతాళమునకు బంపన్
నీతి పథంబు బెంప - రుధిరంబు గార్చెగాన ||క్రీస్తే||  

5.మృత్యువుముల్లు తృంపన్ - నిత్యజీవంబు బెంపన్ 
మర్త్యాలిభయము దీర్పన్ - మరణంబు గెలిచెగాన||క్రీస్తే||  

6.పరమందు దివిజులైన - ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు - ప్రభునే భజించుగాన||క్రీస్తే||  

7.ఈ నామమునకు మించు - నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్- హెచ్చించి నాడుగాన||క్రీస్తే||
రావూరి రత్నము
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...