Showing posts with label Bro.Yesanna songs. Show all posts
Showing posts with label Bro.Yesanna songs. Show all posts

24 September 2022

Niluvaramaina pattanamu|నిలువరమైన పట్టణము మనకిలలో


నిలువరమైన పట్టణము మనకిలలో లేదురా మానవా యాత్రీకులము .. ఆయుష్కాలము పరదేశులము ధరణిలోన || నిలువరమైన || 
 

1.శాశ్వతమైన సహవాసమును కోరి జీవించెను హేబేలు కయ్యిను కంటే శ్రేష్ఠమైన బలి అర్పించెను దేవునికి || నిలువరమైన || 

2. భయము భక్తి గల సహవాసము చేసెను నోవాహు దేవునితో ఇంటి వారి రక్షణ కొరకై సిద్ధము చేసెను ఓడను || నిలువరమైన || 

3.కోరుకొనిన సహవాసముతో నడచెను యాకోబు దేవునితో నీవు నను దీవించు వరకు విడచి వెళ్ళని దీనుడను  

4.త్యాగము చేసిన అబ్రహాము స్నేహము చేసెను దేవునితో || నిలువరమైన || ఇస్సాకును బలి అర్పించి అయ్యెను తండ్రి విశ్వాసులకు  

5.శోధనలో సహవాసము చేసెను యవ్వనుడైన యోసేపు పాపమును జయించిన వాడై వెళ్ళెను ఐగుప్తు ప్రభువుగా || నిలువరమైన ||

13 March 2022

Athi sundarudavu yesayya | అతి సుందరుడవు యేసయ్య

Hosanna Ministries 32nd Album [ Srikaruda Naa Yesayya ] Song - 6 - " అతిసుందరుడవు " Athisundarudavu

అతి సుందరుడవు యేసయ్య - మనోహరుడవు నీవయ్యా (2)
యథార్థవంతుడు సభలో - పరిశుద్ధులతో కలసి నిను ఆరాధించెదను (2) 
హల్లెలూయ.. హల్లెలూయ.. హోసన్నా. ఆరాధన (2)

1. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు - కృపాక్షేమములు నీ మందిరములో - సమృద్ధిగా కలవు (2)
నే దీనుడనై నీసన్నిధిని అనుభవించెను (2)
పరవశించి..పరవళ్లు తొక్కి.. ఆరాధించెదను (2) ||అతి||

2. అమూల్యములైన వాగ్దానములు అనుగ్రహించావు
అత్యధికముగా ఆశీర్వదించి - హెచ్చించి యున్నావు (2)
విశ్వాసముతో ఓర్పు కలిగి - వాగ్దానము నే పొందెదను (2)
సంపూర్ణతకై.. పరిశుద్ధుడనై.. ఆరాధించెదను (2) ||అతి||

3. మహారాజువై సీయోనులో ఏలుచున్నావు - పునాదులుగల పట్టణములు కట్టుచున్నావు (2)
సౌందర్యముగల సీయోనులో ప్రకాశించుచున్నావు (2)
నీ మహిమనుపొంది.. నీ దరిచేరి.. ఆరాధించెదను (2) 

అతి సుందరుడవు యేసయ్య - మనోహరుడవు నీవయ్యా (2)
యథార్థవంతుడు సభలో - పరిశుద్ధులతో కలసి నిను ఆరాధించెదను (2) 
ఆరాధనకు నీవు యోగ్యుడవు స్తుతులకు నీవె పాత్రుడవు

28 March 2021

Naa deepamu yesayya neevu | నా దీపము యేసయ్యా నీవు

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
సుడిగాలిలోనైనా జడి వానలోనైనా
ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము (2)

1. ఆరని దీపమై దేదీప్యమానమై
నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2)
చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము||

2. మారని నీ కృప నను వీడనన్నది
మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2)
మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము||

3. ఆగని హోరులో ఆరిన నేలపై
నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2)
పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము||
DOWNLOAD MP3 SONG HERE 👇

02 August 2020

Athyunnatha Simhasanamupai Aasinudavaina | అత్యున్నత సింహాసనముపై

అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే
అ.ప: ఆహాహా - హల్లెలూయా (3) ఆహా ఆమేన్

1. ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం ||అత్యు||

2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం 
నీ రక్తమిచ్చి విమోచించినావే -  నా రక్షణ కర్త స్తోత్రం ||అత్యు||

3. ఆమేన్ అనువాడా స్తోత్రం -  అల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడా - అత్యున్నతుడా స్తోత్రం ||అత్యు|| 

4. యుగయుగములు సజీవుడా స్తోత్రం - తరతరముల దేవుడవు స్తోత్రం 
ఏడు దీప స్థంభముల - మధ్య సంచరించే 
జ్యోతిర్మయుడా స్తోత్రం ||అత్యు||

5. అతి కాంక్షణీయుడా స్తోత్రం - అతి సుందరుడా స్తోత్రం 
అతి మనోహారుడా - మహిమాన్వితుడా - ఆరాధ్యుడా నీకు స్తోత్రం ||అత్యు||

6.స్తుతులపై ఆసీనుడా స్తోత్రం - సంపూర్ణుడా నీకు స్తోత్రం 
మా ప్రార్థనలను ఆలకించువాడా - మా ప్రధాన యాజకుడా స్తోత్రం||అత్యు||

7.మృత్యుంజయుడా స్తోత్రం - మహాఘనుడా స్తోత్రం 
మమ్మును కొనిపోవా త్వరలో రానున్న -  మేఘవాహనుడా స్తోత్రం ||అత్యు||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...