Showing posts with label Christian marriage songs lyrics. Show all posts
Showing posts with label Christian marriage songs lyrics. Show all posts

14 July 2021

Kaliseti Andala Anubhandame | కలిసేటి అందాల అనుబంధమే ఇది



కలిసేటి అందాల అనుబంధమే - ఇది ఏనాటికైనా మహనీయమే 
ఎన్నెన్నో కాలాల అనురాగమే - ఈనాడే ఇలలో శ్రీకారమే 
కమనీయమైన కళ్యాణమే 

1. ఇరువురూ ఏకమై జీవించాలీ - దేవుని ప్రేమలో ఒదిగిపోవాలీ 
కలిమిలో లేమిలో ప్రేమించాలీ - మమతలే మల్లెలై పరిమళించాలీ 
మురిసిపోయే వేదిక - మరువలేని వేడుక 
ఒకరికొకరు తోడుగా - ప్రభువు చేసే జంటగా 

ప్రేమానురాగాల ఈ బంధమే - మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా - కళ్యాణమే 

2. గుణములే సిరులుగా స్వీకరించాలీ - చెరగనీ స్నేహమై నిలిచిపోవాలీ 
క్రీస్తులో పయనమే సాగించాలీ - వాక్యమే మనసులో పదిలమవ్వాలీ 
ప్రభువు ద్రాక్షావల్లిగా - ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా - తరములెన్నో చూడగా

పరిశుద్ధ దేవుని నిర్ణయమే - వైభోగమేగా శుభకరమే కమనీయమైన కళ్యాణమే

03 June 2021

Vachindi Vachindi Madhuramaina | వచ్చింది వచ్చింది మధురమైన సమయం

వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం రావయ్యా వరుడా (రావమ్మ వధువా) 
సుస్వాగతం నీ కోసమే ఈ స్వాగత గీతం 

1. మల్లెలు పరిమళం చల్లినవేళ - అల్లరి తెమ్మెర తాకినవేళ 
వెల్లువై ఆనందం పొంగినవేళ మెల్లగ నీ పతి దరిచేరగా 

2. కోయిల గానాలు వినిపించువేళ - కోరిన ఘడియలు ఎదురైనవేళ 
చామంతులే పలకరించిన వేళ చేయందుకొని సతిని స్వీకరించగా 

3. పరలోక వాకిళ్ళు తెరచుకున్నవేళ - పరమాశీర్వాదాలే కురియుచున్నవేళ 
మనసైన నీ వరుడు ఎదురు చూచువేళ వినయముగా నీ ప్రియుని సంధించగా

DOWNLOAD MP3 SONG HERE 👇

09 May 2021

Idi devuni nirnayamu ఇది దేవుని నిర్ణయము మనుష్యులకిది

ఇది దేవుని నిర్ణయము -మనుష్యులకిది అసాధ్యము (2)
ఏదేను వనమందు - ప్రభు స్థిరపరచిన కార్యము (2) 
ప్రభు స్థిరపరచిన కార్యము ||ఇది దేవుని||

1.ఈ జగతి కన్నా మునుపే - ప్రభు చేసెను ఈ కార్యము (2) 
ఈ ఇరువురి హృదయాలలో - కలగాలి ఈ భావము (2) నిండాలి సంతోషము ||ఇది దేవుని||

2.వరుడైన క్రీస్తు ప్రభువు - అతి త్వరలో రానుండెను (2) 
పరలోక పరిణయమే - మనమెల్లరము భాగమే (2) 
మనమెల్లరము భాగమే ||ఇది దేవుని||
______________________________
Idi Devuni Nirnayamu - Manushyulakidhi Asadhyamu (2)
Yedenu Vanamandhu - Prabhu Sthiraparachina Karyamu(2) 
Prabhu Sthiraparachina Kaaryamu ||Idi Devuni||

Ee Jagathi Kanna Munupe - Prabhu Chesenu Ee Kaaryamu (2) 
Ee Iruvuri Hrudayalalo - Kalagali Ee Bhavamu (2) 
Nindaali Santhoshamu ||Idi Devuni||

Varudaina Kreesthu Prabhuvu - Athi Thvaralo Raanundenu (2) 
Paraloka Parinayame - Manamellaramu Bhagame (2) 
Manamellaramu Bhagame ||Idi Devuni||

DOWNLOAD MP3 SONG HERE 👇

06 June 2020

Manavula melu koraku | మానవుల మేలు కొరకు

563
వివాహము
రా - జంఝూటి,  తా - ఆది

మానవుల మేలు కొరకు - జ్ఞానియైన దేవుడుమానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా ||మాన||

1.కానాయను నూరిలో మన - కర్త చూచె బెండ్లిని =  పానముగను ద్రాక్షరసము - దాన మొసగె బ్రీతిని ||మాన||

2.యేసు వీరిద్దరిని - ఏకముగా జేయుమీ = దాసులుగను జేసి వీరి - దోసము లెడ బాపుమీ ||మాన||

3.కర్త వీరలకు భార్య - భర్తల ప్రేమంబును = బూర్తిగ నీ విచ్చి వీరి - బొందుగాను నడుపుమా ||మాన||

4.భక్తియు విశ్వాస ప్రేమలు- భావమందు వ్రాయమి = ముక్తి సరణి వెదక వీరి - భక్తి మిగుల జేయు మీ ||మాన||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...