Showing posts with label కల్వరి త్యాగము సజీవ సాక్షిగా. Show all posts
Showing posts with label కల్వరి త్యాగము సజీవ సాక్షిగా. Show all posts

19 March 2022

Kalvary thyagamu sajeeva sakhsiga | కల్వరి త్యాగము సజీవ సాక్షిగా

కల్వరి త్యాగము సజీవ సాక్షిగా 
నాడు నేడు ఎన్నడు నిరతము నిలచీవున్నది
యేసయ్యా యేసయ్యా నీ త్యాగము వర్ణింప సాధ్యమా 
యేసు నీ రక్తమే జయము ప్రభు క్రీస్తు నీ రక్తమే జయము 

నీ మందిర గడపన గడిపిన ఆ క్షణములు ఎంతో భాగ్యము 
నీ కౌగిలిలో నన్ను హత్తుకొనిన నా కెంతో భాగ్యము
నా హృదయ లోలోతుల్లోకి తొంగి చూసే దేవుడు నీవే
నా కార్యాలన్ని ముందుగా గమనించే దేవుడు నీవే

లోకానికి విజయము నిచ్చిన నీ త్యాగము 
నరుల పాపాలు కడిగే (తుడిచే) ఎకైక త్యాగము 
యేసు నీ రక్తమే జయము ప్రభు క్రీస్తు నీ రక్తమే జయము 

నీ సువార్త పనిలో తిరిగిన ఆ క్షణములు ఎంతో భాగ్యము ఆకలి దప్పిక వేదన పడినా నా కెంతో భాగ్యము నీ ప్రక్కటి తగిలిన (పడినా) గాయము తాకిన ఎంతో భాగ్యము 
నీ దివ్య ముఖమును దర్శించినా నాకెంతో భాగ్యము
ఈ ధరణికే ఎనలేని త్యాగము 

లోకానికి విజయము నిచ్చిన నీ త్యాగము 
నరుల పాపాలు కడిగే (తుడిచే) ఎకైక త్యాగము
యేసు నీ రక్తమే జయము ప్రభు క్రీస్తు నీ రక్తమే జయము.

రచన & స్వరకల్పన: ప్రేమ్ కుమార్ 
సంగీతం: దీపక్ 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...